breaking news
Pune Open ATP Challenger tournament
-
పుణే ఓపెన్ తొలి రౌండ్లోనే సాకేత్ పరాజయం
గతవారం బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని అదే జోరును పుణే ఓపెన్‌లో కొనసాగించలేకపోయాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 4–6, 6–7 (1/7)తో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్ చేతిలో ఓడిపోయాడు. గంటా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ తొలి సెట్లో తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సాకేత్ రెండో సెట్లో తీవ్రంగా పోరాడాడు. అయితే టైబ్రేక్‌లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. -
సింగిల్స్ ఫైనల్లో యూకీ
పుణే: భారత పురుషుల టెన్నిస్ నంబర్‌వన్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ యూకీ 7-6 (8/6), 6-3తో నాలుగో సీడ్ జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఎవగెని డాన్స్కాయ్ (రష్యా)తో యూకీ తలపడతాడు. ఈ సీజన్లో ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకోవడం యూకీకిది ఐదోసారి. షాంఘై టోర్నీలో టైటిల్ నెగ్గిన ఈ ఢిల్లీ ఆటగాడు ఢిల్లీ, సమర్కండ్, తైవాన్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో దివిజ్ శరణ్ (భారత్)-మాక్సిమిలన్ న్యూక్రైస్ట్ (ఆస్ట్రియా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో దివిజ్-న్యూక్రైస్ట్ జంట 6-1, 3-6, 6-10తో ‘సూపర్ టైబ్రేక్’లో మెనెన్‌డెజ్-గ్రానోలెర్స్ (స్పెయిన్) ద్వయం చేతిలో ఓడిపోయింది.