breaking news
Rajahmundry mayor
-
అవమానంతో టీడీపీ మహిళా మేయర్ కంటతడి
-
టీడీపీ మహిళా మేయర్‌కు అవమానం
సాక్షి, రాజమండ్రి : వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. శంకుస్థాపన శిలాఫలకంపై నగర మేయర్ రజనీశేషసాయి పేరు లేదు. దీనిపై మేయర్ రజనీ శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టుకున్నారు. తనను కార్యక్రమానికి ఆహ్వానించి అధికారులు అవమానించాంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తనను పిలవకపోయినా బాధపడేదానిని కాదని, కానీ ఇలా పిలిచి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంపై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యక్రమం ప్రారంభం కాకముందే సభా వేదిక నుంచి మేయర్ వెళ్లిపోయారు. అయితే కార్యక్రమం నుంచి మేయర్ వెళ్లిపోవడం అక్కడకు వచ్చిన పార్టీ నేతల్లోను ఒకింత ఆలోచనను కలిగించింది. అవసరం తీరాక అందరినీ వదిలించకోవడం, గిట్టని వారిని అవమానించడం పార్టీలో మామూలే కదా, అయినా మేయర్ పరిస్థితే ఇలా ఉంటే సాధారణ, చిన్న స్థాయి నేతల పరిస్థితి ఏంటో అని అనుకుంటున్నారు. -
బస్తీల్లో కొత్త జమానా
- జిల్లాలో కొలువుదీరిన కొత్త కౌన్సిళ్లు రాజమండ్రి మేయర్‌గా రజనీ శేషసాయి - రామచంద్రపురంలో టీడీపీ కుటిల వ్యూహం ఏలేశ్వరంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌కు ఎర సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి నగర పాలక సంస్థ, అమలాపురం, తుని, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీల తొలి కౌన్సిల్ సమావేశాలు గురువారం జరిగాయి. అన్నిచో ట్లా పురపాలన టీడీపీకే దక్కింది. ఎన్నికల అధికారులు ఉదయం 11.00 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో తెలుగు అక్షర క్రమంలో ప్రమాణం చేయించారు. అనంతరం మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించారు. ముమ్మిడివరం మినహా అన్నిచోట్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. రాజమండ్రి మేయర్‌గా పంతం రజనీ శేషసాయి పేరును 22వ డివిజన్ కార్పొరేటర్ మాటూరి రంగారావు ప్రతిపాదించగా, 32వ డివిజన్ కార్పొరేటర్ ద్వారా పార్వతీసుందరి బలపరిచారు. మరో నామినేషన్ పడక పోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ప్రకటించారు. డిప్యూటీ మేయర్‌గా వాసిరెడ్డి రాంబాబు ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీ ఆది రెడ్డి అప్పారావు, రాజమండ్రి రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆకుల సత్యనారాయ ణ హాజరయ్యారు. అమలాపురంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఆర్డీఓ సీహెచ్ ప్రియాంక పర్యవేక్షణలో జరిగాయి. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు హాజరయ్యారు. పెద్దాపురంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఒక్కొక్క నామినేషనే పడ్డందున ఎన్నిక ఏకగ్రీవమైందని ఆర్డీఓ కూర్మానాథ్ ప్రకటించారు. పిఠాపురంలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రావ ు ప్రకటించారు. ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సమావేశానికి హాజరయ్యారు. మండపేటలో కూడా రెండు పదవులూ ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా డీఈఓ శ్రీనివాసులురెడ్డి వ్యవహరించారు. సామర్లకోటలో ఆయనకు బదులు ఆవిడ.. సామర్లకోటలో చైర్మన్ ఎన్నిక అనుకోని మలుపు తిరిగింది. ముందుగా చైర్మన్‌గా మన్యం చంద్రరావు పేరును ఖరారు చేసినా.. చివరి క్షణంలో సామాజిక సమీకరణాల పేరుతో పోటీ నెలకొనడంతో చంద్రరావు భార్య, 26వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి ఆ పదవిని కట్టబెట్టారు. ఇతరుల అసంతృప్తిని మహిళా సెంటిమెంట్‌తో అధిగమించే ప్రయత్నం చేశారు టీడీపీ పెద్దలు. సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పరిస్థితిని సమీక్షించి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం చేశారు. బలమున్నా.. ఇండిపెండెంట్‌కు పట్టం రామచంద్రపురంలో టీడీపీకి మెజారిటీ సభ్యులున్నా పార్టీ అభ్యర్థిని కాక ఇండిపెండెంట్‌ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ఎస్ఆర్కే గోపాల్‌బాబును ప్రకటించారు. తీరా ఆయన ఓటమి పాలవడంతో కంగు తిన్న పార్టీ నేతలు కొత్త ఎత్తుగడగానే ఇండిపెండెంట్‌కు పట్టం కట్టించారని తెలుస్తోంది. త్వరలోనే ఇండిపెండెంట్ చై ర్మన్తో రాజీనామా చేయించి అదే స్థానంలో మళ్లీ గోపాల్‌బాబును గెలిపించి చైర్మన్ చేయాలన్నదే ఆ ఎత్తుగడ అని పార్టీ వర్గాలంటున్నాయి. చైర్ పర్సన్ విప్ ధిక్కరణపై ఫిర్యాదు ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ పీఠం కోసం టీడీపీ తప్పుడు రాజకీయానికి పాల్పడింది. ఇక్కడ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన టీడీపీకి ఆ కేటగిరీలో విజేతే లేకపోయా రు. దీంతో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఆరో వార్డు కౌన్సిలర్ కొప్పాడ పార్వతికి చైర్మన్ పదవిని ఎరగా చూపి తమ వైపు తిప్పుకొన్నారు. గురువారం ఆమెనే చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తమ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. పార్వతి విప్ ధిక్కరించడంపై వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేయగా నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేస్తామని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పోలవరం ప్రాజెక్టు భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ విజయ సారథి చెప్పారు. గొల్లప్రోలులోనూ కుట్రే గొల్లప్రోలు నగర పంచాయతీలోనూ టీడీపీ కుటిల రాజకీయాలకు పాల్పడింది. ఇక్కడ టీడీపీకి 10, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 10 ఓట్ల బలం ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే వర్మతో టీడీపీ ఓట్లు 11 అవుతాయి. అయినా వైఎస్సార్ సీపీకి చెందిన 10వ వార్డు కౌన్సిలర్ పడాల రాంబాబుకు వైస్ చైర్మన్ పదవిని ఆశ చూపి ఓటింగ్‌కు గైర్హాజరయ్యేలా చేశారు. ప్రమాణ స్వీకారం చేశాక రాంబాబు చైర్మన్ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. చైర్మన్ ఎన్నిక అనంతరం టీడీపీ కౌన్సిలర్లు పడాలను వైస్‌చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ విప్ తెడ్ల చిన్నారావు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి అయిన పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ టి.విఎస్.జి.కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరంలో ఓటింగ్‌లో గెలిచిన చెల్లి ముమ్మిడివరం నగర పంచాయతీలో చైర్మన్ పదవికి జరిగిన ఓటింగ్‌లో టీడీపీ అభ్యర్థి చెల్లి శాంత కుమారికి 13 ఓట్లు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాశిన బాల ముని కుమారికి 9 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో రెండుపార్టీలకు చెరో ఎనిమిది వార్డులు లభించగా నలుగురు ఇండిపెం డెంట్లలో ముగ్గురిని టీడీపీ తన వైపు తిప్పుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మె ల్యే దాట్ల బుచ్చిబాబు ఓట్లతో కలిపి 13 ఓట్లు సాధిం చింది. తునిలో ‘వైస్ కోసం తెలుగుతమ్ముళ్ల పోటీ తునిలో చైర్మన్ పదవి ఏకగ్రీవమైనా వైస్ చైర్మన్ పదవికి కుచ్చర్ల జగన్నాథరాజు, కె.బాలాజీ పోటీ పడగా గంటపాటు అయోమయం నెలకొంది. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యనమల కృష్ణుడు ఇద్దరికీ చెరో రెండున్నరేళ్లు పదవి ఇచ్చేలా రాజీ కుదిర్చారు. దీంతో తొలి విడతకు జగన్నాథరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఓటు అడిగే హక్కు మాకే ఉంది
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రిలో ఓటు అడిగే హక్కు ఇద్దరికే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి మేయర్ అభ్యర్థి షర్మిలారెడ్డి అంటున్నారు. ప్రజలు మెచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానేత రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరు కాగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టిన మేడపాటి సీతారామరెడ్డి వారసురాలిగా తనకు ఉన్నాయంటున్నారు విద్యావంతురాలిగా, యువతరానికి ప్రతినిధిగా తాను రాజమండ్రిని గ్రేటర్ సిటీగా అబివృద్ధి చేస్తానంటున్న షర్మిల వివరాలు... విద్య : భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజ నీరింగ్ కళాశాల నుంచి బీటెక్. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ. గ్రూప్-1 ప్రిలిమ్స్ పాసై, మెయిన్స్‌కు అర్హత సాధించారు. కుటుంబ నేపథ్యం : భర్త: నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన ప్రముఖ కాంట్రాక్టర్ మేడపాటి సీతారామ రెడ్డి సీతారామరెడ్డి కుమారుడు మేడపాటి అనిల్ కుమార రెడ్డి. బీఈ పూర్తిచేశారు. ప్రముఖ వ్యాపార వేత్త. నగరంలో ఈట్ అండ్ ప్లే అనే రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిల్లలు. పాప, బాబు. వ్యక్తిత్వం : చిరునవ్వుతో అందరినీ పలకరించడం, ఏదైనా సరే సాధించాలని పట్టుదల. తన కష్టాన్ని నమ్ముకుని విజయం సాధించాలన్న లక్ష్యం అభిలాష : యువత ఉన్నత విద్యావంతులు కావాలి. వారి పరిజ్ఞానం సామాజిక సేవకు అంకితం కావాలి. రాజమండ్రిలో తాగు నీటి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో స్వచ్ఛమైన నీరు అందించాలి. మురుగు నీటి వ్యవస్థను సమూలంగా సంస్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలి. సీతారామ రెడ్డి సేవా కార్యక్రమాలు : సీతారామరెడ్డి అసాధారణ సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను ప్రభుత్వం నుంచి 1998-99లో భారతజ్యోతి అవార్డు అందుకున్నారు. ప్రజోపయోగార్థం కోటిలిగాల రేవులో రోటరీ కైలాస భూమి నిర్మించారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఆడిటోరియం నిర్మించారు. కంబాలచెరువు వద్ద హైటెక్ బస్టాండ్ నిర్మించారు. ఏకేసీ కళాశాల, షాడే బాలికల పాఠశాల, అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలోలో ప్రధాన భవనాలు నిర్మించి ఇచ్చారు. శబరిమలైలో కాటేజీలు, ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.