breaking news
Public Relations Officer
-
TS: గవర్నర్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడిని గవర్నర్ పీఆర్వోగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు. ఈ వ్యవహారంతో.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు చేయగా.. రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. అయితే ఇటీవల గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంలో గవర్నర్ సైతం కేంద్రానికి పలు ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టమంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీఎం కేసీఆర్ గవర్నర్‌తో వ్యహరిస్తున్న తీరును బీజేపీ తప్పుపడుతోంది. @DrTamilisaiGuv Excellency the Governor is a titular head and appointing a bjp party member as your Public relations officer is a case of impropriety ,it also raises doubts about your complaints with regards to @TelanganaCMO https://t.co/mihPZBXrcX — Asaduddin Owaisi (@asadowaisi) April 22, 2022 -
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
నిజ జీవితంలో ప్రతి మనిషికీ ప్రజా సంబంధాలు చాలా అవసరం. ఆధునిక యుగంలో అందరితో కలుపుగోలుగా ఉండగలిగితే అదే పదివేలు. ఏ సంస్థలోనైనా ఎవరిని సంప్రదించాలనుకున్నా మనకు మొదట గుర్తొచ్చేది పీఆర్వో(పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్). ఈయన ద్వారానే మనం సంప్రదింపులు జరుపుతుంటాం. ఇటీవల కాలంలో కార్పొరేట్ కల్చర్ విస్తరించడంతో పబ్లిక్ రిలేషన్స్ విభాగానికి, పీఆర్వోలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. అంతేకాకుండా ఈ పబ్లిక్ రిలేషన్స్ విభాగం చక్కటి ఉపాధి వేదికగా ఉజ్వల భవిష్యత్తును అందిస్తోంది. ఈ నేపథ్యంలో పీఆర్ కెరీర్ గురించి తెలుసుకుందాం... కమ్యూనికేషన్ త్రయం గతంలో ఎవరైనా పీఆర్వో కావాలనుకుంటే.. జర్నలిజం డిగ్రీ చేసి రెండు మూడేళ్ల అనుభవం ఉంటే సరిపోయేది. కానీ పెరిగిన సాంకేతికత కారణంగా జర్నలిజం, కమ్యూనికేషన్ విభాగాలను కలిపి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. జర్నలిజం, అడ్వర్టయిజింగ్, పబ్లిక్ రిలేషన్స్ విభాగాలను కలిపి కమ్యూనికేషన్ త్రయం అని.. ïపీఆర్వోను కార్పొరేట్ కమ్యూనికేటర్ అని సంబోధిస్తున్నారు. అలాగే ప్రతి సంస్థ తన లక్ష్యాలను సాధించడంలో ప్రజా సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఒక సంస్థకు, ప్రజలకు, ఇతర స్టేక్‌హోల్డర్స్‌కు మధ్య భావ ప్రకటన, అవగాహన, సహకారం, అంగీకారం కుదర్చడం పీఆర్ విభాగం ప్రధాన విధి. పీఆర్ఎస్ఐ జాతీయ స్థాయిలో ప్రజాసంబంధాలను మెరుగుపర్చేందుకు 1958లో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ)ని ఏర్పాటు చేశారు. పబ్లిక్ రిలేషన్స్ ఒక వృత్తిగా.. మేనేజ్మెంట్ విధుల్లో భాగంగా గుర్తింపు పొందేందుకు కృషి చేయడం, పబ్లిక్ రిలేషన్స్ విభాగానికి సంబం«ధించిన నైతిక విలువలను పరిరక్షిస్తూ.. వాటి అభివృద్ధికి కృషి చేయడం, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన వృత్తి విద్యా కోర్సులను అన్ని విశ్వవిద్యాలయాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అవకాశాలు అనేకం ప్రజా సంబంధాలకు సంబంధించిన ఉద్యోగాలు.. ప్రభుత్వ, ప్రైవేట్, పబ్లిక్, పారిశ్రామిక, విద్యా, వైద్య తదితర రంగాల్లో అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ రంగంలో పీఆర్ఓల పాత్ర విస్తరిస్తున్నా.. ప్రభుత్వ రంగంలో ఎక్కువ భాగం ఉద్యోగాలు ఇంకా అలంకారప్రాయంగానే ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. కొత్తగా పుట్టుకొస్తున్న పీఆర్వో ఏజెన్సీలు కార్పొరేట్ సంస్థలకు అనుబంధంగా ఉంటూ అభ్యర్థులకు తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాయి. కోర్సులు డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్. డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా మేనేజ్మెంట్. డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్. పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. షార్ట్‌టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు. మాస్టర్స్ ఇన్ అడ్వర్టయిజింగ్ అండ్ పీఆర్. ఎంఏ పబ్లిక్ రిలేషన్స్. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. అర్హతలు పబ్లిక్ రిలేషన్స్‌లో డిప్లొమా లేదా పీజీ డిప్లొమా కోర్సులు చేయాలంటే తప్పనిసరిగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రముఖ విద్యా సంస్థలు ఆంధ్రా యూనివర్సిటీ – వైజాగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ – న్యూఢిల్లీ. ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ – అహ్మదాబాద్. యూనివర్సిటీ ఆఫ్ ముంబై – ముంబై. సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ – పుణె. మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం – భోపాల్. భారతీయ విద్యాభవన్ – న్యూఢిల్లీ. గమనిక: పబ్లిక్ రిలేషన్స్ కోర్సులు చాలా వర్సిటీల్లో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో అంతర్భాగంగా ఉన్నాయి. బోధనాంశాలు బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ ఎథిక్స్ మీడియా స్టడీస్ ఇంగ్లిష్ అండ్ క్రియేటివ్ రైటింగ్ మార్కెటింగ్ హా స్ట్రాటజీస్ సోషల్ సైన్సెస్ హా ఎమర్జింగ్ టెక్నాలజీస్ హా కన్జ్యూమర్ సైకాలజీ ఉపాధి వేదికలు అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ ఏజెన్సీలు కార్పొరేట్ సంస్థలు ఫైనాన్షియల్ సర్వీస్‌లు ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ చారిటీస్ ట్రేడింగ్ సంస్థలు బాధ్యతలు ప్లానింగ్ ఇంప్లిమెంటింగ్ పీఆర్ స్ట్రాటజీస్ ఆన్సరింగ్ మీడియా సెండింగ్ మెయిల్స్ టు మీడియా అదర్ ఆర్గనైజేషన్స్ అనలైజింగ్ మీడియా కవరేజ్ ప్రిపేరింగ్ పబ్లిసిటీ బ్రోచర్స్ ఆర్గనైజింగ్ ఈవెంట్స్ అప్డేటింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్‌సైట్స్ ఫైండింగ్ స్పాన్సర్షిప్ ఆపర్చునిటీస్ అవసరమైన నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ రైటింగ్ నైపుణ్యాలు ఫ్లెక్సిబిలిటీ విల్లింగ్‌నెస్ టు లెర్న్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు మల్టీటాస్కింగ్ స్కిల్స్ ఇనిషియేటివ్ స్కిల్స్ హా క్రియేటివిటీ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ హా బృంద నైపుణ్యాలు హా బిజినెస్ అవేర్నెస్ నాలెడ్జ్ ఆన్ కరెంట్ అఫైర్స్ జాబ్ ప్రొఫైల్స్ పీఆర్వో హా పీఆర్ మేనేజర్ పీఆర్ స్పెషలిస్ట్ హా పబ్లిక్ అఫైర్స్ కన్సల్టెంట్ సోషల్ రీసెర్చర్ హా డేటా సైంటిస్ట్ మీడియా ప్లానర్ హా పీఆర్ డైరెక్టర్ పీఆర్ ఆఫీసర్ హా పీఆర్ అసిస్టెంట్ పీఆర్ హెడ్ ప్రత్యామ్నాయ కెరీర్లు సోషల్ మీడియా మేనేజర్ మీడియా బయ్యర్ అడ్వర్టయిజింగ్ డైరెక్టర్ సేల్స్ ప్రమోషన్ ఎగ్జిక్యూటివ్ మార్కెట్ రీసెర్చర్ పబ్లిక్ రిలేషన్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ వేతనాలు పీఆర్ ఉద్యోగాల్లో ప్రారంభ వేతనం రూ.18–20 వేల వరకు ఉంటుంది. తర్వాత అనుభవం, అర్హత, నైపుణ్యాలను బట్టి బాగానే ఆర్జించవచ్చు.