breaking news
Restrained
-
అమెరికా విమానంలో వ్యక్తి అలజడి..
వాషింగ్టన్: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అలజడి సృష్టించాడు. విమానం గాల్లో ఎగురుతుండగానే అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయతి్నంచాడు. తోటి ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరుస్తున్నా పట్టించుకోలేదు. దాంతో వారంతా అతడిని బంధించి, బలంతంగా సీట్లో కూర్చోబెట్టి, మళ్లీ లేవకుండా టేపుతో కట్టేశారు. అమెరికాలో న్యూమెక్సిలో రాష్ట్రంలోని అల్బుక్విర్కీ సిటీ నుంచి షికాగోకు బయలుదేరిన 1219 విమానంలో(బోయింగ్ 737) ఇటీవలే ఈ ఘటన చోటుచేసుకుంది. అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరిన 30 నిమిషాలకు సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులంతా అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి, అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టులో దించారు. గందరగోళానికి కారణమైన ప్రయాణికుడిని కిందికి దించి, పోలీసులకు అప్పగించారు. అతడు ఎందుకలా చేశాడన్నదానిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
తలసాని కుమారునిపై కేసు
♦ నిర్బంధించారని ఫిర్యాదు చేసిన ♦ ఎంపీ కొత్తపల్లి గీత భర్త సాక్షి, హైదరాబాద్: తనను నిర్బంధించడంతో పాటు బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారంటూ అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయిపై పంజగుట్ట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. సాయి వ్యాపార భాగస్వామిగా ఉన్న రామకృష్ణనూ పోలీసులు నిందితుడిగా చేర్చారు. బుధవారం రామకృష్ణ డీడీ కాలనీకే చెందిన కృష్ణ ద్వారా తనకు ఫోన్ చేయించి తాజ్ కృష్ణ హోటల్‌కు రావాల్సిందిగా కోరాడని, తాను వెళ్లగా... అప్పటికే అక్కడ మంత్రి కుమారుడు సాయి ఉన్నాడని, తనను సాయి, రామకృష్ణ రాత్రి 12 గంటల వరకు నిర్భంధించి.. బెదిరించి మూడు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని రామకోటేశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.