breaking news
Railway doubling
-
మంగళూరు పోర్ట్ టు సికింద్రాబాద్
సాక్షి, న్యూఢిల్లీ: మంగళూరు పోర్ట్‌ను సికింద్రాబాద్‌తో అనుసంధానించే ముఖ్యమైన బళ్లారి– చిక్జాజూర్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.3,342 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు 185 కిలో మీటర్ల పొడవుతో ఉంటుంది. ప్రస్తుతం సికింద్రా బాద్ నుంచి కృష్ణపట్నం పోర్టుకు మాత్రమే రైలు మార్గం ఉండగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయంతో కొత్తగా మంగళూరు పోర్టును సికింద్రాబాద్‌తో అనుసంధానిస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) రెండు కీలక రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. జార్ఖండ్‌లోని కొడర్మా– బర్కాకానా డబ్లింగ్ ప్రాజె క్టు, బళ్లారి–చిక్జాజూర్ డబ్లింగ్ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణ సౌలభ్యం, సామగ్రి రవాణా సామర్థ్యం, తక్కువ లాజిస్టిక్ ఖర్చుతో సహజంగా కార్బన్ ఉద్గారాల తగ్గింపుతో ఉన్న మౌలిక వ్యవస్థను బలపరచనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.6,405 కోట్లు. ఈ రెండు కీలక ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.బళ్లారి–చిక్జాజూర్ ప్రాజెక్టు ఇలా...బళ్లారి–చిక్జాజూర్ రైలు డబ్లింగ్ ప్రాజెక్టు కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలు, ఏపీలోని అనంతపురం జిల్లా మీదుగా సాగుతుంది. 185 కి.మీ. మార్గంలో 19 స్టేషన్లు, 29 మెయిన్ బ్రిడ్జీలు, 230 మైనర్ బ్రిడ్జీలు, 21 ఆర్వోబీలు, 85 ఆర్‌యూబీలు ఉంటాయి. ఈ డబ్లింగ్ ప్రాజెక్టు ఇనుము ధాతువు, కోక్ కోల్, స్టీల్, ఎరువులు, ఆహార ధాన్యాలు, పెట్రోలియం పదార్థాల రవాణాకు కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు వల్ల 470 గ్రామాలకు మెరుగైన రవాణా సేవలు, 13 లక్షల జనాభాకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఏటా 18.9 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణాకు వీలవడమే కాకుండా ఈ మార్గం వల్ల ప్రతి సంవత్సరం 101 కోట్ల కిలోల కార్బన్‌డైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుంది. ఈ నూతన ప్రాజెక్టు వల్ల దాదాపు 20 కోట్ల లీటర్ల డీజిల్ పొదుపు అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. -
ప్రయాణికులకు అలర్ట్: నేటి నుంచి పలు రైళ్ల రద్దు
గుడివాడ టౌన్: ఉప్పులూరు–విజయవాడ రైల్వే డబ్లింగ్ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఆ మార్గంలో ఫ్రీఎన్‌ఐ, మెయిన్ ఎన్ఐ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు స్టేషన్ మే నేజర్ పొట్లూరి మోహన్‌గాంధీ శుక్రవారం తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం–బీదర్, బీదర్–మచిలీపట్నం, నర్సాపూర్–ధర్మవరం, ధర్మవరం–నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ–లింగంపల్లి, లింగంపల్లి–కాకినాడ రైళ్లు రద్దు అవుతాయి. అదే తేదీల్లో సర్కార్ ఎక్స్‌ప్రెస్ తెనాలి వర కు, నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుపతి–పూరి ఎక్స్‌ప్రెస్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్‌ప్రెస్, ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు జరుగుతుందని, మచిలీపట్నం–విజయవాడ, నర్సాపూర్–గుంటూరు పాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దవుతాయని ఆయన తెలిపారు. -
రైల్వే 'డబ్లింగ్'...
మచిలీపట్నం : రాష్ట్ర విభజన జరిగిన అనంతరమయినా మన ప్రాంతంలోని రైలు మార్గాలు అభివృద్ధి చెందుతాయనుకుంటున్న ప్రజల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పాలకులు పెద్దగా దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణం. మచిలీపట్నం - విజయవాడ మధ్య 80 కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ చేస్తామని ఎన్నాళ్లుగానో పాలకులు చెబుతూ వస్తుండగా.. ఎట్టకేలకు మూడు సంవత్సరాల క్రితం సర్వే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 50శాతం, కేంద్ర ప్రభుత్వం 50శాతం నిధులతో ఈ పనులను చేస్తామని గతంలో ప్రకటించారు. 2012 ఫిబ్రవరిలో రైల్వే డబ్లింగ్ పనులకు సంబంధించి సర్వే నిర్వహించారు. కోస్తా ప్రాంతం వెంబడి ఉన్న మచిలీపట్నం, నర్సాపురం, గుడివాడ, విజయవాడ, భీమవరం వరకు 221 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను డబ్లింగ్ చేసేందుకు రూ.1020 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అంచనా వేశారు. అయితే భీమవరం - గుడివాడ, విజయవాడ - గుడివాడ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు 2012 సెప్టెంబరు 7వ తేదీన టెండర్లు పిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కోస్తా తీరం వెంబడి రైలు మార్గాల అభివృద్ధికి నిధులే మంజూరు చేయలేదు.దీంతో ఈప్రాంత ప్రజలకు ఈ పనులపై తీవ్ర అయోమయం నెలకొంది. నిధుల కేటాయింపు జరిగేనా? కోస్తా తీరం వెంబడి ఉన్న రైల్వే లైన్‌ను అభివృద్ధి చేస్తామని పాలకులు చెబుతూ వస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం - గుడివాడ - విజయవాడ మధ్య డబ్లింగ్ పనులు జరిగే అవకాశం లేదని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులను ఈ పనులకు కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం మరో 50శాతం నిధులను కేటాయిస్తుందని అప్పుడే డబ్లింగ్ పనులను చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గుడివాడ - మచిలీపట్నం మధ్య రైల్వేలైను అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జిల్లాకు చెందిన పాలకులు ఎంతమేర స్పందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో కోస్తా ప్రాంతంలో వ్యాపార కేంద్రంగా వెలుగొందిన మచిలీపట్నం రైల్వేస్టేషన్ స్వదేశీ పాలనలో చిన్నపాటి స్టేషను స్థాయిలో సేవలందిస్తోంది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో మార్మగోవా నుంచి మచిలీపట్నం వరకు రైల్వేలైను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా సరుకులను ఇక్కడికి తరలించి బందరు పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇతర దేశాల నుంచి వచ్చిన సరుకులను దిగుమతి చేసుకుని రైలు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. బ్రిటీష్ పాలకులు 100 సంవత్సరాలకు పూర్వం ఈ రైల్వే ట్రాక్ నిర్మించారు. బ్రిటీష్ పాలకులు నిర్మించిన రైల్వే ట్రాక్ మినహా ఈ ప్రాంతంలో రైల్వేశాఖ ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం గమనార్హం. అధికారంలోకి రావడానికి రైల్వేలైను డబ్లింగ్ పనులు చేపడతామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు చెబుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయాన్ని మరచిపోవడం రివాజుగా మారింది. డబ్లింగ్ ప్రతిపాదనలు ఇలా.. విజయవాడ- గుడివాడ మధ్య 43 కిలోమీటర్లు, గుడివాడ - మచిలీపట్నం మధ్య 37 కిలోమీటర్లు , గుడివాడ - భీమవరం మధ్య 66 కిలోమీటర్లు, భీమవరం - నర్సాపూర్ మధ్య 30 కిలోమీటర్లు, భీమవరం - నిడదవోలు మధ్య 46 కిలోమీటర్లుకు రైల్వే లైన్ డంబ్లింగ్, విద్యుధీకరణ, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు సర్వే నిర్వహించారు. 221కిలోమీటర్లకు ఈ పనులను చేసేందుకు రూ. 1020 కోట్లు అవసరమని 2012వ సంవత్సరంలో అంచనా రూపొందించారు. 221 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డంబ్లింగ్లో భాగంగా 747 చోట్ల మైనర్ వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉంటుందని నిర్ణయించారు. 18 మీటర్లు లేదా 60 అడుగులకు పైబడిన డ్రెయిన్లు, కాలువలు 27 ఉన్నాయని ఈ ప్రాంతాల్లో మేజర్ వంతెనలను నిర్మించేందుకు అంచనాలు తయారు చేశారు. మార్కెట్లో మెటీరియల్ ధరలను దృష్టిలో ఉంచుకుని మూడు సంవత్సరాల క్రితం ఒక కిలోమీటరు రైల్వేలైను, సిగ్నల్ వ్యవస్థ, విద్యుదీకరణ పనులకు రూ.4.50 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ధరలు పెరగడంతో ఈ అంచనా వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆరు సంవత్సరాలుగా మచిలీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు ఒక్క నూతన రైలు సర్వీసునూ మంజూరు చేయలేదు. దీంతో పాటు మచిలీపట్నం - రేపల్లె మధ్య 47 కిలోమీటర్లు మేర నూతన రైల్వేలైను ఏర్పాటు చేసేందుకు ఏడు సంవత్సరాల క్రితం సర్వే చేశారు. ఈ సర్వే ప్రతిపాదన ఎక్కడ ఉందో ఎవరికి తెలియని దుస్థితి. మచిలీపట్నం - రేపల్లె మధ్య రైల్వే లైను నిర్మిస్తే కలకత్తా నుంచి చెన్నైకు దాదాపు 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంది. ప్రయాణ సమయం కలిసి వస్తుంది. కోస్తా తీరం వెంబడి లభించే మత్స్యసంపదను కలకత్తా, చెన్నైలకు తక్కువ ఖర్చుతో తరలించేందుకు అవకాశం ఉంది.