breaking news
Property Transactions
-
పాన్ కార్డు లేకుండానే ప్రాపర్టీ డీల్స్!
దేశంలో ఆస్తి లావాదేవీలకు సంబంధించిన కీలక నిబంధనల్లో మార్పులు చేయాలని ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాన్ కార్డు నిబంధనలకు సడలింపు కల్పిస్తూ రూ.20 లక్షల లోపు ఉన్న ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేకపోవచ్చని ముసాయిదా ఆదాయపు పన్ను నియమాల్లో సూచించింది. ఈ ప్రతిపాదన కొత్త ఆదాయపు పన్ను పాలనలో భాగంగా తీసుకువచ్చిన మార్పులలో ఒకటి. ప్రస్తుతం ఇది ప్రజా సంప్రదింపుల దశలో ఉంది.ప్రస్తుతం ఎలా ఉందంటే.. ప్రస్తుత నియమాల ప్రకారం.. రూ.10 లక్షలకు మించిన విలువ కలిగిన స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయాల సమయంలో పాన్ నంబర్‌ను తప్పనిసరిగా కోట్ చేయాలి.కొత్త ప్రతిపాదన ఏమిటి?ముసాయిదా ప్రకారం.. రూ.20 లక్షల లోపు విలువైన ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం లేదు. రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ఈ మార్పు చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు, ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి ఉపశమనం కలిగించనుంది.గిఫ్ట్ డీడ్స్, జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలకూ వర్తింపుసవరించిన ముసాయిదా ప్రకారం, పాన్ నిబంధన కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాదు. స్థిరాస్తి బహుమతిగా బదిలీ, ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలకూ వర్తిస్తుంది. ఇలాంటి లావాదేవీలకూ ఇదే రూ.20 లక్షల పరిమితి వర్తిస్తుంది. అంటే ఆస్తి విలువ రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అయితే మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.మార్పు వెనుక కారణంగత కొన్ని సంవత్సరాల్లో ఆస్తి ధరలు గణనీయంగా పెరిగాయి. అనేక నగరాల్లో సాధారణ ఇళ్ల ధర కూడా రూ.10 లక్షలను దాటిపోయింది. ఈ నేపథ్యంలో పాత పరిమితి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు సరిపోవడం లేదని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రతిపాదన వల్ల చిన్న కొనుగోలుదారులపై పేపర్‌వర్క్ భారం తగ్గుతుంది. అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్లో లావాదేవీలు సులభతరం అవుతాయి. ప్రస్తుత రియల్ ఎస్టేట్ విలువలకు అనుగుణంగా నిబంధనలు మారుతాయి. ప్రత్యేకంగా టైర్-2, టైర్-3 నగరాల్లో గృహ కొనుగోలుదారులకు ఇది ప్రయోజనకరంగా మారుతుంది.అమలు ఎప్పుడు?ప్రస్తుతం ఇవి ముసాయిదా దశలోనే ఉన్నాయి. ప్రజల నుంచి, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడనుంది. అమల్లోకి వస్తే, చిన్న స్థాయి ఆస్తి కొనుగోలుదారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. అదే సమయంలో, భారీ లావాదేవీలపై పారదర్శకతను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
అక్కడ స్థలాలు కొనాలంటే మరింత కాసులు విదిల్చాల్సిందే
ఆస్తులు కొనే ప్లాన్‌లో ఉన్నవారు పునరాలోచనలో పడే నిర్ణయం తీసకుంది ఢిల్లీ సర్కారు. అకస్మాత్తుగా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ కార్పోరేషన్ ఢిల్లీ 2022 మే 31న ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీ కార్పోరేషన్ పరిధిలో జూన్ 1 నుంచి ప్రాపర్టీల ట్రాన్స్ఫర్కి సంబంధించి పన్నులు పెరగనున్నాయి. ఢిల్లీ కార్పోరేషన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో 1 శాతం మేర ట్రాన్స్ఫర్ పన్ను పెరిగింది. ప్రాపర్టీ విలువ రూ. 25 లక్షలు దాటిన వాటికి ఈ కొత్త పెంపు వర్తిస్తుంది. ఇప్పటి వరకు పురుషులకు అయితే 3 శాతంగా ఉన్న ట్రాన్స్ఫర్ పన్ను 4 శాతానికి పెరగగా స్త్రీలకు 2 శాతం నుంచి 3 శాతానికి చేరుకుంది. ప్రాపర్టీ మొత్తం విలువ ఆధారంగా ట్రాన్స్ఫర్ పన్నును విధిస్తారు. చదవండి: ఇదెక్కడి గొడవరా నాయనా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టాలు -
తండ్రిని చంపిన తనయుడు అరెస్టు
ఆస్తి తగాదాలే హత్యకు కారణం కోడలు పాత్రపై అనుమానాలు మైదుకూరు టౌన్: తండ్రిని చంపిన కేసులో ఆయన తనయుడు ముద్దంశెట్టి శివప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడపలో లక్ష్మిభవన్ హోటల్ నిర్వహిస్తున్న ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్య(64)ను అతని కొడుకు శివప్రసాద్, అతని అన్న బావమరిది మైలారు జగన్నాథం కలిసి పథకం ప్రకారం హత్య చేశారన్నారు. వెంకటసుబ్బయ గత కొద్ది సంవత్సరాలుగా కడపలో లక్ష్మిభవన్ హోటల్‌ను నిర్వహిస్తూ మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె ప్రాంతంలో పొలాలను కొనుగోలు చేసి సాగుచేసుకుంటూ ఉండేవాడన్నారు. ఇతనికి నాగరాజు, శివప్రసాద్ అనే కుమారులతో పాటు కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. 2008వ సంవత్సరంలో పెద్ద కుమారుడు నాగరాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. శివప్రసాద్ బీటెక్ చదివి హైదరాబాద్‌లో ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఆస్తి పంపకం విషయమై శివప్రసాద్ తండ్రితో తరచూ ఘర్షణకు దిగేవాడు. పెద్ద మనుషులు పంచాయతీ చేసినప్పటికీ ఆస్తి పంపకం చేయకపోవడంతో తండ్రిపై ద్వేషం పెంచుకున్న శివ ప్రసాద్ ఎలాగైనా తండ్రిని అడ్డుతొలగించుకోవాలని భావించి తన అన్న బావమరిదైన జగన్నాథంతో కలిసి హత్యకు పథకం రూపొందించాడు. ఈ తరుణంలో ఆదివారం వారు హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనంలో రెండు వేటకొడవళ్లు పెప్పర్ స్ప్రేతో మైదుకూరుకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం వెంకటసుబ్బయ్య కడప నుంచి తిప్పిరెడ్డి పల్లె సమీపంలో ఉన్న పొలం వద్దకు చేరుకోగా విషయం తెలుసుకున్న శివప్రసాద్, జగన్నాథంలు తోటలోని అరటి చెట్లమాటున మాటువేసి కూర్చున్నారు. వెంకటసుబ్బయ్య పొలం పనులు ముగించుకొని సాయంత్రం కడపకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా హఠాత్తుగా వెంకటసుబ్బయ్యపై శివ, జగన్నాథంలు దాడిచేసి పెప్పర్ స్ప్రే చేశారు. వెంకటసుబ్బయ్య వారితో పెనుగులాడగా శివ వెంకటసుబ్బయ్య మెడ భాగంపై వేటకొడవలితో నరికి కిరాతకంగా హత మార్చాడు. నిందితులు ఇద్దరు నేరుగా ద్విచక్రవాహనంపై మైదుకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ మేరకు తోట కాపలాదారుడు మహేష్ ఫిర్యాదు మేరకు శివ, జగన్నాథంలపై కేసు నమోదు చేశామన్నారు. వెంకటసుబ్బయ్య హత్య విషయంలో కోడలు సుప్రజ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి ద్విచక్రవాహనం, రెండువేట కొడవళ్లు, పెప్పర్ స్ప్రేను స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆయన వివరించారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన వృద్ధ దంపతులు
ఖమ్మం: జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ సోమవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. నేలకొండపల్లి సీఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణలిద్దరూ తమను చిత్రహింసలు పెడుతున్నారంటూ వారు వాపోతున్నారు. ఎస్ఐ, సీఐలపై చర్యలు తీసుకోవాలంటూ దంపతులిద్దరూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు.


