breaking news
publicissues
-
పబ్లిక్ ఇష్యూ ద్వారా హీరో ఫిన్‌కార్ప్ రూ.4వేల కోట్లు సమీకరణ!
ప్రముఖ దిగ్గజ కంపెనీ హిరో మోటోకార్ప్ ఆటోమోబైల్ రంగంలో సేవలు అందించడంతో పాటు ఫైనాన్స్ రంగంలోనూ తన సత్తాచాటేందుకు సిద్ధం అయింది. హీరో మోటోకార్ప్ ఆర్థిక సేవల విభాగమైన హీరో ఫిన్‌కార్ప్ రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2024లో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూపై సలహాలు ఇచ్చేందుకు ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జెఫ్రీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, యూబీఎస్, ఎస్బీఐ కేపిటల్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయని ఓ వార్త మీడియాలో ప్రచురించారు. ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా కొత్త షేర్ల జారీ, ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరో ఫిన్‌కార్ప్‌లో హీరోమోటో కార్ప్ సంస్థకు 40 శాతం వాటా ఉంది. ముంజల్ కుటుంబం చేతిలో 35-39 శాతం వాటా ఉండగా.. అపోలో గ్లోబల్, క్రిస్ కేపిటల్, క్రెడిట్ సూయిజ్, హీరో మోటోకార్ప్‌నకు చెందిన కొన్ని డీలర్ల సంస్థల వద్ద మిగిలిన వాటా ఉంది. 1991లో హీరో ఫిన్‌కార్ప్ బ్యాంకింగేతర ఆర్థిక సేవల కంపెనీగా ఏర్పడింది. -
ప్రజా అవసరాలపై ఎందుకు చర్చించరు
– వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రజా అవసరాలపై రాష్ట్ర కేబినెట్ ఎందుకు చర్చించదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు, రుణమాఫీ, పోలవరం నిర్మాణం వంటి అంశాలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ హామీతో రైతులు విష వలయంలో చిక్కుకున్నారని, వారికి బ్యాంకులూ రుణాలివ్వడం లేదన్నారు. వర్షాభావం, కరువు కారణంగా 13 జిల్లాల్లో పంటలు ఎండుతున్నాయన్నారు. తూర్పు గోదావరిలోని కొన్ని మండలాల్లో క్రాప్ హాలిడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. నదీ నీటి పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి సంజీవని లాంటిదైనా ఈసారి బడ్జెట్లో కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు. వీటన్నింటికి కర్త, కర్మ, క్రియ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.