breaking news
raja shekar reddy
-
YSR ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు..
-
వైఎస్సార్ సెల్యూట్ కి ఏపీ పోలీసులు ఫిదా
-
స్వాతంత్ర దినోత్సవం రోజు వైఎస్సార్ అదిరిపోయే ప్రసంగం
-
మండుటెండల్లో వైఎస్సార్ గూస్ బంప్స్ స్పీచ్
-
అభిమాని చేసిన కామెడీకి వైఎస్సార్ రియాక్షన్
-
మహిళ సమస్యను స్పాట్ లో నే క్లియర్ చేసిన వైఎస్సార్
-
రోడ్లపై విగ్రహాలు ప్రతిష్టిస్తే కోర్టుధిక్కరణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా రహదారులు, పేవ్మెంట్లపై విగ్రహాలు ప్రతిష్టిస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఎక్కడైనా విగ్రహాలు ప్రతిష్టించినట్లు తమ దృష్టికి వస్తే సుమోటోగా కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాస నం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జా రీచేసింది. అడ్డగోలుగా విగ్రహాలను ప్రతిష్టిస్తు న్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదం టూ వచ్చిన కథనాలను గతంలో ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ము న్సిపల్, ఆర్అండ్బీ, హోంశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ప్రజల గుండెల్లో నిలిచిన నేత డాక్టర్ వైఎస్సార్
అట్లాంట: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోందని అభిప్రాయపడ్డారు ప్రవాస భారతీయులు. సీఎం జగన్ సైతం తండ్రిగారి బాటలోనే నడుస్తున్నారని ప్రశంసించారు. జులై 11 ఆదివారం మధ్యాహ్నం అట్లాంటాలో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సీడీసీ నిబంధనలు పాటిస్తూ రాజన్నకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ పాలన, ఆయన హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఏపీలో సీఎం జగన్ పాలనలో జరుగుతున్న ప్రజా సంక్షేమ పథకాలు గురించి చర్చించారు. శ్రీనివాస్‌రెడ్డి కొట్లూరు, నంద గోపినాథ్‌రెడ్డి, వెంకటరామి రెడ్డి చింతంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అట్లాంటాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఏ సభ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా భారీ ఎత్తున అభిమానులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి జరిగిన 72వ జయంతి వేడుకలకు భారీగానే ఆయన అభిమానులు వచ్చారు. ఇందులో ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాళ్లే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అభిమానులు కూడా ఉండటం విశేషం. జననేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కొంతమంది వక్తలు ప్రసంగిస్తూ.... వైఎస్సార్‌తో తమకున్న సాన్నిహిత్యం, ఆయన ద్వారా చేకూరిన లబ్ది, వారి ప్రాంతంలో అందిన సంక్షేమ ఫలాలు గురించి ప్రసంగించారు. -
దుష్ట సంహారం
సాక్షి ప్రతినిధి, కడప: వచ్చే ఎన్నికల్లో దుష్టసంహారం చేయాలని వైఎస్ విజయమ్మ కోరారు. వైఎస్ ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు.. మరెందరికో ఆర్థికంగా చేయూతనందించారు., వారంతా అండగా లేరు.. మాకు తోడూ నీడ గా మీరున్నారు.. మీప్రేమకు, ఆప్యాయతకు కృతజ్ఞతలు. మీరిచ్చిన స్ఫూర్తితోనే ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి నిలిచాం.. 30 ఏళ్లుగా రాజశేఖరరెడ్డిని భుజాలకెత్తుకొని మోశారు.. ఆదే ఆదరణ, ఆప్యాయతలు మాపై చూపుతున్నారు... మీరుణం తీర్చుకోలేనిదన్నారు.. ఎన్నికల ప్రచారం జనభేరిలో భాగంగా రెండవ రోజు కడప కార్పొరేషన్, మైదుకూరు, బద్వేలు, సిద్దవటంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి తాము బయటికి వచ్చాక జరిగిన అనేక ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చారన్నారు. కడప పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో జగన్‌బాబును గెలిపించారన్నారు. ఈ విషయంలో దేశచరిత్రలోనే జగన్ మూడో స్థానంలో నిలిచారన్నారు. దీనికి మీ ఆప్యాయతలే కారణమన్నారు. వైఎస్‌లాగే తమను కూడా మీ కడుపులో దాచుకున్నారని, మీ రుణం మరువలేనిదని విజయమ్మ పేర్కొన్నారు.మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుయుక్తులకు చరమగీతం పాడాలన్నారు. వైఎస్సార్‌జిల్లాలో మీ ప్రేమ, ఆప్యాయతల కారణంగా వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందని, ఈ ఎన్నికల్లో మరోమారు ఆదరించాలని కోరారు. విజయమ్మ జనభేరి సక్సెస్ కడప కార్పొరేషన్, మైదుకూరు, బద్వేలు మున్సిపాలిటీలలో గురువారం వైఎస్ విజయమ్మ నిర్వహించిన జనభేరి కార్యక్రమం సక్సెస్ అయింది. దివంగత నేత సతీమణి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని వస్తుందని తెలుసుకున్న ప్రజానీకం రోడ్లపై నిరీక్షించారు. మండుటెండలో సూర్యుడు చిన్నబుచ్చుకునేలా కడప పురవీధుల్లో భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు. బిల్డప్ నుంచి కృష్ణాసర్కిల్ వరకు పెద్దాయన సతీమణి కోసం బారులు తీరారు. ఓపికగా గంటల తరబడి నిరీక్షించారు. విజయమ్మ అనర్గళంగా ప్రసంగం చేయడం చేసి ప్రజానీకం ఆశ్చర్యానికి లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను వివరిస్తున్న ఒక దశలో ‘తల్లీ మీరు ఎండలో తిరగొద్దు. మీ కుటుంబానికి తోడునీడగా మేం ఉన్నాం.. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటాం’ అని కృష్ణాసర్కిల్‌లో ఉబికివస్తున్న దుఃఖంతో కొందరు విజయమ్మకు వివరించారు. విజయమ్మ రాకతో మైదుకూరు నాలుగురోడ్ల కూడలి జనసంద్రంగా మారింది. మూడు గంటలపాటు నిరీక్షించి మైదుకూరు ప్రజలు విజయమ్మను చూడగానే ఒక్కమారుగా జయజయధ్వానాలు పలుకుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బద్వేలు నాలుగు రోడ్ల కూడలిలో రాత్రి అయినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆమె కోసం వేచి చూశారు. భారీగా మహిళలు కూడా తరలివచ్చి వేచి ఉండటం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన పథకాలు, చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక పాలన, రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన అనంతరం కొనసాగిన కాంగ్రెస్ పాలనపై సవివరంగా విజయమ్మ ప్రసంగం చేయడం ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. ఆమె మాట్లాడుతున్న సేపు హర్షం వ్యక్తం చేస్తూ ఈలలు, కేకలు వేశారు. పర్యటనలో కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, జిలా కన్వీనర్, మేయర్ అభ్యర్థి కె.సురేష్‌బాబు, కమలాపురం, కడప, మైదుకూరు, బద్వేలు అభ్యర్థులు వరుసగా పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్బీ అంజాద్బాష, ఎస్ రఘురామిరెడ్డి, టీ జయరాములు, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.