breaking news
ram narayana
-
హీరోని వెతకడం సవాల్‌గా అనిపించింది: రామ్ నారాయణ్
‘‘లైలా’(laila) చిత్రకథని ఇద్దరు ముగ్గురు యువ హీరోలకి చెప్పా. కథ వారికి నచ్చినప్పటికీ లైలా అనే లేడీ గెటప్ వేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈపాత్ర చేయడానికి చాలా ధైర్యం కావాలి. అందుకే హీరోని వెతకడం సవాల్‌గా అనిపించింది. నిర్మాత సాహుగారికి ఈ కథ బాగా నచ్చి, విశ్వక్ సేన్‌గారికి చెప్పమని సలహా ఇచ్చారు. విశ్వక్‌గారు కథ వినగానే.. ఇలాంటి లేడీ గెటప్ వేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారు’’ అని డైరెక్టర్ రామ్ నారాయణ్(Ram Narayan) చెప్పారు. విశ్వక్ సేన్(Vishwak Sen), ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘‘బట్టల రామస్వామి బయోపిక్, దిల్ దివాన, ఉందిలే మంచి కాలం’ సినిమాలకు మ్యూజిక్ చేశాను.దర్శకుడిగా నా తొలి చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’ (2021) మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత ఓ యునిక్ స్టోరీగా ‘లైలా’ రాశా. హీరో లేడీ గెటప్ వేయడం వంటి చిత్రాలు ఈ మధ్య రాలేదు. ఆ నేపథ్యంలో వస్తున్న వినోదాత్మక చిత్రమిది. ఇందులో సోను మోడల్, లైలాగా విశ్వక్ నటించారు. ఈ చిత్రంలో ఎమోషన్, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ ఉన్నాయి’’ అని చెప్పారు. -
భద్రాచలాన్ని విడదీస్తే ఊరుకోం..
ఖమ్మం గాంధీచౌక్/ ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని విడదీస్తే ఊరుకునేది లేదని జర్నలిస్టుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మయూరిసెంటర్, బస్టాండ్, జడ్పీసెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అక్కడ దీక్ష చేస్తున్న పంచాయతీ రాజ్ ఉద్యోగులకు జర్నలిస్టులు సంఘీభావం ప్రకటించారు. భద్రాచలాన్ని కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని జర్నలిస్టు నేతలు ప్రకటించారు. భద్రాచలం డివిజన్‌ను పోలవరంతో ముంచేందుకే సీమాంధ్రులు ఆ డివిజన్ కావాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామ్‌నారాయణ, ఏనుగు వెంకటేశ్వరరావు, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎ.ఆదినారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా అసొసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసేన్, వెంకట్రావ్, జర్నలిస్టు నాయకులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాపారావు, కృష్ణమురారి, అప్పారావు, వనం వెంకటేశ్వర్లు, పోటు శ్రీనివాస్, వేణుగోపాల్, నాగేందర్ పాల్గొన్నారు. జర్నలిస్టుల ప్రదర్శనకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు, టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగారాజు, నడింపల్లి వెంకటపతిరాజు సంఘీభావం ప్రకటించారు