breaking news
quick tips
-
గుండెలో మంటా?.. కంగారొద్దు.. ఇలా చేసి చూడండి
మధ్యాహ్నం లేదా రాత్రివేళ కడుపునిండా తిన్న తర్వాత కాసేపటికి పొట్ట పైభాగం నుండి ప్రారంభమై సన్నని మంట లాంటి నొప్పి నెమ్మదిగా తీవ్రమవుతూ ఛాతీ వరకు పాకుతుంది. కొన్ని సందర్భాలలో తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. దీనిని బట్టి చూస్తే గుండె నొప్పి అనుకుని కంగారు పడతాం. కానీ ఇది ఎసిడిటీ వలన వచ్చే సమస్య. అందువలన కంగారుపడి డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో ఛాతీ మంటను తగ్గించుకోవచ్చు. చదవండి: మూడ్స్ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్! గుప్పెడు పుదీనా ఆకులను కప్పు నీటిలో నానబెట్టి భోజనం అనంతరం ఆ నీటిని తీసుకోవాలి. ఆ విధంగా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెలో మంట తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే చిన్న బెల్లం ముక్కను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే ఎసిడిటీ తగ్గుతుంది. భోజనం అనంతరం కొన్ని తులసి ఆకులను నమిలి మింగాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తుంటే ఎసిడిటీ, గుండెలో మంట తగ్గుతాయి. ఒక కప్పు నీటిలోసోంపు గింజలు వేసి ఉడికించి రాత్రిపూట అలా ఉంచి ఉదయమే వడకట్టి ఆ నీటిలో తేనె కలిపి పరగడుపున తాగాలి. గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ వేసి ఉదయం పరగడుపున తీసుకుంటే అనుకున్న ఫలితం కనపడుతుంది. మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనం అయిన వెంటనే ఐదు లేదా పది నిముషాల పాటు నడవటం అలవాటు చేసుకుంటే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అలాగే ఎసిడిటీ తగ్గుతుంది. ఆహారంలో పీచుపదార్థం ఉండేలా చూసుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది. తద్వారా గుండె మంట, ఎసిడిటీ తగ్గుతుంది. ఎసిడిటీతో బాధపడేవారు ఒకేసారి కాకుండా నాలుగయిదుసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. పొట్టను ఖాళీగా ఉంచకూడదు. అలాగే వేపుడు కూరలు, మసాలాలకు దూరంగా ఉండాలి -
చెడు అలవాట్లు వదలించుకోండిలా..!
లండన్: పొరపాటుగా మీ జీవితంలోకి వచ్చిన చెడు అలవాట్ల నుంచి బయటపడటం మీకు సవాలుగా మారిందా! వాటివల్ల దుష్ప్రవర్తన అలవడిందా.. ఆ ప్రవర్తన నుంచి బయటపడేందుకు ఏమైనా పరిష్కారా మార్గాలుంటే బాగుండు అని అనుకుంటున్నారా.. అయితే లండన్ కు చెందిన హైపోధెరపిస్ట్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ ప్రాక్టీసనర్ జాస్మిన్ పిరన్ దురలవాట్లు మానుకునేందుకు కొన్ని చెప్పారు. అవి ⇒ సాధరణంగా ప్రవర్తనను మార్చుకోవాలని చూసుకునే వారు పుట్టిన రోజుకోసమో లేదా సోమవారం నుంచనో, లేక కొత్త సంవత్సరం రోజో అని నిర్ణయించుకుంటారు. ఎప్పుడంటే అప్పుడు మనసులో బలంగా భీష్మించుకొని మననం చేసుకోవాలి. ⇒ దురలవాటు అని మనకు మనం గుర్తించినప్పుడు అది పొగతాగడంలాంటిదైనా సరే.. పక్కవారి మాటలు వినకుండా మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. ⇒ మానడానికి కారణమైన పాజిటివ్ ఆలోచనలు జాబితాగా రాసుకోవాలి. వాటిని మననం చేసుకోవాలి ⇒ ముందు చాలా ఓపికగా ఉండి.. చిన్న స్థాయి మార్పు నుంచి భారీ స్థాయిలో మార్పు తెచ్చుకోవాలి. ఇందుకోసం రోజు ఆ సమయంలో సాధన చేయాలి ⇒ మనసులో పుట్టుకొచ్చే ఆ దురలవాటుకు చెందిన భావోద్వేగాలను ఒకసారి సునిశితంగా పరిశీలించాలి. ⇒ ప్రతి రోజూ వస్తున్న మార్పును గమనించాలి. ⇒ ఎంతో కొంత మార్పు వస్తుంటే ఎవరిని వారే ప్రోత్సాహించుకుంటూ రివార్డులు ఇచ్చుకోవాలి.