breaking news
pv narasimharao district
-
Huzurabad: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా..
భీమదేవరపల్లి: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో హుజురాబాద్ కేంద్రంగా పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని హుజురాబాద్ జిల్లా సాధన సమితి పేరిట ఉద్యమాలు జరిగాయి. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో.. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్‌పై ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే స్థానిక ప్రజలను టీఆర్ఎస్కు మరింత అనుకూలంగా మలుచుకోవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కేంద్రాలు రెండు ఒకే చోట ఉండటంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదన్న వాదన సైతం ఉంది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లా స్థానంలో హుజురాబాద్‌ను ప్రకటించే అవకాశాలు సైతం లేకపోలేదని తెలుస్తోంది. వంగరలోని పీవీ విగ్రహం పట్టించుకోని నాయకులు పీవీ మరణానంతరం సొంత పార్టీ నాయకులే ఆయనను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అయితే దక్షాణాది రాష్ట్రాల నుంచి అత్యున్నతమైన ప్రధాని పీఠాన్ని అధిష్టించిన పీవీపై టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో పాటుగా రూ.11కోట్ల వ్యయంతో పీవీ స్వగ్రామమైన వంగరలో పీవీ స్మృతివనం, భీమదేవరపల్లి కస్తూరీబాగాంధీ పాఠాశాల నుంచి వంగర వరకు డబుల్ బీటీ రోడ్డు, ఆర్చీ తదితర పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది. ఈనెల 28న పీవీ శతజయంతి నేపథ్యంలో వంగరలోని పోలీస్‌స్టేషన్ ఎదుట పీవీ స్మృతివనం పనులు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే పీవీ నివాస గృహాన్ని వారి కుటుంబ సభ్యులు ఆధునీకరించడంతో పాటుగా పీవీ ఉపయోగించిన వస్తువులను హైదరాబాద్ నుంచి వంగరకు తరలించి భద్రపరిచారు. వాటిని పీవీ ఇంట్లో ఏర్పాటు కానున్న మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. 12 మండలాలతో నూతన జిల్లా.. కాగా హుజురాబాద్ జిల్లా ఏర్పాటుకు 12 మండలాలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పీవీ గ్రామమైన వంగరకు 8 కిలోమీటర్ల దూరంలోని హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించి అందులోకి వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలు, కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శం కరపట్నం, సైదాపూర్, చిగురుమామిడితో పాటుగా భీమదేవరపల్లి మండల పరిధిలోని పీవీ స్వగ్రామం వంగర, వీరభద్రస్వామి దేవస్థానం కల్గిన కొత్తకొండను మండలాలుగా ఏర్పాటు చేసి మొత్తం 12 మండలాలతో నూతన జిల్లా ఏర్పాటు కు అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. వంగరలోని పీవీ ఇల్లు శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించే అవకాశం ఈనెల 28న జరగనున్న పీవీ శతజయంతి ఉత్సవాల్లో హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఈటలకు చెక్ పెట్టడంతో పాటుగా ఈ ప్రాంత ప్రజలను టీఆర్ఎస్ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతం కావచ్చనే అభిప్రాయం ఆ పార్టీలో నెలకొంది. అయితే ఇప్పటికే పీవీ కూతురు సురభి వాణీదేవీకి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించిన విషయం తెలిసిందే. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలకు వంగరకు సీఎం కేసీఆర్ హాజరై జిల్లా ప్రకటనతో పాటుగా ఈ ప్రాంత అభివృద్ధిపై వరాల జల్లు కురిపించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు, రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. దీక్షకు సిద్ధమవుతున్న గ్రామస్తులు అయితే పీవీ పేరిట జిల్లా ఏర్పాటుతో పాటుగా వంగరను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కండె రమేశ్, కండె చక్రపాణి, కండె సుధాకర్ తదితరులు దీక్షకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు కొత్తకొండను మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చెప్యాల ప్రకాశ్, ఉప్పుల కుమారస్వామి, సిద్దమల్ల కృష్ణ తదితరులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. చదవండి: Huzurabad: ఉప ఎన్నికపై గులాబీ వ్యూహం -
తెరపైకి పీవీ జిల్లా
హుజూరాబాద్ , హుస్నాబాద్ నియోజకవర్గాలు కలిపి పీవీ జిల్లా చేయాలని డిమాండ్ 14 మండలాలతో జిల్లా ప్రతిపాదనలు సిద్ధం చేసిన నాయకులు మంత్రి ఈటల రాజేందర్ సానుకూల స్పందన నేడు హైపవర్ కమిటీకి నివేదించనున్న నాయకులు 7న కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనకు ఆమోదముద్ర 8 లేదా 9న తుది నోటిఫికేషన్ విడుదల సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనూహ్య మలుపులు తిరుగుతోంది. తెరపైకి కొత్తగా 5వ జిల్లా ప్రతిపాదన వచ్చింది. హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలను కలిపి స్వర్గీయ పీవీ.నరసింహారావు జిల్లాగా ప్రకటించాలని ఈ రెండు నియోజకవర్గాల్లోని అధికారపార్టీ సహా అఖిలపక్ష నాయకులు ఏకమై ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫోన్ ద్వారా ప్రతిపాదనను వివరించారు. దీనికి మంత్రి సమ్మతించినట్లు హుస్నాబాద్ పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. మంత్రి సూచన మేరకు అఖిలపక్ష నేతలంతా గురువారం హైదరాబాద్ వెళ్లి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీని కలిసి పీవీ జిల్లా ఏర్పాటు ఆవశ్యకత, ప్రజల మనోభావాలు, సాధ్యాసాధ్యాలను వివరించనున్నారు. ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. 14మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని రెండు నియోజకవర్గాలకు చెందిన అఖిలపక్ష నేతలు ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆరు, హుజూరాబాద్‌లో నాలుగు మండలాలున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా కొత్తగా ఇల్లందకుంట, హుస్నాబాద్ రూరల్ మండలాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో కలిపితే 12 మండలాలు అవుతున్నాయి. హుజూరాబాద్‌కు సమీపంలోనే ఉన్న శంకరపట్నం మండలాన్ని పీవీ జిల్లాలో కలపాలని ప్రతిపాదిస్తున్నారు. అట్లాగే జమ్మికుంట మండలంలోని వావిలాలను కొత్త మండలం చేస్తే బాగుంటుందని ఇప్పటికే అధికారులు ప్రతిపాదించారు. తద్వారా మొత్తం 14 మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని రెండు నియోజకవర్గాల అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుత జనాభా దాదాపు ఆరు లక్షలు. ప్రస్తుతం కొత్తగా ప్రతిపాదించిన సిరిసిల్ల జిల్లానూ తొమ్మిది పాత, ఐదు కొత్త మండలాలతోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లా జనాభా 5.48 లక్షలు మాత్రమే. ఈ నేపథ్యంలో ఆరు లక్షల జనాభా, 14 మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయడం న్యాయబద్ధమని చెబుతున్నారు. మరోవైపు హుజూరాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించేందుకు అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయపడుతున్నారు. హుజురాబాద్‌ను జిల్లా చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని, కేవలం అధికారులను నియమిస్తే సరిపోతుందని చెబుతున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్కుమార్తోనూ అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. వారి సూచన మేరకు ఇదే అంశంపై హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవ ర్గాల అఖిలపక్ష నాయకులంతా కలిసి గురువారం హైదరాబాద్ వెళ్లి హైపవర్ కమిటీని కలిసి పీవీ జిల్లా ప్రతిపాదనను ఆమోదించాలని కోరనున్నారు. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఆందోళనలను ఉధృతం చేస్తున్న నాయకులంతా తాజా ప్రతిపాదనపట్ల సుముఖత వ్యక్తం చేస్తున్నారు. నేడు హైపవర్ కమిటీ వద్దకు.. బుధవారం హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, జేఏసీ కన్వీనర్ కొయ్యడ కొమురయ్య, సింగిల్‌విండో డెరైక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, అఖిలపక్ష నాయకులు కోమటి సత్యనారాయణ, పచ్చిమట్ల రవీందర్, మ్యాక రమేష్, చిట్టి గోపాల్‌రెడ్డి, వరయోగుల శ్రీనివాస్, హన్మిరెడ్డి, అక్కు శ్రీనివాస్, మాడిశెట్టి శ్రీధర్, తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పీవీ జిల్లా ఏర్పాటు చేయూలని కోరుతూ గురువారం హైపవర్ కమిటీని కలవనున్నట్లు తెలిపారు. మరోవైపు హుజూరాబాద్‌లో పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వంద వాహనాలతో హైదరాబాద్‌కు వెళ్లి హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని, అందుకు గల అంశాలతో కూడిన నివేధికను హైపవర్ కమిటీకి అందజేయూలని నిర్ణయించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ప్రకటించాలంటూ కమలాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. హుజూరాబాద్‌ను వెంటనే జిల్లాగా ప్రకటించాలని జమ్మికుంట నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురువారం జమ్మికుంటలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టుతున్నట్లు ప్రకటించారు. సీఎం వ్యాఖ్యల స్ఫూర్తితోనే... ‘ప్రజాభీష్టం మేరకు ఎన్ని జిల్లాలనైనా చేసుకోవచ్చు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గ నేతల్లో పీవీ జిల్లా ఆశలు సజీవంగా మారాయి. అదే సమయంలో సిరిసిల్లను జిల్లాగా ప్రకటించడంతోపాటు అంతకంటే ఎక్కువ జనాభా, మండలాలున్న ఈ రెండు నియోజకవర్గాలను కలిపి పీవీ నరసింహారావు పేరుతో జిల్లాగా ప్రకటించడం న్యాయబద్ధమని చెబుతున్నారు. పీవీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి ఈటల రాజేందర్ సానుకూలంగా ఉన్నారని కూడా రెండు నియోజకవర్గాల అఖిలపక్ష నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల స్ఫూర్తి, మంత్రి ఈటల సానుకూలతల దృష్ట్యా తమ డిమాండ్ నెరవేరే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. 7న హైపవర్ కమిటీ నివేదిక జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ప్రతిపాదనలు ఇంకా వస్తూనే ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీ వీటిని పరిశీలించి ఈనెల 7న ఉదయం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి ఆమోదించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 7న మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. కేబినెట్ ఆమోదముద్ర అనంతరం 8 లేదా 9న కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. కేబినెట్ భేటీ తరువాత కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై స్పష్టత వస్తుందని, అప్పటివరకు మార్పులు, చేర్పులు కొనసాగుతూనే ఉంటాయని జిల్లా అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కేకే ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీ తన నివేదికలో ప్రస్తావిస్తుందా? లేదా? అనే అంశం శుక్రవారం తేలనుంది. 13 మండలాలతోనే సిరిసిల్ల సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లోని తొమ్మిది పాత మండలాలతోపాటు ఐదు కొత్త మండలాలు వెరసి మొత్తం 14 మండలాలతో సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసేందుకు తొలుత ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా హైపవర్ కమిటీకి జిల్లా అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనల్లో 13 మండలాలతోనే సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చే స్తున్నట్లు పేర్కొన్నారు. వీటిలో పొత్తూరు మండలం ప్రతిపాదన లేదు. అదే సమయంలో ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో కలుపుతున్నట్లు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా 13 మండలాలు, 5,46,121 జనాభాతోనే ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. తలలు పట్టుకుంటున్న అధికారులు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన జిల్లా అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. గంట గంటకు ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు చేయాల్సి రావడం తో తలలు పట్టుకుంటున్నారు. తొలుత సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ మేరకు ఉద్యోగుల కేటాయింపు, ఫైళ్ల విభజన ప్రక్రియను పూర్తి చేశారు. తరువా త సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని ప్రభుత్వం ప్రకటించి అనూహ్యంగా పెద్దపల్లి జి ల్లాను తెరపైకి తీసుకురావడంతో ప్రతిపాదనల్లో మార్పులు చేశారు. తాజాగా సిరిసిల్ల జిల్లాను జాబితాలో చేర్చడంతో మళ్లీ నాలు గు జిల్లాల ప్రతిపాదనలతోపాటు ఉద్యోగుల కేటాయింపు, ఫైళ్ల విభజ నకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో కొత్త మండలాలు చేయాలని కోరడం, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తుండటంతో ఇదేం బాధరా... అంటూ తలలు పట్టుకుంటున్నారు. తా జాగా 5వ జిల్లా ఏర్పాటు డిమాండ్ తెరపైకి రావడంతో ఉన్నతాధికారుల నుంచి ఏ నిమిషంలో ఏ ఆదేశాలు వస్తాయో... మళ్లీ ఏ మార్పులు, చేర్పులు చేయాలో అని చర్చించుకుంటున్నారు. 31 జిల్లాలే ఫైనల్.. ముసాయిదాలో ప్రకటించిన 17 జిల్లాలతోపాటు హైపవర్ కమిటీ పరిశీలనలో ఉన్న సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్, జనగామ జిల్లాలు మినహా మరే కొత్త జిల్లాల ప్రతిపాదనలను పరిశీలించరాదని ప్రభుత్వం నిర్ణరుుంచినట్లు బుధవారం రాత్రి సీఎంవో ప్రకటించింది. దీంతో పీవీ జిల్లా అంశాన్ని కమిటీ పరిశీలిస్తుందా? లేదా? అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.