breaking news
retaired rjd
-
రిటైర్డ్ ఆర్జేడీ దారుణహత్య
-
రిటైర్డ్ ఆర్జేడీ దారుణహత్య
నెల్లూరు: నెల్లూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని ఉస్మాన్సాహెబ్పేటలో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్జేడీ విజయలక్ష్మీ ఇంట్లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి.. ఆమెను దారుణంగా హతమార్చారు. ఇంట్లోని నగలు, నగదుతో ఉడాయించారు. శుక్రవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. తెలిసిన వాళ్ల పనే అయిఉంటుందని అనుమానిస్తున్నారు.