సినిమాల్లో ఫెయిల్.. ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడేమో వేలకోట్ల సామ్రాజ్యం..!
సినిమా రంగం అందరికీ కలిసి రావడం అనేది చాలా అరుదు. ఒక్క మూవీ డిజాస్టర్ అయిందంటే చాలు కెరీర్ కొనసాగించడం చాలా కష్టమే. అలా అని అందరికీ పరిస్థితి ఇలానే ఉంటుందని కాదు. కొందరికీ మొదటి సినిమానే సూపర్ హిట్ కావొచ్చు.. మరికొందరికీ డిజాస్టర్ కావొచ్చు. కానీ ఒకట్రెండు సినిమాలు ఫెయిల్ అయినా కూడా.. తర్వాత సక్సెస్ బాట పట్టొచ్చు. మరి ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ తలుపు తట్టలేదంటే కారణం.. మనకు ఈ రంగం సెట్ కాదని ఫిక్సయిపోవచ్చు. అలాంటి హీరో కథే ఈ స్టోరీ. ఇలా జరగడం చాలా అరుదనే చెప్పాలి. కానీ ఇదే అతన్ని ఈ రోజు మరో స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందామా?తొలి మూవీనే కొత్త కథతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ గిరీశ్ కుమార్ తౌరానీ మాత్రం టాలీవుడ్ రీమేక్‌తో తన జర్నీ మొదలెట్టారు. అయితే ఆయన తొలి సినిమాకే స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. తెలుగులో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే మూవీ రీమేక్‌తో బాలీవుడ్ హీరో గిరీశ్ కుమార్ తౌరానీ ఎంట్రీ ఇచ్చారు. హిందీలో ఈ మూవీని జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా.. వస్తావయ్యా అనే టైటిల్‌తో తెరకెక్కించారు. అయినా కూడా గిరీశ్ కుమార్ లక్ కలిసి రాలేదు. తన మొదటి చిత్రం కొత్త కథతో చేసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఈ చిత్రంలో గిరీశ్ సరసన కోలీవుడ్ స్టార్ శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి గిరీశ్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది.ఆ తర్వాత గిరీశ్ కుమార్ 2016లో విడుదలైన 'లవేష్ షుదా' అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో హీరోగా కనిపించారు. ఇది కూడా గిరీశ్‌కు కలిసి రాలేదు. ఈ సినిమా విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విఫలం కావడంతో గిరీశ్ తన కెరీర్లో కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. కేవలం రెండు సినిమాల్లో మాత్రమే హీరోగా చేసిన గిరీశ్.. సినిమాలు తనకు సెట్ కావని డిసైడ్ అయిపోయాడు. తన రెండో సినిమా రిజల్ట్‌తోనే బయటకొచ్చేశాడు.బిజినెస్‌లో సక్సెస్..సినీ నిర్మాత కుమార్ ఎస్ తౌరానీ కుమారుడైన గిరీశ్ బిజినెస్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన తండ్రితో పాటు మేనమామ రమేష్ ఎస్ తౌరానీ ఆధ్వర్వంలో నడుస్తోన్న టిప్స్ ఇండస్ట్రీస్‌లో అడుగుపెట్టారు. కుటుంబ వ్యాపారంలోకి ప్రవేశించిన గిరీశ్ టిప్స్ కంపెనీ నడపడంలో సక్సెస్ అయ్యారు. సినిమాల్లో ఫెయిల్ అయినప్పటికీ.. టిప్స్ ఇండస్ట్రీస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువు దాదాపు పదివేల కోట్లకు పైమాటే. డిసెంబర్ 2024 నాటికి మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. రూ.10,517 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో గిరీశ్ షేరింగ్ దాపు రూ.2164 కోట్లుగా ఉంది. ఈ క్రమంలోనే సంపాదనలో రణబీర్ కపూర్ (రూ.400 కోట్లు), రణవీర్ సింగ్ (రూ.245 కోట్లు), వరుణ్ ధావన్ (రూ.380 కోట్లు), ఆమిర్ ఖాన్ (₹రూ.1900 కోట్లు) లాంటి సూపర్ స్టార్స్‌ను అధిగమించారు.బిజినెస్‌లో సక్సెస్ అయిన గిరీష్ తన చిన్ననాటి ప్రియురాలు కృష్ణ మంగ్వానీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ ఉంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబయిలో నివసిస్తున్నారు. గిరీశ్ ప్రస్తుతం టిప్స్ కంపెనీలో ప్రమోటర్ అండ్ ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్నారు.