breaking news
rachel weisz
-
యాక్టర్ టు యాక్టివిస్ట్
స్నేహం ఎవరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎవరం చెప్పలేం. ఆ ప్రభావం వాళ్లని కొత్త దారిలోనూ నడిపించొచ్చు. అందుకు ఉదాహరణ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్. తన స్నేహితుడు రోజర్ వాల్ ప్రభావం వల్ల యాక్టర్ నుంచి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచే యాక్టివిస్ట్‌గా మారారామె. ఈ కథనంతా ఎలిజబెత్ టేలర్ బయోపిక్ రూపంలో త్వరలోనే సినిమాగా చూడవచ్చు. ‘స్పెషల్ రిలేషన్షిప్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఎలిజబెత్ పాత్రను హాలీవుడ్ నటి రేచల్ వేయిస్ చేయనున్నారని తెలిసింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
బాండ్ హీరో బ్యాచిలర్ కాదట..!
బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. అందుకే ఆ పాత్రల్లో నటించే నటీనటులకు కూడా అదే స్ధాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్ క్రెగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇలాంటి సమయంలో బాండ్ సినిమాలను ఫాలో అవుతున్న లేడీ ఫ్యాన్స్‌ను ఓ న్యూస్ షాక్‌కి గురి చేసింది. తెర మీద బాండ్ గర్ల్స్‌తో హాట్ హాట్ సీన్లలో కనిపించే జేమ్స్ బాండ్ తెర వెనుక మాత్రం ఫ్యామిలీ మ్యాన్ అట. ఈ విషయం ఆయన భార్య రచెల్ వెయిజ్ స్వయంగా వెల్లడించింది. 2010లో 'డ్రీమ్ హౌస్' సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి కలిసిన వీరిద్దరు ...2011లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తమ వివాహబంధాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్‌గానే మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్‌కు ప్రపంచ వ్యాప్తంగా లేడీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో క్రెగ్ బ్యాచిలర్ కాదన్న విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియనీయలేదని చెప్పింది రచెల్. ప్రస్తుతం డానియల్ క్రెగ్ బాండ్‌గా నటించిన 'స్పెక్టర్' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా బాండ్ సీరీస్‌లో ఆఖరిది అన్న ప్రచారం జరుగుతుండటంతో, ఇక బాండ్ బ్యాచిలర్ కాదన్న విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని భావించిన ఈ సెలబ్రిటీ కపుల్ తమ పెళ్లి గురించి, డానియల్ గురించి ఎన్నో విషయాలను 'మోర్' మేగజైన్‌తో పంచుకుంది.