breaking news
reported in Hyderabad
-
'గాంధీ'ని సందర్శించనున్న నారాయణ
హైదరాబాద్: రోజు రోజుకు పెరిగిపోతున్న స్వైన్ ఫ్లూ బాధితుల బాగోగులను తెలుసుకోవడానికి సీపీఐ నాయకులు నారాయణ మంగళవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్నారు. అక్కడ స్వైన్ఫ్లూ రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి నారాయణ అడిగి తెలుసుకోనున్నారు. నగరంలో తాజాగా మరో 25 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 173 కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించారు. -
హైదరాబాద్లో కొత్తగా 25 స్వైన్ఫ్లూ కేసులు
హైదరాబాద్ : ఓవైపు చలి, మరోవైపు స్వైన్ఫ్లూ ... హైదరాబాద్ ప్రజలను వణికిస్తోంది. నగరంలో కొత్తగా మరో 25 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 173 కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్వైన్ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఈ వ్యాధిని అరికట్టడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్నిమార్గదర్శకాలను విడుదల చేసింది. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డాక్టర్లని సంప్రదించాలని కోరింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి స్వైన్ఫ్లూ వ్యాధికి లక్ష్యణాలుగా పేర్కొంది. కాగా స్వైన్ఫ్లూ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్ర జేపీ నడ్డా పేర్కొన్నారు. స్వైన్ఫ్లూ సోకినవారికి అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.