breaking news
Redwood laborers
-
పోలీసుల కాల్పుల్లో ఎర్రచందనం కూలీ మృతి
రాళ్లతో కూలీల దాడి.. ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్‌కు గాయాలు భాకరాపేట, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతంలోని బొవ్మూజీ కొండ వద్ద బుధవారం స్పెషల్ టాస్క్ఫోర్క్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎర్రచందనం కూలీ మృతి చెందాడు. కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక దళాలపై కూలీలు రాళ్లతో దాడిచేయగా ఆర్ఎస్ఐ వురో కానిస్టేబుల్ గాయపడ్డారు. కూలీలను నిరోధించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఎర్రావారిపాళెం వుండలం బొమ్మాజీ కొండపై ఉన్న 70 మంది ఎర్రచందనం కూలీలు కూంబింగ్ నిర్వహిస్తున్న దళాలను చూసిన వెంటనే రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో కూలీల్లో ఓ వ్యక్తి (35) మృతి చెందాడు. మిగిలిన వారంతా పరారయ్యారు. గాయుపడ్డ ఆర్ఎస్ఐ మురళిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి తమిళనాడు వాసిగా భావిస్తున్నారు. సంఘటన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ రావుకృష్ణ సందర్శించారు. కూంబింగ్‌లో ఉన్న పోలీసులపై కూలీలు ఎదురుదాడి చేయుడం వల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు. -
ఆటవికంపై విచారణకు ఆదేశం: డీజీపీ
-
ఆటవికంపై విచారణకు ఆదేశం: డీజీపీ
తిరుపతి: శేషాచల అడువుల్లో పోలీసుల ఆటవిక చర్యలపై.. సాక్షి ప్రసారం చేసిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. దీంతో డీజీపీ ప్రసాదరావు తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. ఎర్రచందనం కూలీని దాడిచేసింది పోలీసులా..? లేదా అటవీశాఖ సిబ్బందా ? అనేది తెలిపాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాక దాడి జరిగిన సంఘటనా స్థలాన్ని గుర్తించాలని డీజీపీ స్పష్టీకరించారు. కాగా, శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీని చిదకబాదిన ఘటనపై హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించాలని పౌరహక్కుల సంఘం నేతలు క్రాంతిచైతన్య,షామీర్భాషాలు డిమాండ్ చేశారు. మంగళవారం వారు సాక్షితో మాట్లాడారు. తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా హెచ్ఆర్సీని వారు కోరారు. లేని పక్షంలో తామే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.