breaking news
Ramya child
-
క్లాస్‌లో ‘ట్రాఫిక్’ సిలబస్
► ఒకటో తరగతి నుంచే పాఠ్యాంశంగా అమలు ► పరీక్షల్లోనూ సంబంధిత ప్రశ్నలకు మార్కులు ► ఈ ఏడాదికి బుక్లెట్స్ రూపంలో.. ► వచ్చే ఏడాది నుంచి టెక్ట్స్ బుక్స్‌లో.. సాక్షి, సిటీబ్యూరో: చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఉదంతంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏటా వేల మందిని పొట్టనపెట్టుకుంటూ, అంతకు రెట్టింపు క్షతగాత్రులుగా మారుస్తున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం వివిధ చర్యలు ప్రారంభించడంతో సరిపెట్టకుండా, వాటి అమలు తీరునూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చనున్నాం. బడి ఈడు నుంచే బాధ్యతలను పెంచితే సత్ఫలితాలు ఉంటాయి. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
స్పీకర్ పరామర్శ
అంబర్‌పేట: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య కుటుంబసభ్యులను తెలంగాణ శాసన సభా స్పీకర్ మధుసూదనాచారి మంగళవారం పరామర్శించారు. డీడీ కాలనీ ఉన్న రమ్య అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆయన.. ఇదే ప్రమాదం తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమై చిన్నారి తల్లి రాధిక ఆరోగ్య పరిస్థితిని ఆమె తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా మీ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రమాదానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ పద్మవతిరెడ్డి ఉన్నారు.