breaking news
Rebels DOWN
-
టీఆర్ఎస్లో రెబెల్స్‌కు చెక్
సాక్షి, హైదరాబాద్: రెబెల్స్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి దృష్టిపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో తిరుగుబాటుదారులను బుజ్జగించేందుకు మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ ఓట్లు చీలిపోకుండా రెబెల్స్ అందరితో చర్చలు జరుపుతున్నారు. కొంతకాలంగా పార్టీ గ్రేటర్ బాధ్యతలను కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. గురువారం (22వ తేదీ) నుంచి గ్రేటర్లో కేటీఆర్ రోడ్‌షోలు సైతం చేపట్టనున్నారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంత్రి స్వయంగా చొరవ తీసుకుని రెబెల్స్‌తో మాట్లాడుతున్నారు. భవిష్యత్‌లో అందరికీ అవకాశాలు వస్తాయని హామీ ఇస్తున్నారు. దీంతో వెనక్కుతగ్గిన పలువురు అసమ్మతులు ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మిగతా వారు కూడా నేటి సాయంత్రానికి తప్పుకోనున్నట్లు సమాచారం. పోటీ నుంచి తప్పుకున్న రెబెల్స్.. మహేశ్వరంలో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొత్త మనోహర్‌రెడ్డి బుధవారం కేటీఆర్‌తో సమావేశమయ్యారు. కేటీఆర్‌తో చర్చల అనంతరం పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి వెళ్లారు. అదే విధంగా శేరిలింగంపల్లిలో శంకర్‌గౌడ్, కంటోన్మెంట్లో నగేశ్, ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్, రాజేంద్రనగర్‌లో తోకల శ్రీనివాసరెడ్డి, మరో అభ్యర్థితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. పోటీ నుంచి తప్పుకుంటే భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని, రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారిలో భరోసా నింపుతున్నారు. దీంతో రెబెల్స్ సమస్య దాదాపుగా కొలిక్కి వచ్చిందని సమాచారం. దీంతో గ్రేటర్లో జరగనున్న కేటీఆర్ రోడ్‌షోలకు నాయకులంతా హాజరుకానున్నారు. -
ఇక లాంఛనమే..
- తిరుగుబాటుదారులు వెనకడుగు - డమ్మీల నామినేషన్లు ఉపంసహరణ - ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం - పెద్దల సభకు మాజీ ఎంపీలు పప్పల, మూర్తి సాక్షి, విశాఖపట్నం: ఊహించినట్టుగానే నామినేటెడ్ పదవుల ఎరతో రెబల్స్ వెనక్కు తగ్గారు. మరో రోజు గడువుండగానే రెబల్‌తో పాటు డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. రెండుస్థానాల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే బరిలో మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మాజీ ఎంపీలు పప్పల చలపతిరావు, ఎంవీవీఎస్ మూర్తిలు పెద్దల సభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. నామినేషన్ల ఘట్టం పూర్తికాకుండానే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. క్యాంపు రాజకీయాలకు ఆస్కారంలేకుండానే ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. తొలుత సింగిల్ బ్యాలెట్ పద్ధలో ఎన్నికలు జరుగుతాయన్న భావనతో మాజీ ఎంపీ పప్పల చలపతిరావును పార్టీఅధినాయకత్వం ఎంపికచేసింది. రెండుస్థానాలకు వేర్వేరు బ్యాలెట్లలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో టీడీపీ రెండోస్థానం కోసం అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడింది. రూరల్ మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు లేదా టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తిచూపుతున్న గండి బాబ్జిల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని మంత్రి అయ్యన్న పట్టుబట్టగా, మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు ఇవ్వాలని గంటా పట్టుబట్టారు. ఎస్టీ కోటాలో తమకుఇవ్వాలని మాజీమంత్రి మణికుమారితో పాటుమాజీ జెడ్పీచైర్‌పర్శన్ వంజంగి కాంతమ్మ, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కంభం రవిబాబులు కూడా ఒత్తిడి తీసు కొచ్చారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి సీటు కట్టబెట్టడంతో అసంతృప్తి జ్వాలలు పెల్లు బికాయి. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఏకంగా రెండుస్థానాలకు నామినేషన్లు దాఖలు చేసి పార్టీ అధినేతలు సవాల్ విసరగా, రామానాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిలు నామినేషన్ వేసేందుకు సిద్దపడి చివరకు మంత్రి అయ్యన్నతో గవిరెడ్డి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఒత్తిడితో బాబ్జిలు వెనక్కి తగ్గారు. బరిలో నిలిచిన కన్నబాబు రాజుతో పాటు గవిరెడ్డిని హైదారబాద్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా మంత్రులు నామినేటెడ్ పదవుల ఎర చూపారు. దీంతో శాంతించిన కన్నబాబురాజు గురువారం నామి నేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసినట్ట య్యింది. మాజీ ఎంపీలు పప్పల, ఎంవీవీఎస్ల ఎన్నిక ఇక లాంఛనం కానుంది. అయితే వీరు ఎమ్మెల్సీలుగా పిలిపించు కునేందుకు మరో ఇరవై రోజులు ఆగాల్సిందే. ఓట్ల లెక్కింపు రోజైన జూలై-7వ వీరికి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన రాష్ర్ట ప్రాధమిక విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పి. సిసోడియం గురు వారం నగరానికి చేరుకున్నారు.