breaking news
Quarter-final match
-
ఆయుశ్ బదోనికి తొలి పిలుపు
న్యూఢిల్లీ: భారత్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి రెండు వన్డేలకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతుండటంతో సుందర్ తప్పుకోవాల్సి వచ్చింది. ‘తొలి వన్డేలో బౌలింగ్ చేసే సమయంలో సుందర్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. అతడికి పరీక్షలు నిర్వహించి గాయం తీవ్రతను బోర్డు వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని బీసీసీఐ ప్రకటించింది. కివీస్ ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో 27 పరుగులిచి్చన అనంతరం మైదానం నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సుందర్ మళ్లీ ఫీల్డింగ్ కోసం రాలేదు. అయితే ఛేదనలో భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్‌కు చివరి వరకు అండగా నిలిచాడు. సుందర్ స్థానంలో ఢిల్లీ ఆటగాడు ఆయుశ్ బదోనిని భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు సెలక్టర్లు ప్రకటించారు. బదోనికి టీమిండియాలో చోటు దక్కడం ఇదే మొదటి సారి. బుధవారం జరిగే రెండో వన్డే వేదిక రాజ్‌కోట్‌లో అతను భారత బృందంతో చేరతాడు. టీమిండియాకు ఆయుశ్ ఎంపిక కావడం విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ టీమ్‌ను బలహీనంగా మార్చింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భతో ఢిల్లీ ఆడనుండగా ...ఈ మ్యాచ్‌కు బదోని దూరమయ్యాడు. ఐపీఎల్‌తో గుర్తింపు... 26 ఏళ్ల బదోని ప్రధానంగా మిడిలార్డర్ బ్యాటర్. అయితే ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున అతనికి మంచి గుర్తింపు లభించింది. దేశవాళీ క్రికెట్లో అతను ఢిల్లీకి కెపె్టన్‌గా కూడా వ్యవహరించాడు. గత 12 ఏళ్లుగా బదోని బౌలింగ్‌లో ఎంతో మెరుగయ్యాడని ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ వెల్లడించాడు. కెరీర్లో 27 లిస్ట్–ఎ మ్యాచ్‌లలో అతను 36.47 సగటుతో 693 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 29.72 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో లక్నో తరఫున ఆడిన 4 సీజన్లలో కలిపి 56 మ్యాచ్‌లలో 138.56 స్ట్రయిక్ రేట్‌తో 963 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీశాడు. -
సెమీస్‌లో బెంగాల్, ఒడిశా
విజయ్ హజారే ట్రోఫీ రాజ్‌కోట్: దేశవాళీ వన్డే టోర్నీ (విజయ్ హజారే ట్రోఫీ)లో బెంగాల్, ఒడిశా జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో బెంగాల్ 17 పరుగుల తేడాతో విదర్భను... ఒడిషా పరుగు తేడాతో గోవాను ఓడించాయి. విదర్భతో జరిగిన తొలి క్వార్టర్స్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. మనోజ్ తివారి (101 బంతుల్లో 130; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, శ్రీవత్స్ గోస్వామి (84) రాణించాడు. అనంతరం విదర్భ 50 ఓవర్లలో 8 వికెట్లకు 301 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫైజ్ ఫజల్ (111 బంతుల్లో 105; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బద్రీనాథ్ (94 బంతుల్లో 100; 13 ఫోర్లు) శతకాలు చేసినా లాభం లేకపోయింది. మరో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా 49.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. అనురాగ్ సారంగి (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 1 సిక్స్), బిప్లబ్ సమంత్రే (73 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. ఆ తర్వాత గోవా 50 ఓవర్లలో 9 వికెట్లకు 288 పరుగులు చేసింది. అమోఘ్ దేశాయ్ (139 బంతుల్లో 110; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా, షగున్ కామత్ (92 నాటౌట్) ఆ అవకాశం కోల్పోయాడు.


