breaking news
Purchase land
-
నోట్ల రద్దు వేళ శశికళ ఆస్తులు పైపైకి
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆదాయపన్ను శాఖ (ఐటీ) విచారణలో తేలింది. ఆ సమయంలో ఆమె మాల్స్, భవనాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో కొన్ని ఆస్తులు చేతులు మారినట్లు కనుగొన్నారు. మద్రాసు హైకోర్టులో శశికళ ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన ఓ పిటిషన్‌పై స్టే విధించాలని శశికళ రిట్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖను కోర్టు ఆదేశించింది. శనివారం న్యాయమూర్తి అనితా సుధాకర్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. శశికళ ఆదాయ, ఆస్తుల వ్యవహారం ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు దానిపై విచారణ అవసరం లేదని శశికళ తరఫు లాయర్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో శశికళ చెన్నై పెరంబూరు, మదురై, కేకే నగర్లలో షాపింగ్ మాల్స్ పుదుచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూరులో పేపర్ మిల్, చెన్నై ఒరగడంలో చక్కెర మిల్లు, పాత మహాబలిపురం రోడ్డులో సాఫ్ట్వేర్ కంపెనీ, కోయంబత్తూరులో 50 పవన విద్యుత్ ప్లాంట్లు కొనుగోలు చేసినట్టు ఐటీ తరఫు న్యాయవాది ఆధారాలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఆస్తులన్నీ నగదు ద్వారానే జరిగినట్టు చెప్పారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి త్వరితగతిన అన్ని ప్రక్రియలు ముగించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు. -
విశాఖ శివారు భూముల్లో... సర్కారీ దోపిడీ
విశాఖ నగర శివారులో ఓ మంత్రి భారీ భూ కుంభకోణం రూ.600 కోట్లు కొట్టేసేందుకు వ్యూహం ఏడాది క్రితం చౌకగా పేదల అసైన్డ్ భూముల కొనుగోలు అడ్వాన్సులు చెల్లించి అగ్రిమెంట్లుతో పట్టాలు స్వాధీనం రైతులతో ఖాళీ పేపర్లపై సంతకాల సేకరణ ఆనక ల్యాండ్ పూలింగ్ జీవో జారీ చేయించిన వైనం అగ్రిమెంట్దారులు భూములు ఇవ్వొచ్చని జీవోలో మెలిక ఈ జీవో విడుదల వెనుక ‘ముఖ్య’ నేత హస్తం రైతులకు తెలియకుండానే వుడాకు అంగీకార పత్రాలు.. వుడా.. రైతుకిచ్చే వాటా ఎకరానికి 1210 గజాలు ఆ వాటా మార్కెట్ రేటు రూ.1.80 కోట్ల పైమాటే మంత్రి దళారుల ద్వారా రైతులకు దక్కేది రూ.12 లక్షలే సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పేద రైతులకు మాయ మాటలు చెప్పి వారి అసైన్డ్ భూముల ద్వారా వందల కోట్లు కొట్టేయడానికి ఓ మంత్రి బరితెగించారు. కారు చౌకగా తన బినామీల ద్వారా ఆ భూములు కొనుగోలు చేసి.. వాటిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి రూ.600 కోట్లు కొట్టేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో శివారు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించాలన్న ఆలోచనను ఆ మంత్రి తనకు అనుకూలంగా మలుచుకుని వ్యూహ రచన చేశారు. బక్క రైతులను బలి పశువులను చేస్తూ కొంత సొమ్ము అడ్వాన్సుగా ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకున్నారు. ఆ తర్వాత గత ఏడాది నవంబర్ 14న ల్యాండ్ పూలింగ్ జీవో (జీవోఎంఎస్ నం 290) జారీ చేయించారు. ప్రస్తుత భూ యజమానులు సైతం భూములు ఇవ్వొచ్చని అందులో వారికి అనుకూలంగా మెలిక పెట్టించారు. సాక్షాత్తు సచివాలయం నుంచే ఈ జీవో జారీ కావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం కూడా ఉందని స్పష్టమవుతోంది. అసైన్డ్ భూములను ఇతరులు అనుభవించడమే తప్పు. పైగా వాటి క్రయ విక్రయాలు చెల్లవు. అలాంటిది ఏకంగా 358 ఎకరాలను కొనుగోలు చేశారంటే ప్రభుత్వ పెద్దలతో ముందే మాట్లాడుకుని కథ నడిపించారనేది స్పష్టమవుతోంది. విశాఖలో వుడా ల్యాండ్ పూలింగ్ పథకం అమలు ఊసెత్తకముందే జిల్లాకు చెందిన ఓ మంత్రి ముందస్తు వ్యూహరచన చేశారు. పక్కా పథకం ప్రకారం.. ఎక్కడెక్కడ వుడా భూములు సేకరిస్తుందో అక్కడ ఏడాది క్రితమే తన బినామీలు, అనుచరులతో పాగా వేయించారు. ప్రధానంగా నగర శివారులోని భీమిలి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, (అసైన్డ్)డీ పట్టా భూములను ముందుగానే గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లోని డీ పట్టా భూములు ఎకరాకు రూ.12 లక్షల వరకు, ఆక్రమణలో ఉన్న భూములు ఎకరాకు రూ.3 లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్నారు. ఆ మేరకు రైతులకు అడ్వాన్సుగా రూ.2 లక్షలు చొప్పున చెల్లించి క్రయ పత్రాలు (అగ్రిమెంట్) రాయించుకున్నారు. వాటితో పాటు ఖాళీ పేపర్ల పై సంతకాలు తీసుకుని వాటన్నింటినీ తమ వద్దనే ఉంచుకున్నారు. ఇదంతా పూర్తి అయ్యాక సదరు మంత్రి ముఖ్యమంత్రి అండతో ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం చేయించారు. ప్రతిపాదిత గ్రామాలనే మార్చేసిన మంత్రి వుడా మొదట శొంఠ్యాంలో 14 ఎకరాలు, కొత్తవలసలో 45 ఎకరాలు, మామిడిలోవలో 19, నేరేళ్లవలసలో 28, రామవరంలో 59, గంగసాని ఆగ్రహారంలో 78, గోరింటలో 24, కాపులుప్పాడలో 18, పైడివాడలో 135, పైడివాడ అగ్రహారంలో 35, ముదపాకలో 315, బయ్యవరంలో 210, గండిగుండంలో 69, గిడిజాలలో 35 ఎకరాల సేకరణకు ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ జాబితాలో తమకు అనుకూలమైన గ్రామాలు లేకపోవడంతో మంత్రి రంగంలోకి దిగి సౌభాగ్యరాయపురం (పెందుర్తి మండలం), దబ్బంద, గండిగుండం (ఆనందపురం మండలం), కొమ్మాది (విశాఖపట్నం రూరల్), నేరేళ్లవలస (భీమునిపట్నం మండలం) గ్రామాలను అదనంగా చేర్పించారు. భూ సమీకరణ కోసం వుడా ఎంపిక చేసిన భూములు ► తొలి విడతగా సౌభాగ్యరాయపురంలో 116/1, 121/1,2, 123/2, 124/1,2, 125/1,2, 99 సర్వే నెంబర్లలోని 60.94 ఎకరాల అసైన్డ్ భూమి, 68 ఎకరాల ప్రభుత్వ భూమి. ► దబ్బందలో సర్వే నంబర్లు 14/1, 19/2,20, 24/1 నుంచి 4 వరకు, 140/3 నుంచి 6 వరకు, 141/1 నుంచి 8 వరకు, 143/1 నుంచి 4 వరకు, 144/1 నుంచి 4 వరకు, 145/2 నుంచి 10 వరకు, 146/1 నుంచి 7,9,10 వరకు, 147/1 నుంచి 4 వరకు, 148/1 నుంచి 14 వరకు గల సర్వే నంబర్లలోని 25.88 ఎకరాల జిరాయితీ భూములు, 65.35 ఎకరాల అసైన్డ్ భూములు, 23 ఎకరాల ప్రభుత్వ భూములు. ► కొమ్మాదిలో సర్వే నంబర్లు 38, 42, 28/2, 39/2, 40/1 నుంచి 3 వరకు, 53/1ఎ,2,3,4ఎ,5,6ఎ,7, 54/1ఎ,2ఎ, 3ఎ,4ఎ,5ఎ,6, 161/1,2, 162/1,2, 163/1నుంచి 3 వరకు, 40/1బి, 136, 40/1సి, 151/2,4, 152/1,2, 153/1 లలో 39.80 ఎకరాల జిరాయితీ, 48.84 ఎకరాల డీ పట్టా భూములు, 28 ఎకరాల ప్రభుత్వ భూమి. ► రెండో విడతలో భీమునిపట్నం మండలం నేరేళ్లవలసలో సర్వే నంబరు 49/1పిలో 114.34 ఎకరాల అసైన్డ్ భూమి. ► ఆనందపురం మండలం గండిగుండంలో సర్వే నంబర్లు 16/2 నుంచి 25/6, 36/1 నుంచి 4 వరకు గల 69 ఎకరాల అసైన్డ్ భూమి. ► మొత్తంగా రెండు విడతల్లో 543.15 ఎకరాలను సేకరిస్తున్నట్టు వుడా ప్రకటించింది. అందులో మొదటి విడతలో 175.13 ఎకరాల అసైన్డ్ భూములు, రెండో విడతలో 183.34 ఎకరాల అసైన్డ్ భూములు కలిపి మ్తొతం 358.47ఎకరాలు సేకరించేందుకు రంగం సిద్ధమైంది. జిరాయితీ, ప్రభుత్వ భూములను పక్కనపెట్టి మంత్రి ముందుగా అసైన్డ్ భూములను సొమ్ము చేసుకునేందుకే పావులు కదిపారు. మంత్రి వ్యూహం సక్సెస్ ల్యాండ్ ప్యూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్లాట్లు ఇస్తామని వుడా ప్రకటించడంతో మంత్రి ముందస్తు పథకం విజయవంతమైంది. భూములు అందించిన రైతులకు వాటా కింద జిరాయితీ అయితే ఎకరాకు 1410 చదరపు గజాలు, అసైన్డ్, మాజీ సైనికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందించిన భూములైతే ఎకరాకు 1210 చదరపు గజాల చొప్పున ఇస్తామని వుడా స్పష్టం చేసింది. రైతుల ఆక్రమణలో ఉండి, అభ్యంతరం లేని ప్రభుత్వ భూములకైతే 500 గజాలు, అభ్యంతరం ఉన్న భూములకైతే 250 గజాలు చొప్పున అందిస్తామంది. కాగా, బినామీలతో రైతుల నుంచి మంత్రి క్రయ ఒప్పందాలు చేసుకున్న అసైన్డ్ భూమి 358.47 ఎకరాల వరకు ఉంది. ల్యాండ్ ప్యూలింగ్‌కు ప్రతిపాదించిన ఈ భూముల్లో చదరపు గజం ధర కనీసం రూ.15 వేల వరకు ఉంది. ఈ లెక్కన రైతుల నుంచి మంత్రి ఓ ఎకరాకు తీసుకునే 1210 చదరపు గజాల స్థలం విలువ రూ.1.80 కోట్లు. మొత్తం 358 ఎకరాలకు లెక్క వేస్తే రూ.600 కోట్లపైనే ఉంటుంది. కానీ రైతులకు ఏడాది క్రితం చెల్లించిన మొత్తం విలువ రూ.40 కోట్లకు మించదు. అంటే ఏడాది క్రితం సుమారు రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టి రైతులను నిలువునా ముంచేసి భీమిలి నియోజకవర్గ టీడీపీ నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రి, ప్రభుత్వ పెద్ద.. సంపాదించిన మొత్తం సొమ్ము సుమారు రూ.600 కోట్లన్న మాట. రైతులకు తెలియకుండానే వుడాకు అంగీకార పత్రాలు? కాగా, రైతుల వద్ద ముందుగానే సంతకాలు చేయించి తీసుకున్న ఖాళీ పేపర్ల పై ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ విన్నపాలను తయారు చేసి బినామీలే వుడాకు సమర్పించారు. అధికారులు అందుకు అంగీకరించి భూ సేకరణకు సంబంధించిన సర్వే నంబర్లను బహిర్గత పరిచారు. వాస్తవానికి ప్రభుత్వం ఏవైనా అవసరాల కోసం భూములను సేకరించినప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో నేరుగా చర్చించి వారి అంగీకారంతో సేకరణ చేపట్టాలి. కానీ ఇక్కడ ఎటువంటి నిబంధనలు పాటించకుండా వుడా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగిస్తుండటం గమనార్హం. పైగా రైతులకు అడ్వాన్సులిచ్చి అగ్రిమెంట్లు రాయించుకోవడం ద్వారా మంత్రి బినామీలు ఆయా భూములు, ప్లాట్లకు యజమానులయ్యారు. తద్వారా ప్లాట్ యజమానులు కూడా భూములు ఇవ్వొచ్చని పేర్కొనడంతో ఎదురు లేకుండా పోయింది. అక్రమాలకు ఊతమిస్తున్న జీవో! వుడా ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 290 అక్రమాలకు తెరలేపే వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి డి–ఫారం పట్టా భూములు అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లవు. కానీ ఇక్కడ డీ–ఫారం పట్టా భూముల వ్యవహారంలో కొనుగోలుదార్లకు వీలుకల్పిస్తు జీవోలో వెసులుబాటు కల్పించింది. ల్యాండ్ అలాట్ అయిన 30 రోజుల లోపు డి–ఫారం పట్టా భూమి యజమాని సంబంధిత అథారిటీ ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్‌ను (ఫారం 11లో) ఇవ్వాలి. అలా ఫారం–11లో పేర్కొన్న వ్యక్తి ఓనర్‌షిప్‌కు అర్హుడవుతాడు. ఆ ఓనర్షిప్ వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ ఆ వ్యక్తి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేస్తుంది.’ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా మంత్రి కోసం ప్రభుత్వం ఇలాంటి జీవోను జారీ చేయడం, అందులో అక్రమంగా డి–ఫారం పట్టా భూములకు హక్కు పొందేలా వెసులుబాటు కల్పించడం విశేషం. -
సీబీఐ విచారణకు సిద్ధం కండి... అవినీతిని నిరూపిస్తాం
సాగునీటి ప్రాజెక్టులో రాయలసీమకు అన్యాయం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీఅనంత వెంకట్రామిరెడ్డి కుందుర్పి : అమరావతిలో భూముల కొనుగోలులో అక్రమాలు.. ఇ సుక ఇతరత్రా దోపిడీలను నిరూపించేం దుకు సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే టీడీపీ నేతలు సీబీఐ విచారణకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. కుందుర్పి తహశీల్దార్ కా ర్యాలయం వద్ద సోమవారం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానా లపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మండల క న్వీనర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మా జీ ఎంపీ అనంత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, సీఎం చంద్రబాబు వరకు టీడీపీ నేతలు సీబీఐ విచారణకు ముందుకు వస్తే అవి నీ తిని నిరూపిస్తామన్నారు. భూములు కొంటే తప్పేముందని సీ ఎం చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తా రు. సాగునీటి ప్రాజెక్టులలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు. హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్టులకు అంచనా లు పెంచారు తప్ప.. నిధులు ఇవ్వలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం పచ్చ చొక్కాలకే పథకాలు మంజూరు చేస్తోందని విమర్శించారు. రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులు పచ్చ చొ క్కాలు వేసుకున్న కార్యకర్తల్లా పని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడి తరమికొట్టక తప్పదని అధికారులు, టీడీపీ నేతలను ఆయన హెచ్చరించారు. ఇసుక ఉచితం పేరుతో టీ డీపీ నాయకులు బహిరంగంగా దోపిడీ చేయడానికి సీఎం చంద్రబాబు లెసైన్సులు ఇచ్చేశారని విమర్శించారు. రూ.86 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా రూ.24 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు సీఎం చె ప్పారన్నారు. జిల్లాకు రూ.2 వేల కోట్ల రుణమాఫీ చే యా ల్సి ఉండగా మొదటి విడతలో రూ.700 కోట్లు విడుదల చేసి అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు మాటలు న మ్మి మోసపోయిన రైతన్నలు బ్యాంకు రుణాలకు వడ్డీ పె రిగి జిల్లా వ్యాప్తంగా రూ.1200 కోట్ల అపరాధరుసుం చెల్లించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. మహిళలను రుణమాఫీ పేరుతో మోసం చేసి కేవలం రూ.3000 ఇచ్చి చేతులు దులుకున్నారని, చేనేతలకు రుణం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ సమన్వయక ర్త ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ సీఎం, మంత్రులు అమరావతి రాజధానిలో ల్యాండ్ ఫూలింగ్‌కు పాల్పడి వేల ఎకరాలు దండుకున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శు లు ఎల్ఎం మోహన్‌రెడ్డి, తిప్పేస్వామి, సింగిల్‌విండో అ ధ్యక్షుడు రామాంజినేయులు, మాజీ మార్కెట్‌యార్డ్ చెర్మై న్ రఘునాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.