breaking news
rajiv gandhi college
-
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
-
ఎవడ్రా సమైక్యాంధ్ర అంటోంది
-
రాజమండ్రిలో హర్షకుమార్ కళాశాల వద్ద ఉద్రిక్తత
రాజమండ్రిలో అమలాపురం ఎంపీ హర్షకుమార్కు చెందిన రాజీవ్ గాంధీ కళాశాల వద్ద శనివారం ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏపీఎన్జీవో నేతపై హర్షకుమార్ తనయులు దాడి చేయడంతో ఆ కళాశాల వద్దకు భారీగా సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆ కమ్రంలో అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆందోళనకారులను హెచ్చరించారు. అయితే పోలీసుల హెచ్చరికలను ఆందోళనకారులు పెడచెవిన పెట్టారు. దాంతో పోలీసుల భాష్పవాయువును ప్రయోగించారు. అయితే ఏపీఎన్జీవో నేత ఫిర్యాదుతో హర్షకుమార్ తనయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా ఈ రోజు ఉదయం రాజీవ్ గాంధీ కళాశాల వద్ద ఏపీఎన్జీవోలు ధర్నా చేపట్టారు. కళాశాల మూసివేయాలని వారు పిలుపునిచ్చారు. ఆ కమ్రంలో అక్కడ ఉన్న హర్షకుమార్ ఫ్లెక్సీని కొందరు చించేశారు. దాంతో హర్షకుమార్ తనయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీఎన్జీవో నేతపై దాడి చేశారు. ఆ ఘటనపై ఏపీఎన్జీవోలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాజీవ్‌గాంధీ కళాశాలను సమైక్యవాదులు, ఆందోళనకారులు ముట్టడించారు. -
ఏపీఎన్జీవో నేతపై హర్షకుమార్ తనయుల దాడి
రాజమండ్రి నగరంలో అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్కు చెందిన రాజీవ్ గాంధీ కళాశాలను సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు శనివారం ముట్టడించారు. ఆ సమయంలో అక్కడ కట్టిన హర్షకుమార్ ఫ్లెక్సీని సమైక్యవాదులు చించేశారు. ఆ ఘటనపై హర్షకుమార్ తనయులు మండిపడ్డారు. అనంతరం వారు ఏపీఎన్జీవో నేతపై దాడి చేశారు. దాంతో ఏపీ ఎన్జీవోలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తు కళాశాలకు చెందిన బస్సులను ధ్వంసం చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.