అస్సాం సీఎం రాజీనామా
గువాహటి: అస్సాం సీఎం తరుణ్ గొగొయ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. గొగొయ్ రాష్ట్రానికి మూడు సార్లు వరుసగా ముఖ్యమంత్రి గా సేవలందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలను గెలుపొందిన విషయం తెలిసిందే. అస్సాం శాసనసభలో మొత్తం 126 స్థానాలున్నాయి.