breaking news
Ramu Surya Rao
-
వైఎస్ జగన్‌తో ఆర్ఎస్ఆర్ మాస్టారు భేటీ
⇒ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుకు వినతి ⇒ జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడి సాక్షి, హైదరాబాద్: పీడీఎఫ్ ఎమ్మెల్సీ, ఆర్ఎస్ఆర్ మాస్టారుగా అందరికీ చిర పరిచితులైన రాము సూర్యారావు మాస్టారు సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. జగన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేయని నియోజకవర్గాల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు జగన్ సాను కూలంగా స్పందించినట్లు ఆర్ఎస్ఆర్ మాస్టారు చెప్పారు. జగన్‌తో భేటీ అనంతరం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేయని నియోజకవర్గాల్లో తమకు మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరినట్లు తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి విఠల బాలసుబ్రహ్మణ్యం, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వై.శ్రీనివాసరెడ్డి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి అజయ్ శర్మలకు మద్దతు కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తికి జగన్ సాను కూలంగా స్పందించారని చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ తనకు మద్దతు ఇచ్చిందని మాస్టారు గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని చెప్పినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడు జగన్ అని కొనియాడారు. -
నీతి, నిజాయితీ బతికే ఉన్నాయ్
నిడదవోలు : ‘యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఎన్నికల ప్రచారం కోసం ఏ కాలేజీకి.. ఏ పాఠశాలకు వెళ్లినా ఉపాధ్యాయులు, నా వద్ద చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఆదరించారు. వారి సొంత ఖర్చులతో నన్ను ప్రచారానికి తీసుకెళ్లారు. నీతి, నిజాయితీలు ఇంకా బతికే ఉన్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు నిరూపించారు. నా విజయానికి కారణమైన యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడతా’నని ఎమ్మెల్సీగా ఎన్నికైన రాము సూర్యారావు అన్నారు. శుక్రవారం రాత్రి నిడదవోలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత ప్రవక్తలు, మహనీయుల స్ఫూర్తితో, మనిషిలో దేవుడుంటాడనే నమ్మకంతో తన సొం త ఆస్తిని సైతం అమ్ముకుని వేలాది మంది పేద విద్యార్థులను చదివించానని చెప్పారు. వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆనందం వ్యక్తం చేశారు. సీఆర్ రెడ్డి కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసినప్పటి నుంచి పేద రోగులకు సేవ చేస్తున్నానని, తనకు వచ్చే రూ.42 వేల పింఛను మొత్తాన్ని కూడా పేదలకు అవసరమైన మందుల కోసం ఖర్చు చేస్తున్నానని చెప్పారు. ఏ పేద రోగికి వైద్యం అందకపోయినా తాను సహాయపడతానన్నారు. పేద విద్యార్థులకు సాయం అందిస్తూనే ఉంటానన్నారు. ఏ పేద విద్యార్థి అయినా ఆర్థిక ఇబ్బం దుల వల్ల మధ్యలో చదువు ఆగిపోతే తనను సంప్రదిస్తే సహాయపడతానన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే క్రమంలో అవసరమైతే శాసనమండలిలోనే కాకుండా బయట కూడా పోరాటాలు చేస్తానన్నారు. ఆయన వెంట యూటీఎఫ్ నాయకులు జయకర్, గంగాధర్, సురేష్‌బాబు, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, సుందరబాబు ఉన్నారు.