ఎన్టీపీసీకి క్వాలిటీ సర్కిల్ అవార్డు
జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీకి హైదరాబాద్ చాప్టర్ క్వాలిటీ సర్కిల్ అవార్డు లభించింది. గురువారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 30వ చాప్టర్ లెవల్ క్వాలిటీ సర్కిల్ సదస్సును నిర్వహించారు. సదస్సులో ఎన్టీపీసీ రామగుండం జట్లు ప్రతిభ కనపర్చడంతో అవార్డు సొంతంమైంది. హైదరాబాద్ బేగంపేట మేరీ గోల్డ్‌లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా చైర్మన్ బాలకృష్ణారావుల చేతుల మీదుగా జనరల్ మేనేజర్ ఎస్.ఆర్. భావరాజు అవార్డు అందుకున్నారు.