breaking news
Release Order
-
అవినీతి ఉద్యోగికి ఉద్వాసన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పార్వతీపురం జలవనరులశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గంజి లకుష్మంనాయుడును విధులనుంచి తొలగించారు. జలవనరులశాఖ ఎస్ఈ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ ఈఈ భాస్కరరావు మంగళవారం రిలీవింగ్ ఆర్డర్‌ను ఆయనకు అందజేశారు. ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణకుమార్ విజయవాడలోని ఇంజి నీర్ ఇన్ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ లకుష్మంనాయుడుపై వేటు వేయకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు తాత్సారం చేయడంతో ఈ నెల 24న సాక్షి దినపత్రికలో ‘అవినీతికి అండ’ అనే శీర్షికతో వెలుగులోకి తీసుకురావడంతో జలనవరులశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ట్రిబ్యునల్ తిరస్కరణతో హడావుడిగా ఆదేశాలు లకుష్మంనాయుడుకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు 2008లో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. దీనిపై గతేడాది డిసెంబర్ 20న విశాఖపట్నం ఏసీబీ కోర్టు మూడేళ్లు జైలు శిక్షతోపాటు లక్షరూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కానీ లకుష్మంనాయుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు అపీల్ చేసుకుని వెనువెంటనే మళ్లీ విధుల్లో చేరా రు. ఈ విషయంపై జలవనరుల శాఖ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లకుష్మంనాయుడిపై చర్యలు తీసుకోవాలని విజ యవాడ ఈఎన్సీకి జీఓ జారీచేశారు. ఈఎన్సీ వెంటనే నిర్ణ యం తీసుకోకపోవడంతో లకుష్మంనాయుడు మరలా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అక్కడ పిటిషన్ కొట్టేయడంతో ఆగమేఘాలమీద విధులనుంచి తొలగిస్తూ రిలీవింగ్ ఆర్డర్‌ను అందజేసింది. ప్రస్తుతం లకుష్మంనాయుడు పార్వతీపురంలో నివాసం ఉంటు న్న గృహం జలవనరుల శాఖకు సంబంధించినదే. ఈఈ కేడర్ ఉన్నవారు నివాసం ఉండడానికి నిర్మించిన ఆ భవనంలో ఎంతో కాలంగా ఈయన నివాసం ఉంటున్నారు. నేడో, రేపో ఆ గృహాన్ని కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెబుతున్నారు. -
రవాణా శాఖ విస్తృత తనిఖీలు
=పమాదాలపై సీరియస్ =రవాణా శాఖ విస్తృత తనిఖీలు =ప్రయివేట్ ట్రావెల్స్ వాహనాపై దాడులు =నిబంధనలు పాటించని 18 బస్సుల సీజ్ =వాల్తేరు డిపోకు తరలింపు =కోర్టు ఆదేశాలతోనే రిలీజ్ ఆర్డర్ సాక్షి,విశాఖపట్నం: రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయివేట్ ట్రావె ల్స్ బస్సులపై దాడులు చేశారు. శుక్రవారం 18 బస్సులను సీజ్ చేశారు. వాటిని విశాఖలోని వాల్తేరు డిపోకు తరలించారు. మూడు రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో వాల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో రవాణా శాఖ అధికారులు మేల్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రయివేట్ ట్రావెల్స్‌పై కొర డా ఝుళిపించారు. విశాఖ డీటీసీ ఎం.ప్రభురాజ్‌కుమార్, శ్రీకాకుళం డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు నేతృత్వంలో శుక్రవారం వేకువజాము 4 గంటల నుంచి విశాఖలోని కూర్మన్నపాలెం, షీ లా నగర్ల వద్ద దాడులు చేశారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. కాంట్రాక్ట్ క్యారియ ర్ పర్మిట్ కలిగి స్టేజి క్యారియర్‌గా రాకపోకలు సాగిస్తున్న 18 బస్సులను సీజ్ చేశారు. రెండు బస్సుల్లో నిబంధనల ప్రకారం ఇద్దరు డ్రైవర్లు లేరని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బస్సులను వాల్తేరు డిపోకు తరలించా రు. ఒకే నంబర్‌తో వాహనాలు తిరుగుతున్నాయా! అనే కోణంలో రికార్డులను క్షుణ్ణంగా పరి శీలించారు. ప్రత్యేకంగా ఒరిజినల్ పర్మిట్లను చూశారు. అపరాధ రుసుం చెల్లింపుతో వాహనాలు విడిచిపెట్టలేమని, కోర్టు రిలీజ్ ఆర్డర్ ఉండాలని ఆంక్షలు విధించారు. శుక్రవారం తనిఖీల్లో దాదాపు 70 బస్సులను పరిశీలించా రు. ట్యాక్స్, ఫిట్నెస్, పర్మిట్, అత్యవసర ద్వా రం, సీట్లు, ప్రయాణికుల సంఖ్య, సరకుల తరలింపు, ఇద్దరు డ్రైవర్ల ఏర్పాటు, మద్యం సేవిం చి ఉన్నారా! అనే అంశాలపై దృష్టి సారించారు. ఇకపై విస్తృతంగా తనిఖీలు చేపడతామని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు చేయరాదని వెల్లడించారు. కానరాని నిబంధనలు ప్రమాదాల సమయంలో నిబంధనలు గుర్తుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారు లు హడావుడి చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులు అత్యధికంగా స్టేజ్ క్యారి యర్లుగా ప్రయాణించడం వెనుక మతలబు లు లేకపోలేదన్న ఆరోపణలున్నాయి. సీజన్‌ను బట్టి ట్రావెల్స్ అధిక వసూళ్లకు పాల్పడినా పట్టించుకోరన్న విమర్శలు వినిపిస్తున్నాయి.