రాజుగారి గది-2  ఓ ఇంట్రస్టింగ్ న్యూస్
                  
	 హైదరాబాద్: ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్.  చిత్ర దర్శకుడు ఎస్ తమన్  ఈ శుభవార్తను ట్విట్టర్ లో షేర్ చేశారు.  ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న  ‘రాజుగారి గది-2’.  లోగోను ఈ  రోజు సా. 7గం.లకు   రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. దీంతో తమన్ సంగీతం కోసం...బ్యాగ్  గ్రౌండ్ స్కోర్ కోసం  వెయిట్  చేస్తున్నామంటూ కమెంట్లు వెల్లువెత్తాయి.  
	
	ముఖ్యంగా ఈ  చిత్ర హీరోయిన్ సమంత, అక్కినేని నాగార్జున కాబోయే కోడలు ఎక్సైటింగ్ అంటూ థమన్ ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు.  అంతేనా.. మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు సుబ్బరాజు తదితరులు ఈ కోవలో  ఉన్నారు.
	
	కాగా  పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినమాలో ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13 విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
	 
	
		7pm !! #rgg2 @iamnagarjuna @Samanthaprabhu2 @PVPCinema

	
		💪exciting !! https://t.co/Tu0GnlCoGd
	— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 25, 2017