breaking news
Recorded vote
-
మారని తీరు
ఓట్ల నమోదుకు అనూహ్య స్పందన ఓటేయడంపై మాత్రం అనాసక్తి 40 శాతం పోలింగ్‌కూ నోచని వైనం మెజారిటీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అదే వరస. ఎవరెంతగా ప్రచారం నిర్వహించినా.. ఓటరు నమోదులో ఎంతో స్పందన కనిపించినా.. తీరా పోలింగ్ దగ్గరకు వచ్చేప్పటికి గతమే పునరావృతమైంది. నగరంలోని ఏ నియోజకవర్గంలోనూ చెప్పుకోదగ్గ పోలింగ్ జరగలేదు. పలు నియోజకవర్గాలు 40 శాతం పోలింగ్‌కు కూడా నోచుకోలేదు. గత ఎన్నికల్లో ఇలా తక్కువ పోలింగ్ జరిగిన కేంద్రాలపై ఈసారి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా కేంద్రాల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఓటుహక్కుపై ప్రచారం నిర్వహించారు. ఓటును త ప్పనిసరిగా వినియోగించుకోవాలని హితోపదేశం చేశారు. పలు సంక్షేమ పథకాలు పొందాలన్నా ఓటు వేయాలని పరోక్షంగా హెచ్చరికల స్వరం సైతం వినిపించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ ఓటేయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినా ప్రయోజనం కానరాలేదు. నగరంలోని పలు నియోజకవర్గాల్లో 40 శాతం కన్నా తక్కువే పోలింగ్ నమోదైంది. వాటిలో మచ్చుకు కొన్ని.. -
ఓట్ల నమోదుకు తిప్పలెన్నో..?
=ఆన్‌లైన్‌తో అవస్థలు =పనిచేయని సర్వర్ =నిట్టూర్చిన ఓటర్లు =ఓటర్ల జాబితా పునస్సమీక్షకు 23 వరకు గడువు పొడిగింపు సాక్షి, సిటీబ్యూరో: ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు (జనవరిలో వెలువరించనున్న ఓటర్ల జాబితా కోసం) మంగళవారం వరకే గడువు ఉండటంతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించి.. విఫలమైన వారు వేలల్లో ఉన్నారు. ఓటుహక్కుపై అటు అధికారులతోపాటు ఇటు ఆయా రాజకీయపార్టీలు, వివిధ సంస్థలు విస్తృత ప్రచారం చేయడంతో చాలామంది తమ పేర్లు నమోదు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఓటర్ల జాబితాలో తమ పేర్లు గల్లంతైనట్లు గ్రహించిన వారు సైతం కొత్తగా నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ ద్వారా ప్రయత్నించారు. సోమవారం నుంచే సంబంధిత వెబ్సైట్ మొరాయించినట్లు పలువురు ‘సాక్షి’ కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. వివరాలు భర్తీ చేస్తుండగానే మధ్యలో ఆగిపోయినట్లు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లినవారికి యూఆర్ఎల్ అందుబాటులో లేకపోవడంతో ఉస్సూరంటూ నిట్టూర్చారు. ఇదే అంశాన్ని సంబంధిత అధికారుల వద్ద ప్రస్తావించగా.. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఒకేసారి ప్రయత్నించినందున సమస్యలు తలెత్తి ఉండవచ్చునన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు ఇదే చివరి తేదీ కాదని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. కాగా, ఓటర్ల జాబితా పునస్సమీక్షకు ఈ నెల 17 వరకు ఉన్న గడువును ఈ నెల 23 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది.