breaking news
rajiv chilaka
-
చోటా భీమ్‌ను ఆస్కార్‌కు తీసుకెళ్లాలి
‘‘ఇది వరకు చూసిన ‘చోటాభీమ్’ చిత్రాలకు, ఇప్పడు వస్తున్న ‘చోటా బీమ్: కుంగ్‌ఫూ ధమకా’కి తేడా ఏంటంటే ‘ఎక్స్పీరియన్స్’. పాత సినిమాలన్నీ 2డీలో షూట్ చేశాం. లేటేస్ట్ చిత్రాన్ని స్టీరియోస్కోపిక్ 3డీలో షూట్ చేశాం. మునుపటి సినిమాల కంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు ‘చోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక. యానిమేషన్ క్యారెక్టర్ చోటా భీమ్ ముఖ్య పాత్రలో రాజీవ్ చిలక తెరకెక్కించిన తాజా చిత్రం ‘చోటా భీమ్: కుంగ్ఫు ధమాకా’. ఈ చిత్రం మే 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజీవ్ మాట్లాడుతూ – ‘‘చోటా భీమ్’, అతని గ్యాంగ్ కలసి చైనా వెళ్లి, అక్కడ కుంగ్‌ఫూ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అన్నదే సినిమా కథ. పిల్లలు ఎంజాయ్ చేసే యాక్షన్, కామెడీ ఇందులో ఉంటాయి. చైనీస్ ఫుడ్‌ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించి ఓ సాంగ్ ఉంది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీతో ఓ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేశాం. సినిమా లాస్ట్‌లో వచ్చే ఈ సాంగ్‌లో సినిమాలోని క్యారెక్టర్స్‌తో పాటు దలేర్ పాడుతూ, డ్యాన్స్ చేస్తారు. మన ఫ్రెండ్‌కి ఏదైనా కష్టం ఎదురైతే మనం నిలబడాలి. మన సైజ్ కాదు.. మన సంకల్పం ముఖ్యం అనే సందేశం ఈ సినిమాలో ఉంటుంది. 3డీ సినిమాకు చాలా ఫోకస్ కావాలి. ఈ సినిమాను ఐదేళ్లుగా షూట్ చేస్తున్నాం. ఏదో రోజు చోటాభీమ్ ఆస్కార్‌కు వెళ్తాడు అనే నమ్మకం ఉంది, తీసుకువెళ్లడానికి మా సామర్థ్యం మించి పని చేస్తాం’’ అని అన్నారు. -
ఛోటా భీమ్ బడా హిట్
‘ఛోటా భీమ్’... బుల్లితెరపై ఇది బడా హిట్. చిన్నారుల క్రేజీహీరో ఛోటా భీమ్ సృష్టికర్త రాజీవ్ చిలక తన విజయగాథతో ఆగస్ట్ఫెస్ట్లో ఔత్సాహికులకు స్ఫూర్తినివ్వనున్నారు. ఛోటాభీమ్ బుల్లితెరపైకి వచ్చేంత వరకు ఒడిదొడుకుల పయనం ఆయనది. అకుంఠితమైన ఆత్మవిశ్వాసంతో అన్ని ఆటంకాలను అధిగమించి, విజయపథంలో దూసుకుపోతున్న రాజీవ్ చిలక ‘సిటీప్లస్’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే... ఆలోచనల్లోంచి పుట్టిన పాత్ర... నా ఆలోచనల్లోంచి ఛోటా భీమ్ పాత్ర 2003 సెప్టెంబర్ 18న పుట్టింది. దాని చుట్టూ కథ అల్లుకుని, పైలట్ ప్రాజెక్టు చేసేసరికి ఆరు నెలలు పట్టింది. నచ్చకపోవడంతో మరో ఏడాది శ్రమించి రీడిజైన్ చేశా. తర్వాత 2005లో కార్టూన్ నెట్వర్క్, డిస్నీ వంటి అన్ని చానల్స్‌కూ చూపించా. ఇండియన్ మార్కెట్లో నడవదని వాళ్లు రిజెక్ట్ చేశారు. మరికొన్ని మార్పులతో తిరిగి ప్రెజెంట్ చేసినా, ‘నో’ అనేశారు. స్టోరీ టెల్లింగ్‌లో ఇంకొన్ని మార్పులు చేసి అప్రోచ్ అయితే ‘పోగో’ చానల్ ఓకే చేసింది. అప్పుల కుప్పలు మాకొచ్చిన ఆర్డర్‌తో కొత్త ఆఫీసు తీసుకున్నాం. ‘ఛోటా భీమ్’ మరో పదిరోజుల్లోగా పోగో చానల్లో కనిపిస్తుందనగా, 2008 మార్చి 26 అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. ఛోటా భీమ్ సక్సెస్‌ను కళ్లారా చూసుకోక ముందే అంతా బూడిదైంది. అప్పుల కుప్పలు భయపెట్టాయి. అయినా, ఒక చిన్న ఆశ... ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చెక్కుచెదరలేదు కదా అని! అదే మమ్మల్ని ముందుకు నడిపింది. అప్పుల వాళ్లందరినీ పిలిచి జరిగింది చెప్పాను. మరో మూడు నెలలు టైమిస్తే అణాపైసలతో సహా అప్పంతా తీర్చేస్తానన్నాను. అయితే, అప్పటి వరకు ఇంకొంచెం మెటీరియల్ సప్లయ్ చేయమని అడిగా. అంతా వింతగా చూశారు. ఏం చూసుకుని మళ్లీ అప్పు అడుగుతున్నాడని అనుకున్నారేమో! పదిరోజుల్లో టెలికాస్ట్ కాబోయే ‘ఛోటాభీమ్’ గురించి చెప్పి వాళ్లను కన్విన్స్ చేశా. ఛోటాభీమ్ స్క్రీన్‌పైకి వచ్చింది. అనుకోని రేంజ్లో హిట్ అయింది. అనుకున్న సమయానికే అప్పులన్నీ తీరిపోయాయి. ఆర్డర్స్ వచ్చిపడ్డాయి. ఇదే ఎగ్జాంపుల్‌గా మాట్లాడతా... ఆగస్ట్ ఫెస్ట్‌లో నాకు ఇరవై నిమిషాల సమయం కేటాయించారు. సక్సెస్ఫుల్ ప్రాజెక్టును ఎలా క్రియేట్ చేసుకోవాలి, కలలను నెరవేర్చుకోవడానికి ఎలా పనిచేయాలి అనే దానిపై ‘ఛోటాభీమ్’నే ఎగ్జాంపుల్‌గా మాట్లాడాలనుకుంటున్నా. నా కథలో డ్రీమ్, ఐడియా, క్రియేటివిటీ, మార్కెటింగ్, కరేజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అచీవ్మెంట్ అన్నీ ఉన్నాయి. వాటినే ‘ఛోటాభీమ్’ను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేస్తూ వచ్చిన వాళ్లకు ఇన్స్పిరేషన్గా చూపించదలచుకున్నా. ఈరోజు ఏ కంపెనీలోనైనా ఇండియన్ పవరే అద్భుతాలు సృష్టిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ను తీసుకుంటే... విండోస్ నుంచి ప్రతి ప్రాడక్ట్లోనూ ఇండియన్సే ఎక్కువమంది. ఆ కంపెనీ సీఈవో కూడా ఇండియనే. మనకు ఎబిలిటీ ఉంది. దానిని కెరీర్‌గా మలచుకునే ధైర్యమే కావాలి. ఇదే మన సక్సెస్ సూత్రం.