breaking news
pure air
-
గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు
చంఢీగడ్: ప్రజలు స్వచమైన గాలిని పీల్చాలని ఊరంతా మొక్కలు నాటిన ఓ వ్యక్తి.. చివరికి అదే గాలి అందక మరణించాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ధోబ్లాన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ధోబ్లాన్‌కు చెందిన 67 ఏళ్ల హర్దయాళ్ సింగ్ ప్రతిరోజూ ఉదయం తన సైకిల్‌పై మొక్కలతో తన ఇంటి నుంచి బయలుదేరి, గ్రామ సరిహద్దులో మొక్కలు నాటుతుండే వాడు. ఆయన తన గ్రామస్తులకు స్వచ్ఛమైన గాలి అందించాలనే లక్ష్యంతో ఈ పనిని పూనుకున్నాడు. కాగా ఈ క్రమంలో సుమారు 10 వేల మొక్కలు పైగా నాటాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రాగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని సింగ్ భార్య గ్రామస్తులకు తెలిపింది. కాగా మే 18న గ్రామస్తులు సింగ్‌కు వైద్యం అందించాలని ఆస్పత్రిలో బెడ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా 28 గంటల వరకు వారికి బెడ్ దొరకలేదు. చివరకు మే 19న చండీఘర్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే, అప్పటికే చాలా ఆలస్యం అయినందున మే 25 న సింగ్ మరణించాడు. ఎంతోమందికి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని పరితపించిన సింగ్‌కు అదే గాలి అందక మరణించడం బాధాకరమని గ్రామస్తులు అంటున్నారు. చదవండి: ‘అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లనే అత్యాచారాలు’ -
90% చెడు గాలే..: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా 90% ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుబాటులో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రతీ 10 మందిలో 9 మంది కాలుష్యపూరిత వాయువులనే పీలుస్తున్నారని, గ్రామాల్లోన సమస్య తీవ్రంగానే ఉందని తెలిపింది. వాయు కాలుష్య బాధితులు ప్రధానంగా పేద దేశాల ప్రజలేనంది. వాయు కాలుష్యం వల్ల ఏటా 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగాఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో భారత్‌లో అధిక మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.