breaking news
Response Time
-
ఇక రంగంలోకి మొబైల్ యూనిట్లు
సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో ‘రెస్పాన్స్ టైం’ తగ్గించేందుకు నగరంలో 10 మొబైల్ యూనిట్లు ఏర్పాటుచేయాలని అగ్నిమాపక శాఖ నిర్ణయం తీసుకుంది. ఏదైన ప్రమాదం సంభవించినప్పుడు సమీపంలో ఉన్న ఈ మొబైల్ యూనిట్లు కేవలం ఏడు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంటాయి. అక్కడ జరిగే ప్రాణ, ఆస్తి నష్టం నుంచి కాపాడతాయి. దూరం నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చి సహకరించనున్నాయి. అయితే సమీపంలో ఉండడంవల్ల ముందుగా ఈ యూనిట్లు చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తాయని బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని చెప్పారు. ఒక్కో మొబైల్ యూనిట్లో ఒక సహాయక కేంద్ర అధికారి, ఒక డ్రైవర్, ఇద్దరు అగ్నిమాపక జవాన్లు శాశ్వతంగా విధులు నిర్వహిస్తారన్నారు. కాగా, నగరంలో ట్రాఫిక్ జాం సమస్య విపరీతంగా పెరిగిపోయింది. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు, పోలీసు వ్యాన్లు, అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకోవాలంటే భారీ కసరత్తు చేయాలి. అయితే ఎలాంటి ప్రమాదం జరిగిన ముందుగా అక్కడికి చేరుకునేది అగ్నిమాపక వాహనాలే కావడంతో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఈ ట్రాఫిక్ జాంలో ఫైరింజన్లు దూరం నుంచి ఘటనాస్థలికి రావాలంటే కనీసం అరగంటకుపైనే సమయం పడుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీంతో నగర విస్తరణ, జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా 26 కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగరంలో తగినంత స్థలం దొరక్కపోవడంతో మొబైల్ యూనిట్ల ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. వీటిని ఫ్లైఓవర్ల కిందున్న ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేస్తారు. -
పక్కా ‘ట్రాక్’పై నిఘా
సైబరాబాద్‌లో జీపీఎస్ ఆధారంగా పనిచేసే ‘వీటీఎస్’ పోలీసు వాహనాల కదలికలపై కన్ను చాలావరకు తగ్గనున్న రెస్పాన్స్ టైమ్ నాలుగింటిలో ప్రయోగాత్మకంగా అమలు త్వరలో మరో 70 వెహికల్స్‌లో ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి వేగంగా సేవలందించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ రంగం సిద్ధం చేస్తోంది. జీఐఎస్, జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే వెహికల్ ట్రాకింగ్ సిస్టం (వీటీఎస్)ను ప్రవేశపెట్టబోతోంది. బాధితుల కాల్స్‌కు త్వరి తంగా రెస్పాన్స్ ఇచ్చేందుకు, పోలీసు గస్తీ వాహనాల కదలికలపై నిఘా ఉంచేం దుకు ఉపయోగపడే ఈ వ్యవస్థతో పలు అవస్థలు తప్పనున్నాయి. దీన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాలుగు వాహనాల్లో ప్రవేశపెట్టారు. ఈ నెలాఖరుకు కమిషనరేట్‌లోని 70 గస్తీ వాహనాల్లో ఏర్పాటు చేయనున్నారు. గస్తీ వాహనాలపై నిఘా సైతం... ఈ వ్యవస్థతో పోలీసు వాహనాల గస్తీ సైతం పక్కాగా జరిగేలా నిఘా ఉంచే అవకాశముంది. {పస్తుతం ఈ వాహనాల గస్తీపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. తాజా ట్రాకింగ్ సిస్టం వల్ల ఏదైనా వాహనం ఎక్కడ గస్తీ నిర్వహిస్తోందన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాహనాన్ని ఘటనాస్థలికి పంపేటప్పుడు దాన్లో ఉన్న ఇంధనం సరి పోతుందా? లేదా? అనేదీ ముందుగానే తెలుసుకోవచ్చు. ఒక్కో వాహనానికి నెలకు ఎంత డీజిల్ కేటాయించారు, దాని మైలేజ్ ఎంత? అది ఎన్ని కి.మీ. గస్తీ తిరిగింది? ఇంకా ఎంత డీజిల్ ఉంది? తదితర విషయాలనూ ఇది విశ్లేషిస్తుంది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ వాహనాలకూ.. ‘రెస్పాన్స్ టైమ్ తగ్గించడంతోపాటు గస్తీ వాహనాలపై నిఘా ఉంచడానికి వీటీఎస్ ఉపకరిస్తుంది. దీన్ని మొదటి దశలో 70 పెట్రోలింగ్ వాహనాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవలే ఓఆర్ఆర్పై తనిఖీలు చేపట్టేందుకు అందుబాటులోకి తెచ్చిన ఐదు వెహికల్స్కూ ఏర్పాటు చేస్తాం. ఈ నెలాఖరుకు ఇది పూర్తవుతుంది. ఈ వ్యవస్థకు సంబంధించిన సమాచారం కంట్రోల్ రూమ్‌లో తెరపై కనిపించడంతోపాటు సర్వర్లోనూ డంప్ అవుతుంది. దానిలోకి లాగిన్ అయిన ఏ అధికారైనా ఎక్కడి నుంచైనా ఈ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది.’ - అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ, సైబరాబాద్ వేగంగా స్పందించడమే ప్రధాన లక్ష్యం ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేసి సాయం కోరగలరు తప్ప.. అన్ని సందర్భాల్లో వారి వివరాలు చెప్పే స్థితిలో ఉండరు. ఈ నేపథ్యంలో కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన కాల్‌ను బట్టి అది ఏ ప్రాంతం నుంచి వస్తోందనేది సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సమాచారం అందగానే ఎంత వేగంగా పోలీసులు స్పందించగలిగితే బాధితులకు అంత ఊరట లభిస్తుంది. ఈ రెస్పాన్స్ టైమ్ తగ్గించాలంటే రక్షక్, మొబైల్ వాహనాలు ఎక్కడున్నాయో వేగంగా తెలుసుకోవాలి. దీనికోసం ఆ వాహనాల్లో జీఐఎస్ (గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), జీపీఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) ఏర్పాటు చేస్తారు. వీటిని కంట్రోల్‌రూమ్‌లో ఉండే వీడియో వాల్‌కు అనుసంధానిస్తారు. ఫలితంగా ఓ వాహనం ఏ ప్రాంతంలో ఉందనేది స్క్రీన్‌పై గుర్తుల రూపంలో కనిపిస్తుంది. ఫోన్ వచ్చిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికి వైర్లెస్ సెట్‌తో సమాచారమిచ్చి అటు మళ్లిస్తారు. ఈ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణ కాంట్రాక్టును ఓ సంస్థ దక్కించుకుంది. ప్రయోగాత్మకంగా 4 వాహనాల్లో ఏర్పాటు చేసి సమస్యల్ని అధ్యయనం చేస్తోంది.