breaking news
Republican leaders
-
Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో యూఎస్ నేతలు
వాషింగ్టన్: అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ నేత మిచ్ మెకొనెల్‌తో పాటు పలువురు రిపబ్లికన్ సెనేటర్లు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆకస్మిక పర్యటన జరిపారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ గెలిచేవరకు మద్దతు కొనసాగిస్తామన్నారు. రిపబ్లికన్ నేతలతో సమావేశ వీడియోను జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌కు 4000 కోట్ల డాలర్ల ప్యాకేజీకి వచ్చే వారం అమెరికా కాంగెస్ర్ ఆమోదం లభించే అవకాశముందని సమాచారం. మరోవైపు యూరోవిజన్ సంగీత కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో జరుపుతామని జెలెన్స్కీ ప్రకటించారు. కుదిరితే మారియుపోల్‌లో నిర్వహిస్తామన్నారు. డొనెట్స్క్పై పూర్తి ఫోకస్ ఉక్రెయిన్‌లోని పలు నగరాల నుంచి సేనలను ఉపసంహరించిన రష్యా తన దృష్టిని తూర్పున డొనెట్స్క్పై కేంద్రీకరించింది. దీంతో తమ దేశం దీర్ఘకాలిక యుద్ధ దశలోకి ప్రవేశిస్తోందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సి రెజినికోవ్ ప్రకటించారు. తూర్పు ప్రాంతంలో పలు నగరాలపై రష్యా పట్టు కొనసాగుతోంది. అక్కడ తాము తాజాగా ఆరు నగరాలు/గ్రామాలను పునఃస్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఖర్కివ్ నగరాన్ని దాదాపు గెలిచామని జెలెన్స్కీ అన్నారు. సివర్స్కీ డోనెట్స్ నది వద్ద ఎవరికి విజయం లభిస్తుందనేది ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ధారితమవుతుందని మిలటరీ నిపుణులు అంటున్నారు. యుద్ధంలో రష్యా భారీగా నష్టపోతోందని బ్రిటన్ పేర్కొంది. నాటోలో చేరుతాం: ఫిన్లాండ్ ఉక్రెయిన్‌పై దాడితో ఆందోళన చెందుతున్నామని, అందువల్ల నాటోలో చేరతామని ఫిన్లాండ్ పునరుద్ఘాటించింది. స్వీడన్ కూడా ఇదే బాటలో పయనించేలా కన్పిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిన్లాండ్ ప్రెసిడెంట్ నినిస్టోతో ఫోన్లో మాట్లాడారు. నాటోలో చేరడం తప్పిదమవుతుందంటూ నచ్చజెప్పే యత్నం చేశారు. ఫిన్లాండ్–రష్యా సంబంధాలను ఇది దెబ్బతీస్తుందని ఘాటుగా హెచ్చరించారు. -
శరణార్థులపై కల్పిత భయాలు
ట్రంప్, తదితర రిపబ్లికన్ నేతలు సిరియన్ శరణార్థుల పట్ల అమెరికన్లలో ప్రవేశపెడుతున్న కల్పిత భయాలు ఉగ్రవాదంకంటే ప్రమాదకరంగా మారుతూ, సగటు అమెరికన్ స్పందనను విదేశీయత వైముఖ్యంవైపు నెడుతున్నాయి. ఒర్లాండో పట్టణంలో జూన్ 12న జరిగిన మారణ కాండ నేపథ్యంలో, ముస్లింలు దేశంలోకి ప్రవేశించ కుండా అమరికా నిషేధం విధించాలంటూ.. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి నామినీ అయిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. గే క్లబ్లో కాల్పులకు పాల్పడ్డ షూటర్ అమెరికన్ పౌరుడే అయి నప్పటికీ, ముస్లింలకు ప్రవేశ నిషేధంపై 2015 డిసెంబర్ నుంచి చేస్తూవస్తున్న సిఫార్సులను ట్రంప్ పునరుద్ఘాటిం చారు. అమెరికాకు వచ్చిన 10 వేలమంది సిరియన్ శరణార్థులకు పునరావాసం కల్పించాలని ఒబామా పాలనా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం పైనే ట్రంప్ నేరుగా గురిపెట్టారు. ముస్లింల ప్రవేశాన్ని నిషేధించ డంపై ట్రంప్ తదితరులు ఇస్తున్న బహిరంగ ప్రకటనలు అమెరికన్లలో శరణార్థులపై భయాలను రేకెత్తించి ఉండ వచ్చు కాని ఆ భయాలకు ఎలాంటి చారిత్రక సమర్థనా లేదనే చెప్పాలి. గత సంవత్సరం పారిస్‌లో ఉగ్రవాద దాడుల తర్వాత, మధ్య ప్రాచ్య దేశాలనుంచి వలస వస్తున్న వారితో దేశ భద్రతకు ప్రమాదం కలగనుందని పలు వ్యాసాలను అమెరికన్ మీడియా ప్రచురించింది. ఇతరదేశాలు, ప్రాంతాల నుంచి వలస వచ్చే శరణా ర్థుల పట్ల ఆమోదం తెలపడానికి సంబంధించి అమెరి కాకు సుదీర్ఘ, సంక్లిష్ట చరిత్ర ఉంది. 1840లలో బంగాళా దుంపల పంట వైఫల్యంతో తీవ్ర కరువు బారిన పడిన ఐరిష్ కేథలిక్కులు, నల్లమందు యుద్ధాల క్రమంలో చైనీయులు, 19వ శతాబ్ది చివరలో చెలరేగిన జాతి ఘర్షణల నుంచి తప్పించుకోజూసిన తూర్పు యూరప్ యూదులు, 1910లో అంతర్యుద్ధ క్రమంలో పారిపో యిన మెక్సికన్లు, నాజీల పాలన నుంచి తప్పుకున్న జర్మనీ యూదులు, 1960లలో క్యూబన్ ప్రజలు, 1970 లలో వియత్నమీయులు ఏదో ఒకరకంగా శరణార్థు లుగా అమెరికాకు వలస వచ్చేశారు. ఇలా వలస వచ్చిన వివిధ ప్రజా బృందాలు అమె రికాలో కుదురుకునే క్రమంలో తీవ్ర వివక్షను ఎదుర్కొ న్నాయి. వారి ప్రొటెస్టెంటేతర సంప్రదాయాలు, వారి జాతే దీనికి ప్రధాన కారణం. ఇది 19వ శతాబ్ది చివరలో, 20వ శతాబ్ది ప్రారంభంలో జాతీయతా రూపం దాల్చింది (ఆంగ్లేతర జాతీయులను తక్కువ జాతి జీవు లుగా గుర్తించడం మొదలైంది). మొదట చైనీయులకు, తర్వాత తూర్పు, దక్షిణ యూరప్ జాతీయులకు వ్యతిరేకంగా అమెరికన్లలో ఏర్పడిన దురభిప్రాయాలు ఎంత బలపడ్డాయంటే, అమెరికన్ కాంగ్రెస్ 1880లలో చైనీయుల మినహాయింపు చట్టాన్ని, 1920లలో వలస నిరోధ చట్టాన్ని ఆమోదించింది. ఈ రెండో చట్టం అమెరికాలోకి పశ్చిమ యూరపేతర జాతుల ప్రవాహాన్ని గణనీయంగా నిరోధించింది. స్థానిక అమెరికన్ల నుంచి వివక్షను తీవ్రంగా ఎదుర్కొన్నప్పటికీ, ఈ శరణార్థి బృందాలు, వారి సంతానం అమెరికా సమాజంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయాయి. అమెరికన్ చరిత్రలో శరణార్థుల పట్ల సామాజిక ఆందోళనకు సంబంధించిన అత్యంత ఆసక్తిగొలిపే ఉదాహరణల్లో ‘జర్మన్ ఫార్టీయైటర్స్’ ఒకటి. 1848లో ప్రజాస్వామ్యం కోసం జరిగిన యూరోపియన్ విప్లవాల వైఫల్యంతో ఏర్పడే నిర్బంధం గురించిన సకారణ భయాలతో ఈ దేశాల నుంచి పలువురు శరణార్థులు సామూహికంగా అమెరికాకు వలస వచ్చేశారు. వీరిలో జర్మనీ ఉద్యమకారులు ఇతరుల కంటే రాడికల్‌గా ఉండేవారు. స్వేచ్ఛా చింతనాపరులైన వీరు అమెరికా సంస్థలను, ప్రత్యేకించి క్రిస్టియానిటీని తీవ్రంగా విమ ర్శించేవారు. వీరి విమర్శల తీవ్రతకు జడిసిన నాటి ఛాందసవాద ‘విగ్’ పార్టీ, దాని విదేశీయతా విముఖత లోంచి పుట్టుకొచ్చిన ‘అమెరికన్ పార్టీ’.. రెండూ ‘అమెరికా అమెరికన్లకే’ అనే నినాదాన్ని మొదలెట్టాయి. అయితే వలస ప్రజలు పలువురు అమెరికన్లలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నప్పటికీ, ‘జర్మన్ ఫార్టీ యైటర్స్’ గా పేరొందిన వారు వలస వచ్చిన బృందాలన్నింటి కంటే ఎక్కువగా చైతన్యంతో కూడిన బృందంగా ఉండేవారు. వీరు స్థానిక కమ్యూనిటీలకు నేతృత్వం వహించేవారు. ఉత్తమ ప్రభుత్వ విద్య, బానిసత్వ రద్దు తదితర ప్రగతిశీల సంస్కరణలను ప్రబోధించేవారు. 1917లో అమెరికా, జర్మనీపై యుద్ధం ప్రకటించేనాటికి ఈ జర్మన్ ఫార్టీ యైటర్స్కి చెందిన పిల్లలు, తదనంతర తరం పిల్లలు, వీరితో పాటు జర్మనీ వలస ప్రజలను అమెరికాయేతరులుగా, జాతికి ప్రమాదకారులుగా అమె రికన్ ప్రజానీకం భావించింది. నాటి ఉడ్రోవిల్సన్ పాలనా యంత్రాంగంతోపాటు పలువురు అమెరికన్ నేతలు అనధికారికంగా ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. యుద్ధకాలంలో జర్మన్ అమెరికన్లపట్ల భయం అనేది ఉన్మాద స్థాయికి చేరింది. వారు ఆహారంలో, తాగేనీళ్లలో విషం కలిపేందుకు, ఫ్యాక్టరీల్లో, వంతెనలపై బాంబులు పెట్టడానికి కుట్ర పన్నుతున్నారని పలురకాల పుకార్లు వ్యాపింపజేశారు. వీటిలో ఏ ఒక్క పుకారు కూడా నిజం కాలేదనుకోండి. పైగా జర్మన్ అమెరికన్లు తాము కొత్తగా నివాసమేర్పర్చుకున్న ప్రాంతం పట్ల విశ్వాసం ప్రదర్శిం చినట్లు చారిత్రక రికార్డులు కూడా ఉన్నాయి. చారిత్రక దృక్పథం రీత్యా కూడా సిరియన్, తదితర శరణార్థుల పట్ల ఈ కొత్త భయం చాలావరకు అసంబ ద్ధమైనదనే చెప్పాలి. గతంలోని వలస బృందాలు, అమె రికా సామాజిక చట్రానికి ప్రమాదకారులుగా ముద్ర పడిన బృందాలు కూడా అమెరికా పౌరులలో కీలక సభ్యులుగా తమను తాను నిరూపించుకున్నారు. మధ్య ప్రాచ్య శరణార్థుల పట్ల భయాలు వ్యక్తం చేస్తున్నవారు అమెరికా సంస్కృతి, దాని సంస్థలు ప్రత్యేకించి దాని ప్రభుత్వ విద్యా సంస్థలలోని ఏకీకరణ శక్తిని నిర్లక్ష్యం చేస్తున్నాయనిపిస్తోంది. శరణార్థుల గురించి అధికంగా ఆందోళన చేస్తున్న రాజకీయ నేతల్లో చాలామంది... పిల్లల్లో తరాలుగా ప్రజాస్వామిక భావాలను ప్రవేశ పెడుతూ వచ్చిన ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమర్థించ డంలో ఏకకాలంలో విఫలమవడం గమనార్హం. పైగా వీరు ప్రైవేట్‌గా నిర్వహిస్తూ, లాభాపేక్షే పరమావధిగా కలిగిన పాఠశాలల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్, తదితర రిపబ్లికన్ నేతలు సిరియన్ శరణార్థుల పట్ల అమెరికన్లలో ప్రవేశపెడు తున్న కల్పిత భయాలు బీభత్సాన్ని సృష్టించడానికి మించిన ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రపంచ మానవతావాద సంక్షోభం పట్ల అమెరికా స్పందనను విదేశీయతా వైముఖ్యం వైపు నెడుతున్నాయి. పాల్ జె రామ్సే, ప్రముఖ అమెరికన్ రచయిత (కామన్డ్రీమ్స్.ఓఆర్జీ.... సౌజన్యంతో) -
ట్రంప్ కు తప్పని ఇంటిపోరు
వాషింగ్ టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీనుంచే భారీ ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరపున నామినేషన్‌ను ఖరారు చేసుకున్న ట్రంప్ కు మద్దతు ఇవ్వబోమని పార్టీలోని టాప్ సెక్షన్ బహిరంగంగానే ప్రకటించింది. ఈ మేరకు పార్టీలో రెండు వర్గాలుగా శనివారం చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతూ అధ్యక్ష పీఠానికి చేరువవుతున్న వివాదాస్పద రియల్టర్, బిలియనీర్ డోనాల్డ్ .ట్రంప్ కు చెక్ పెట్టేందుకు రిపబ్లికన్ పార్టీ పెద్దలు సిద్దమవుతున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఆయనకు మద్దతిచ్చేది లేదని తేల్చి చెబుతన్నారు. ట్రంప్ నామినేషన్ వ్యవహారంలో పార్టీ పెద్దల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ట్రంప్ కు ఇంటిపోరు తప్పేలా కనిపించడం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుల సోదరుడైన ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్, సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహంకు జతకలిశాడు ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రంప్ కూడా మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పి ట్రంప్ కి ఝలక్ ఇచ్చాడు ట్రంప్ సరైన అభ్యర్తినని తాను నమ్మడం లేదంటూ ఫేస్ బుక్ లో బహిరంగ ప్రకటన చేశాడు. పార్టీకూడా ట్రంప్ ను సుప్రీంగా ఎన్నుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ లోజరిగే ఎన్నికల్లో తాను క్లింటన్ కుగానీ ట్రంప్ కు కానీ ఓటు వేయడం లేదన్నారు. అమెరికన్ అధ్యక్ష కార్యాలయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, అధ్యక్షుడికి సవాళ్లను స్వీకరించే ధైర్యం, వినయం, మానవత్వం లాంటి లక్షణాలుండాలని, అలాంటివేవీ ట్రంప్ లో లేవని, అసలు అతను స్థిరమైన పార్టీ సభ్యుడుకాదని మిస్టర్ జెబ్ విమర్శించాడు. అటు క్లైవ్ లాండ్ కన్ వెన్షన్ కు తాను హాజరు కావడంలేదని జాన్ మెక్ కెయిన్ ప్రకటించాడు. మరోవైపు టెక్సాస్ గవర్నర్ రిక్ పెర్రీ, 1996 అధ్యక్ష ఎన్నికల నామినీ, బాబ్ డోలే ట్రంప్ కు గట్టి మద్దతునందిస్తున్నారు. ప్రజలు ట్రంప్ ను ప్రజలు గౌరవించి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అలాంటి ప్రజల తీర్పును గౌరవించాలని ట్రంప్ కు మేజర్ సపోర్ట్ నిస్తున్న బోలే వాదించాడు. జూలై జరిగే క్లీవ్ లాండ్ కన్వెన్షన్ కు హాజరై, ట్రంప్ కు మద్దతుగా ఓటు వేస్తానని స్పష్టం చేశాడు. అయితే జెబ్, గ్రాహం ఆరోపణలను ట్రంప్ కొట్టి పారేశారు. ఓటర్లను వారిని తిరస్కరించడంతో తనపై దాడికి దిగారని విమర్శించారు. హిల్లరీకి ఓడించడానికి పార్టీని ఏకం చేసే సమర్థతకు తనకు ఉందని స్పష్టం చేశాడు. కాగా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.... తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నప్పటికీ కీలకమైన ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లోనూ ఘన విజయంతో తన గట్టి పోటీదారుడైన టెడ్క్రుజ్ను మట్టికరిపించాడు. ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లో గెలుపుతో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిని తానేనని నిరూపించుకున్న ట్రంప్.... జూన్ 7న నామినేషన్ వేయనున్నారు. అలాగే అమెరికా అధ్యక్ష పదవికి అసలైన ఎన్నికలు నవంబర్ 8న జరగనున్నాయి.