breaking news
Ranbaxy lyaboretaris
-
ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లకు ఈడీ షాక్
న్యూఢిల్లీ : ఫార్మా కంపెనీ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ మోహన్ సింగ్ ఆయన సోదరుడు శివిందర్ మోహన్ సింగ్ ఢిల్లీ నివాసాలపై గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేపట్టారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఫిర్యాదుపై ఈడీ వారి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, సింగ్ సోదరులపై గత ఏడాది డిసెంబర్లో రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ ఢిల్లీ పోలీసులు, ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ కేసు నమోదు చేసింది. వీరు ఇద్దరూ రూ 740 కోట్ల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, నిధులను దారి మళ్లించారని అభియోగాలను ఎదుర్కొంటున్నారు. -
ర్యాన్‌బాక్సీ డీలిస్టింగ్
ముంబై: ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ షేర్ల ట్రేడింగ్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో వచ్చే నెల 6 నుంచి ఆగిపోనున్నది. ఈ కంపెనీ సన్‌ఫార్మా కంపెనీలో విలీనమవుతున్నందున ఆ రోజు నుంచి ర్యాన్‌బాక్సీ షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ కావు. వచ్చే నెల 1వ తేదీ వీటి ట్రేడింగ్‌కు చివరి తేదీ. (వచ్చే నెల 2న మహావీర్ జయంతి, 3న గుడ్‌ఫ్రైడ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు) ర్యాన్‌బాక్సీ కంపెనీని 400 కోట్ల డాలర్లకు సన్ ఫార్మా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ విలీనానికి అన్ని రకాలైన అనుమతులు లభించడంతో ర్యాన్‌బాక్సీని స్టాక్ ఎక్స్ఛేంజ్ల నుంచి సన్ ఫార్మా డీలిస్ట్ చేయనున్నది. ర్యాన్‌బాక్సీ వాటాదారులకు షేర్ల కేటాయింపుకు ఏప్రిల్ 7వ తేదీని రికార్డ్ డేట్‌గా సన్‌ఫార్మా నిర్ణయించింది. రూ.5 ముఖ విలువ గల 10 ర్యాన్‌బాక్సీ షేర్లకు రూ.1 ముఖ విలువ గల సన్ ఫార్మా షేర్లు ఎనిమిదింటిని కేటాయిస్తారు. ఈ విలీనం కారణంగా సన్‌ఫార్మా ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఫార్మా కంపెనీగా అవతరించనున్నది. ఈ నేపథ్యంలో సన్ ఫార్మా 1.4 శాతం వృద్ధితో రూ.1,052 వద్ద, ర్యాన్‌బాక్సీ కూడా 1.4 శాతం వృద్ధితో రూ.831 వద్ద ముగిశాయి. ఆర్అండ్డీపై మరింత దృష్టి...: సంఘ్వీ ర్యాన్‌బాక్సీ విలీనం పూర్తి కావడంతో ఇకపై పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ చెప్పారు. ఇరు సంస్థల కలయికవల్ల రాబోయే మూడేళ్లలో 250 మిలియన్ డాలర్ల మేర ప్రయోజనం చేకూరగలదన్నారు. అయిదు ఖండాల్లో 150 పైగా దేశాల్లో తమ ఉత్పత్తుల విక్రయం జరుగుతుందని సంఘ్వీ తెలిపారు.