breaking news
record voting
-
రికార్డు స్థాయిలో ఓటింగ్
పట్నా: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 64.66 శాతం ఓటింగ్ రికార్డు కావడం గమనార్హం. ఓటర్లు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరి కనిపించారు. తొలి దశలో భాగంగా 18 జిల్లాల్లోని మొత్తం 121 శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు. 3.75 కోట్ల మంది ఓటర్లలో 64.66 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. పండుగ వాతావరణంలో తొలి దశ పోలింగ్ జరిగినట్లు పేర్కొంది. 45,341 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగింది. అత్యధికంగా ముజఫర్‌పూర్ జిల్లాలో 70.96 శాతం, సమస్తీపూర్‌లో 70.63 శాతం, మాధేపురాలో 67.21 శాతం, వైశాలీలో 67.37 శాతం, సహర్సాలో 66.84 శాతం, ఖగారియాలో 66.36 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం పట్ల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ హర్షం వ్యక్తంచేశారు. బిహార్ ఓటర్లకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల సంఘం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ శాతంపై శుక్రవారం పూర్తి స్పష్టత రానుంది. తొలి దశలో భాగంగా మొత్తం 1,314 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హాతోపాటు పలువురు మంత్రులు తొలి దశ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికలు బిహార్‌లో 1951–52లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 42.6 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యల్పం. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 62.57 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. 2020 నాటి ఎన్నికల్లో కోవిడ్–19 ప్రభావం వల్ల ఓటింగ్ శాతం 57.29కు పరిమితమైంది. ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) పూర్తి చేసిన తర్వాత నిర్వహిస్తున్న ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి బిహార్‌పై కేంద్రీకృతమైంది. రెండో దశలో భాగంగా మిగిలిన 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ఈ నెల 11న జరుగనుంది. ఓటేసిన ప్రముఖులు తొలి దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తదితరులు ఓటు వేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి తొలి దశ పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. లఖీ సరాయ్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. బక్సర్, ఫతుహా, సూర్యగఢ్ తదితర ప్రాంతాల్లో కొన్ని కేంద్రాల్లో ఓటింగ్‌ను జనం బహిష్కరించారు. మరోవైపు మహాగఠ్‌బంధన్‌కు బలం ఉన్న ప్రాంతాల్లో అధికారులు ఉద్దేశపూర్వకంగా ఓటింగ్‌ను తగ్గించారని ఆర్జేడీ ఆరోపించింది. పెనంపై రొట్టెను తిరగేయకపోతే.. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిదే విజయమని లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. తన కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పెనంపై రొట్టెను తిరగేయకపోతే మాడిపోతుందని తెలిపారు. ఎన్డీయే 20 ఏళ్లుగా అధికారంలో ఉందని గుర్తుచేశారు. కొత్త ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. నూతన బిహార్ నిర్మాణానికి తేజస్వీ ప్రభుత్వం రావాల్సిందేనని తేలి్చచెప్పారు. -
రికార్డు స్థాయి ఓటింగ్!
న్యూయార్క్: ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. గత శతాబ్ద కాలంలోనే ఎన్నడూ నమోదు కాని స్థాయిలో, అత్యధికంగా 67% వరకు ఓటింగ్ నమోదు కానుంది. ఈ ఎన్నికల్లో సుమారు 16 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు ఎన్నికల డేటాను అధ్యయనం చేసే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారిడా ప్రొఫెసర్ మైఖేల్ మెక్ డొనాల్డ్‌ను ఉటంకిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. ఇందులో 10 కోట్ల మంది ముందస్తు ఓటింగ్ విధానంలో ఇప్పటికే ఓటేయడం విశేషం. ఇప్పటివరకు 1908లో మాత్రమే 65% మించి పోలింగ్ నమోదైంది. ప్రజా జీవితాలను అనూహ్యంగా అతలాకుతలం చేసిన కరోనా వైరస్, ఆర్థిక అనిశ్చితి తదితర అంశాలపై అమెరికన్లు తమ గళాన్ని వినిపించే ఉద్దేశంతో ఉన్నారని ఈ అత్యధిక పోలింగ్ శాతం సూచిస్తోందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. స్వేచ్ఛగా, సురక్షితంగా ఓటేసేందుకు పలు రాష్ట్రాలు తీసుకున్న చర్యల వల్ల కూడా ఓటింగ్ శాతం పెరిగినట్లు అభిప్రాయపడింది. టెక్సస్, కొలరాడో, వాషింగ్టన్, ఒరెగాన్, హవాయి, మొంటానా సహా పలు రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్ అత్యధిక స్థాయిలో జరిగింది. డెమొక్రటిక్ ఓటర్లు ముందస్తు ఓటింగ్‌లో, రిపబ్లికన్ ఓటర్లు ఎన్నికల రోజు ఓటింగ్‌లో అత్యధికంగా పాల్గొన్నట్లు పలు మీడియా సంస్థలు అంచనా వేశాయి. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికం డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్‌కే వచ్చే అవకాశమున్నట్లు పేర్కొన్నాయి. నల్ల జాతీయులు కూడా ఈ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో ఓటేసినట్లు నల్లజాతీయులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు కృషి చేసే ఒక సంస్థ పేర్కొంది. టెక్సస్‌లో 6.16 లక్షల మంది నల్లజాతీయులు ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారని వెల్లడించింది. కాగా, ఎన్నికల రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. విధ్వంసం, ఆందోళనలు, లూటీలు జరుగుతాయన్న భయంతో యజమానులు తమ షాప్స్ ముందు ప్లైవుడ్ బోర్డులను రక్షణగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రతినిధుల సభలో తగ్గనున్న డెమొక్రాట్ల సంఖ్య ప్రతినిధుల సభకు జరిగిన తాజా ఎన్నికల్లో డెమొక్రాట్ల పలు సిటింగ్ స్థానాలను రిపబ్లికన్ పార్టీ గెలుచుకుంది. అయినా, సభలో డెమొక్రాట్ల ఆధిక్యత కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజా ఫలితాల్లో బుధవారం రాత్రి వరకు(భారత కాలమానం) డెమొక్రాటిక్ పార్టీ 197 స్థానాల్లో, రిపబ్లికన్ పార్టీ 185 సీట్లలో గెలుపొందాయి. నార్త్ కరోలినాలో రెండు స్థానాలను డెమొక్రాటిక్ పార్టీ గెలుచుకుంది. గ్రామీణ మినెసొట నుంచి గత మూడు ఎన్నికల్లో గెలిచిన డెమొక్రటిక్ అభ్యర్థి కాలిన్ పీటర్సన్‌ను ఎట్టకేలకు రిపబ్లికన్లు ఓడించగలిగారు. అయొవాలో రిపబ్లికన్ అభ్యర్థి, టీవీ న్యూస్ యాంకర్ హిన్సన్ గెలుపొందారు. -
వారణాసిలో పోటెత్తిన ఓటర్డు, రికార్డు స్థాయి పోలింగ్!
వారణాసి: వారణాసి ఓటర్లు తీవ్ర స్థాయిలో ఉన్న ఎండ వేడి పక్కన పెట్టి భారీ సంఖ్యలో ఓటేశారు. వారణాసిలో సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా రికార్టు స్థాయిలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్ ల మధ్య పోటీ దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు 56 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైందని, పెద్ద సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఓటింగ్ బార్లు తీరి ఉండటం స్పష్టంగా కనిపించింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఈసీ అధికారుల తెలిపారు. 2009 ఎన్నికల్లో వారణాసిలో పోలింగ్ శాతం 43 శాతం మాత్రమేనని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ధరించి కాంగ్రెస్ అభ్యర్ధి ఆజయ్ రాయ్ పోలింగ్ బూత్ లోకి వెళ్లడం వివాదంగా మారింది. -
ఢిల్లీలో రికార్డు స్థాయిలో పోలింగ్
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఢిల్లీ చరిత్రలో అత్యధికంగా 74 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 1993లో తొలిసారి ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 61.75 శాతం ఓటింగ్ నమోదైంది. 2008 ఎన్నికల వరకు ఇదే అత్యధికం. తాజా ఎన్నికల్లో ఆ రికార్డు బద్దలైంది. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.


