breaking news
recce in mumbai
-
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. పకడ్బందీగా రెక్కీ ప్లాన్, ఇలా లీక్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు ముంబైలో రెక్కీ నిర్వహించారు. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడ్డ నిందితులే సల్మాన్ హత్యకు కూడా ప్లాన్ చేసినట్లు పంజాబ్ డీజీపీ గైరవ్ యాదవ్ వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకు ఈ రెక్కీ నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు.మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన కపిల్ పండిట్‌ను విచారించగా ఈ రెక్కీ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో చాలామంది ఉన్నారని అలాంటి వారిలో సల్మాన్ కీలక టార్గెట్ అని పండిట్ తెలిపాడు. ముంబైలో సల్మాన్ఇంటి వద్ద సుమారు మూడురోజుల పాటు ఈ రెక్కీ నిర్వహించినట్లు నిందితుడు అంగీకరించినట్లు డీజీపీ తెలిపారు. కాగా సిద్ధూ మూసేవాలాను హత్యకేసులో 35మంది నిందితుల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 23 మందిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా సల్మాన్‌ని చంపుతామని బెదిరింపులు వచ్చాయి. తాజాగా అతన్ని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించిన నేపథ్యంలో సల్మాన్‌కి సెక్యూరిటీ పెంచారు. -
ముంబైలో 11 చోట్ల ఉగ్రదాడులకు ఇండియన్ ముజాహిదీన్ రెక్కీ
ఇండియన్ ముజాహిదీన్.. ఈ పేరు వింటే చాలు ముంబై ఉగ్రదాడులు కళ్ల ముందు కదలాడతాయి. అలాంటి ఉగ్రవాద సంస్థ గత నెలలో ముంబై మహానగరంలో 11 చోట్ల మళ్లీ ఉగ్రదాడులు చేసేందుకు రెక్కీ నిర్వహించింది!! ఈ విషయాన్ని ఇటీవలే అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసీన్ భత్కల్ వెల్లడించాడు. దాంతో మహారాష్ట్ర పోలీసులు ముంబైలో ఒక్కసారిగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ రాకేష్ మారియా సంతకం చేసిన ఓ రహస్య నివేదికలోని విషయాలు వెల్లడయ్యాయి. ఆగస్టు మొదటివారంలో నాలుగు సైనేజిలు సహా మొత్తం 11 ప్రాంతాల్లో వీళ్లు రెక్కీలు చేసిన విషయం ఆ నివేదికలో ఉంది. భత్కల్‌తో పాటు అతడి సహచరుడు అసదుల్లా అఖ్తర్‌ను నిఘా సంస్థలు విచారించినప్పుడు వాళ్లు ఈ వివరాలు వెల్లడించారు. ముంబై పోలీసు కమిషనరేట్, జవేరీ బజార్, కల్బాదేవి, మంగళ్‌దాస్ మార్కెట్, లోహార్ చాల్, క్రాఫోర్డ్ మార్కెట్, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, ముంబై సెంట్రల్ బస్ డిపో, ముంబాదేవీ ఆలయం, నాగ్‌పడ ప్రాంతంలో ఏటీఎస్ ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న మాగెన్ డేవిడ్ సైనేజి, అగ్రిపడ ప్రాంతంలోని హసిదిమ్ సైనేజి, డోంగ్రీలోని షేర్ రాసన్ సైనేజి, పైధోని ప్రాంతంలోని హరహమీమ్ సైనేజి... ఈ అన్ని ప్రాంతాల మీద దాడులు చేయాలని వారు తలపెట్టి రెక్కీలు చేశారు.