breaking news
Rajasthan Anti-Terrorism Squad
-
జైపూర్ పేలుళ్లు : నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
జైపూర్ : 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు నలుగురు నిందితులను బుధవారం దోషులుగా తేల్చింది. ఒకరిని బెనిఫిట్ ఆఫ్ డౌట్‌గా వదిలేసింది. వివరాలు.. 2008 మే నెలలో జైపూర్ పాత నగరంలోని హనుమాన్ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి. 2 కిలోమీటర్ల వ్యాసార్ధంలో, 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. అనంతరం అప్రమత్తమైన పోలీసులు స్థానిక హనుమాన్ ఆలయ సమీపంలోని ఒక బాంబుతో పాటు నాలుగు బాంబులను కనుగొని వాటిని నిర్వీర్యం చేశారు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో అనేక మంది హనుమాన్ భక్తులు, విదేశీ పర్యాటకులు వస్తుండడంతో ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటన వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహాదీ ఇస్లామీ (హుజి) అనే ఉగ్రవాద సంస్ధ హస్తం ఉన్నట్టు అనుమానించిన పోలీసులు.. మొహమ్మద్ షాబాజ్ హుస్సేన్, మొహమ్మద్ సైఫ్ అకా కారియోన్, మొహమ్మద్ సర్వార్ అజ్మి, మొహమ్మద్ సైఫ్ అలియాస్ సైఫుర్ రహమాన్ అన్సారీ, మొహమ్మద్ సల్మాన్‌లను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించిన రాజస్థాన్ ఏటీసీ విభాగం ఐదుగురిని అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు విచారణ కొనసాగగా, ప్రత్యేక కోర్టు బుధవారం నలుగురిని దోషులుగా ప్రకటించింది. -
ఆర్మీ ఉద్యోగాల పేరుతో మోసం, 1.79 కోట్లు సీజ్
జైపూర్ : ఆర్మీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేసిన ఓ ముఠా గుట్టును రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్వాడ్ రట్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించి సోమవారం సాయంత్రం నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.79 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థుల ఒరిజినల్ మార్క్ షీట్లలతో పాటు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను సీజ్ చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన అర్జున్‌సింగ్‌ను పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఆర్మీ క్యాంటీన్ నుంచి కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. నిరుద్యోగుల నుంచి ఈ ముఠా ఒక్కో పోస్ట్‌కు నాలుగు లక్షలు వసూలు చేయడంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను సెక్యూరిటీ కింద తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఫిజికల్, మెడికల్ టెస్ట్ పూర్తియిన తర్వాత అభ్యర్థుల నుంచి మరికొంత మొత్తంలో ఈ ముఠా డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారంలో ఆర్మీ సిబ్బందికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.