breaking news
public authority
-
సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు!
-
సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం మరో సంచలన తీర్పును వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందంటూ చరిత్రాత్మక ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పారదర్శకత చట్టమైన ఆర్టీఐ కిందకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే, పారదర్శకత పేరిట న్యాయవ్యవస్థ స్వతంత్రను తక్కువ చేయలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపి..ఈ ఏడాది ఏప్రిల్ 4న తన తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. చదవండి: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు -
చేతులెత్తేశారు!
- ఇసుక విక్రయాల్లో అధికార యంత్రాంగం విఫలం అనంతపురం సెంట్రల్ : స్వయం సహాయక సంఘాల ద్వారా ఇసుక విక్రయం నిర్ణయం అక్రమార్కులకు వరంగా మారింది. నైపుణ్య లేమి కారణంగా డ్వాక్రా మహిళలు... రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు ఇసుకరీచ్లపై పట్టు సాధించలేకపోతున్నారు. అధికార పార్టీ నాయకులకు ఉన్నతాధికారులు సైతం జీ హుజూర్ అంటుండడంతో ప్రభుత్వ రీచ్‌ల నుంచే ఇసుక అక్రమంగా తరలిపోతోంది. శింగనమల మండలంలోని ఉల్లికల్లు రీచ్‌లో రూ. 43 లక్షల విలువైన ఇసుకను దారిమళ్లించారని అనంతపురం ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ విచారణలో తేలడంతో అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణంపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ జరుపుతుండగానే.. కణేకల్లు మండలంలో ఇసుకరీచ్ బాగోతం తెరపైకి వచ్చింది. గతంలో వెలుగులోకి వచ్చిన అన్ని ఇసుక కుంభకోణాల్లోనూ అధికారపార్టీకి చెందిన చోటా నాయకులు తెరపైకి వచ్చారు. కణేకల్లు ఘటనలో మాత్రం ఏకంగా ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు పేరు తెరపైకి వస్తోంది. జిల్లాలో నాణ్యమైన ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఉల్లికల్లు, పెద్దపప్పూరు మండలం దేవుని ఉప్పలపాడు, తాడిమర్రి మండలం చిన్న చిగుళ్లరేవు, కణేకల్లు మండలం గంగులాపురం రీచ్‌లలో నాణ్యమైన ఇసుక దొరుకుతోంది. ఇవి స్థానిక ప్రజాప్రతినిధుల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. అధికారికంగా ఒక ట్రిప్పు తోలితే అనధికారికంగా మూడు, నాలుగు ట్రిప్పుల ఇసుక తరలిపోతోంది. రాత్రి సమయాల్లో ఏకంగా జేసీబీలను పెట్టి టిప్పర్ల సహాయంతో కర్ణాటకకు తరలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఏర్పాటు చేసిన 28 రీచ్‌ల ద్వారా 2.28 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక అమ్మకాలు చేపట్టారు. ప్రభుత్వానికి రూ. 10.91 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే స్థాయిలో అక్రమార్కులు ఇసుకను లూటీ చేశారు. 26వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మిన ఉల్లికల్లు రీచ్‌లోనే రూ. 43 లక్షలు లూటీ అయినట్లు విచారణలో తేలింది. జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు మండలాల్లోని రీచ్‌ల నుంచి రూ.కోట్లు విలువజేసే లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దారి మళ్లిందని స్పష్టమవుతోంది. ఇసుకరీచ్‌లను పర్యవేక్షించే డీఆర్డీఏ- వెలుగు ప్రాజెక్టు అధికారులు బొమ్మల్లా తయారయ్యారు. పత్రికలలో వరుస కథనాలు వస్తే తప్పా వారిలో చలనం ఉండడం లేదు. రెగ్యులర్ ప్రాజెక్టు డెరైక్టర్ లేకపోవడం కూడా ఇసుకరీచ్‌లు అధ్వానంగా తయారవడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ఇసుక రీచ్‌ల పరిస్థితి - తాడిమర్రి మండలం చిన్న చిగుళ్లరేవు(సీసీరేవు) రీచ్ నుంచి ఇసుకను స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు బెంగళూరు, బళ్ళారికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. - బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి ఇసుకరీచ్‌ను మూసేయించేందుకు ముఖ్య ప్రజాప్రతినిధి కుమారుడు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచా రం. ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తరలించాలంటే బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట, రాయదుర్గం పోలీస్ స్టేషన్లు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అదే మండలంలోని యనకల్లు, పీతకల్లు గ్రామాల్లో ఇసుకరీచ్‌లను ప్రారంభించాలని పట్టుబడుతున్నారు. - కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇసుక అక్రమ వ్యా పారాన్ని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. - గోరంట్లలో మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త చి త్రావతి నది నుంచి ఇసుకను తోడి పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా రోజూ బెంగళూరుకు తరలిస్తున్నారు. దాదాపు 200లోడుల ఇసుకను గోరంట్ల మండల కేంద్రానికి సమీపంలో డంప్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసినా అక్కడికి వెళ్లేందుకు అధికారులు సాహసించడం లేదు.