breaking news
puskara funds
-
పుష్కర నిధులు బొక్కేస్తున్నారు..
అనుమతి లేని ఘాట్‌కు నిధుల కేటాయింపు ఏర్పాట్లు చేయని ఘాట్‌కు కౌన్సిల్ ఆమోదం మచిలీపట్నం (ఈడేపల్లి): కృష్ణా పుష్కరాల సందర్భంగా పట్టణంలో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిధుల కేటాయించేందుకు మునిసిపాలిటీ నిధులు కేటాయించింది. పుష్కరాల ఏర్పాట్లుకు గాను మున్సిపాలిటీ పరిధిలో రూ.1.60 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని నాలుగో అంశం నుంచి 21 వరకు ఉన్న అంశాలను ప్రతిపక్ష అభ్యంత రాలు లెక్కచేయకుండా ఆమోదించారు. స్థానిక బందరుకోటలోని ఘాట్ ఏర్పాటు చేయలేదు. అయినా అక్కడ కాలువ గట్లు, పలు అభివృద్ధి పనులు చేశామని రూ.4.88 లక్షలకు ఆమోదం పొందారు. అయితే ఆ ఘాట్ విషయం బయటికి రాకుండా, నాగులేరు ఘాట్‌ను కలిపి చాకచక్యంగా వ్యవహరించారు. నాగులేరు ఘాట్‌వద్ద వాహనాల పార్కింగ్‌కు, భక్తుల విశ్రాంతి నిమిత్తం తాత్కాలిక షెడ్లు ఏర్పాట్లు చేయకుండానే చేసినట్లు రూ.23.25 లక్షలకు లెక్కలు చూపించి ఆమోదం పొందారు. పుష్కరాల ప్రారంభానికి ముందురోజు కాలువలో నీరు లేకపోవడంతో ట్రాక్టర్ ట్యాంకర్లతో నీటిని పోశారు. అందుకు గాను రూ.7.85 లక్షలు స్వాహా చేశారు. అయితే వాస్తవానికి ట్యాంకర్లతో నీరు తరలించడం మొదలు పెట్టగానే పట్టణ ప్రజలు, సామాజిక మాధ్యమాల్లో దుమ్మేత్తి పోశారు. దీంతో వంద ట్యాంకర్ల నీటిని పోసి నిలుపుదల చేశారు. పట్టణంలోని ముడు స్థంభాల సెంటరు, హౌసింగ్ బోర్డు, కోతిబొమ్మ సెంటరు, పరాసుపేట, గాంధీ విగ్రహం ప్రాంతాల్లో విద్యుత్ కాంతులకు రూ.42 లక్షలు ఖర్చు చేసినట్లు కౌన్సిల్లో ఆమోదం తెలిపారు. వీటికి సంభంధించిన కేబుళుల, పలు రకాల పరికరాలకు మరో రూ.79 లక్షలను కేటాయించాలని తీర్మానాన్ని కూడా పెట్టారు. పుష్కరాల నిమిత్తం కొట్లాది రూపాలయను నిధులను విడుదల చేసినప్పటికీ నాగులేరు ఘాట్ వద్ద జలుస్నానాలకు కేవలం వెయ్యి నుంచి 1200 మంది మాత్రమే పుష్కర స్నానాలు చేశారు. కానీ పుష్కరాలు ముగిసిన తర్వాత కోట్లాధి రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపి, అమోదాలను తెలపడం కొసమెరుపుగా మిగిలింది. పనులు పరిశీలించి బిల్లులు చెల్లిస్తాం .. జస్వంతరావు, మునిసిపల్ కమిషనర్ పుష్కరాల నిమిత్తం పట్టణంలో చేపట్టిన కార్యక్రమాలకు మునిసిపల్ కౌన్సిల్లో నిధులు విడుదల చేయాలని తీర్మానం చేసింది. కాని చేపట్టిన పనులను కొలతలు, అంచనాలు వేసి అనంతరం వారికి ఎంతెంత చెల్లించాలో ఆమేరకే చెల్లిస్తాం. తీర్మానం చేసినప్పటికీ నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయం. -
పుష్కర నిధులొచ్చాయ్..!
తొలి విడత రూ.77 కోట్లు మంజూరు విజయవాడ సెంట్రల్ : నగర పాలక సంస్థకు ఎట్టకేలకు ప్రభుత్వం పుష్కర నిధులను విడుదల చేసింది. కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తొలి విడతగా రూ.77 కోట్లను బుధవారం విడుదల చేసింది. పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, భోజన కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాల్సిందిగా కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మా సంగతేంటి పారిశుద్ధ్యం, ఫుడ్ కాంట్రాక్టర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మా సంగతేంటని సివిల్ వర్క్స్ చేసిన కాంట్రాకర్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.97 కోట్లతో 55 రోడ్లు విస్తరణ చేశారు. అధికార పార్టీ అండదండలతో మొత్తం తొమ్మిది మంది కాంట్రాక్టర్లు ఎక్సెస్ టెండర్లు వేశారు. నిధులు మంజూరైన నేపథ్యంలో వాటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.