breaking news
Rajugari gadi -2
-
ఆ మూడు నెలలు విరామం
ప్రసుత్తం సినిమా వార్తలన్నీ చెన్నై చిన్నది సమంత చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా వార్త ఏమిటంటే ఆ మూడు నెలలు ఆ భామ నటనకు విరామం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంమత తన ప్రేమికుడు, టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యను మనువాడనున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి అక్టోబర్ 6వ తేదీన ముహూర్తం కూడా కుదిరింది. దీంతో ఇప్పటి నుంచే తమ హనీమూన్‌కు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న సమంత సోమవారం తమ వివాహ తంతు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకున్నారు. పెళ్లి అనంతరం నటనను కొనసాగించాలని నిర్ణయించుకున్న సమంత వివాహానికి ఒక నెల ముందు, ఆ తరువాత మరో రెండు అంటూ మూడు నెలలు నటనకు విరామం ప్రకటించాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో తనకు కాబోయే మామ నాగార్జునతో కలిసి రాజుగారి గది– 2 చిత్రంతో పాటు, రామ్‌చరణ్‌కు జంటగా ఒక చిత్రం, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న మహానటి సావిత్రి జీవిత చరిత్రలోనూ నటించనున్నారు. అదే విధంగా తమిళంలో విజయ్‌తో ఆయన 61వ చిత్రంలోనూ, శివకార్తికేయన్‌తో మరో చిత్రం, అనీతికథైగళ్ అనే ఇంకో చిత్రంలోనూ నటించనున్నారు. వీటిలో విజయ్‌కు జంటగా నటించనున్న చిత్రానికి వచ్చే నెల నుంచి కాల్షీట్స్ కేటాయించారని సమాచారం. మరి ఆ తరువాత శివకార్తికేయన్, చిత్రం చేస్తారా? అనీతి కథైగళ్ చిత్రానికి ముందు ప్రైయారిటీ ఇస్తారా? లేక ఈ రెండు చిత్రాలను పెళ్లి తరువాతే అంటూ వాయదా వేస్తారా?అన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
హారర్ థ్రిల్లర్‌లో మామా కోడళ్లు?
అల్రెడీ అక్కినేని కుటుంబంలో హీరోలు ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్... అందరూ ‘మనం’లో కనిపించి అభిమానుల్ని ఖుషీ చేశారు. అందులో అక్కినేని కోడలు అమల అతిథిగా కనిపించారు. బహుశా... ఇటీవల కాలంలో అక్కినేని హీరోలు అండ్ కోడలు ఓ సినిమాలో కనిపించడం అదే మొదటిసారి. ‘మనం’లో ఓ హీరోయిన్గా నటించిన సమంత త్వరలో అక్కినేని ఇంట్లో అడుగు పెట్టనున్నారు. సమంత మెడలో నాగచైతన్య మూడు ముడులు వేసిన తర్వాత అధికారికంగా ఆమె నాగార్జున కోడలు అవుతారు. ఇప్పుడీ మామాకోడళ్లు ఇద్దరూ కలసి ఓ సినిమాలో నటించనున్నారట! నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందనున్న హారర్ థ్రిల్లర్ ‘రాజుగారి గది–2’లో సమంత కీలక పాత్ర చేయనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్త. దీనిపై ఇద్దరూ స్పందించలేదు. ఒకవేళ సమంత ఈ సినిమాలో నటిస్తే.. ఆమె ఏ పాత్రలో కనిపిస్తారు? అనేది చూడాలి. సినిమాలోనూ నాగ్, సమంత మామాకోడళ్లుగా కనిపిస్తారా? వెయిట్ అండ్ సీ.