breaking news
Protest Performances
-
ఈడీ ఎఫెక్ట్.. బీజేపీ నేతలపై బీఆర్ఎస్ వినూత్న నిరసన
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కాం కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్, ఎమ్మెల్సీ కవితపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం కేంద్రం, దర్యాప్తు సంస్థలను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు. ఇక, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈడీ, సీబీఐ, బీజేపీ బెదిరింపు రాజీకీయాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ సినిమాటిక్ రేంజ్లో కొందరు బీజేపీ నేతలపై పోస్టర్లు వేశారు. అంతకుముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు దర్యాప్తు సంస్థల రైడ్స్ అనంతరం.. కాషాయ రంగు అద్దుకుని బీజేపీలో చేరానని సెటైరికల్‌గా చెప్పారు. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో వెలిసిన పోస్టర్లు అంటించారు. కానీ, ఎమ్మెల్సీ కవితకు మాత్రం రైడ్‌కు ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిజమైన రంగులు వెలసిపోవు అంటూ కొటేషన్స్ ఇచ్చారు. ఈ పోస్టర్లకు బై బై మోదీ.. అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. కాగా, ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అమల్లోకి నేపాల్ రాజ్యాంగం
కఠ్మాండు: ఏడేళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత సాకారమైన చరిత్రాత్మక రాజ్యాంగాన్ని నేపాల్ ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో హిమాలయ దేశం హిందూ రాచరిక రాజ్యం నుంచి పూర్తి లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశాన్ని ఏడు సమాఖ్య రాష్ట్రాలుగా విభజిస్తూ రాజ్యాంగంలో చేసిన ప్రకటనపై మదేశీ తెగ ప్రజల నిరసన మధ్య రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ‘రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిన, రాజ్యాంగ సభ చైర్మన్ ధ్రువీకరించిన రాజ్యాంగం ఈ రోజు నుంచి.. అంటే 2015 సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటిస్తున్నాను’ అని దేశాధ్యక్షుడు రామ్‌బరణ్ యాదవ్ ఆదివారం పార్లమెంటులో రాజ్యాంగాన్ని ఆవిష్కరిస్తూ ప్రకటించారు. ‘ప్రజాస్వామ్యం, శాంతి కోసం ప్రజలు ఏడు దశాబ్దాలు పోరాడారు. కొత్త రాజ్యాంగం రావడంతో తాత్కాలిక రాజ్యాంగం రద్దయింది. దేశ శాంతి, సుస్థితర, ఆర్థిక ప్రగతికి కొత్త రాజ్యాంగం బాటలు వేస్తుంది. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, అందరి హక్కులకు అవకాశమిచ్చింది. అందరూ ఏకతాటిపైకొచ్చి, సహకరించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. రాజ్యాంగ అమలు ప్రకటనకుగాను అధ్యక్షుడికి కృతజ్ఞలు తెలుపుతూ అసెంబ్లీ చివరి సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కొత్త రాజ్యాంగం ప్రకారం రెండు చట్టసభలు ఉంటాయి. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో 375 మంది సభ్యులు, ఎగువ సభలో 60 మంది సభ్యులు ఉంటారు. కొత్త రాజ్యాంగం రావడంతో నేపాలీలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు ఎగరేసి, బాణసంచా కాల్చారు. మరోపక్క.. మదేశీ తెగ ప్రజలు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భారత్ సరిహద్దులోని దక్షిణ ప్రాంతాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు, ఆస్తుల విధ్వంసం జరిగినట్లు వార్తలు వచ్చాయి. బిరాట్‌నగర్, బీర్గంజ్, ధరాన్‌లలో రాజ్యాంగ అనుకూల, వ్యతిరేక వర్గాలు ర్యాలీలు నిర్వహించాయి. బీర్‌గంజ్‌లో సీపీఎన్-యూఎంఎల్ ఎంపీ ఇంటిని ధ్వంసం చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిరసనకారుడు చనిపోయాడు. రాజ్యాంగంలో తమ డిమాండ్లను నెరవేర్చలేదని మదేసీ, థారు తెగలు ఆరోపిస్తున్నాయి.