breaking news
proper arrangements
-
‘రచ్చ’బండ
పెద్దకడబూరు, న్యూస్‌లైన్ : పెద్దకడబూరులో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ..రచ్చగా మారింది. గ్రామాల నుంచి వచ్చిన వారికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా సభాప్రాంగణంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడం.. కార్యక్రమ రూపకర్త అయిన ైవె ఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహించారు. ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. రచ్చబండ ద్వారా 1265 రేషన్‌కార్డులు, 1349 పక్కాగృహాలు, 246 పింఛన్లు, 89 బంగారుతల్లి, 696 విద్యుత్ మీటర్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆయా గ్రామాల నుంచి 3645 మంది లబ్ధిదారులతో పాటు కొత్తగా దర ఖాస్తులు ఇచ్చేందుకు మరో వెయ్యి మంది రచ్చబండకు హాజరయ్యారు. అయితే అధికారులు 200 మందికి మాత్రమే ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వచ్చిన ప్రజలు వేదిక ఎదుట గుమిగూడడంతో గందోరగోళ పరిస్థితి నెలకొంది. రచ్చబండ పోస్టర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం లేకపోవడం కూడా ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రమాకాంతరెడ్డి తన అనుచరులతో ఆందోళనకు దిగారు. దానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి అడ్డు చెప్పడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండల ప్రత్యేక అధికారి లక్ష్మా విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో వైఎస్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం కొనసాగించారు. అధికారపక్ష నేతలు రవిచంద్రారెడ్డి, తిక్కన్న, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రమాకాంతరెడ్డి వ్యక్తిగత ప్రసంగాలతో ఒకరినొకరు దూసించుకున్నారు. ఒక్కసారిగా ఇరువర్గాల అనుచరులు వేదికపైకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుర్చీలను విరగొట్టారు. ఎస్ఐ తిమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాల వారినీ చెదరగొట్టారు. అయితే వందలాది రూపాయలు ఖర్చు చేసుకుని వస్తే కాంగ్రెస్ నేతల నిర్వాహకంతో నోట్లో మట్టిపడిందని వృద్దులు, వికలాంగులు, వితంతువులు శాపనార్ధలు పెట్టారు. -
ఛట్ పూజకు భారీ ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ:పూర్వాంచలీయులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛట్ పూజ కోసం ప్రభుత్వం భారీఎత్తున ఏర్పాట్లు చే స్తోంది. ఛట్ పూజను పురస్కరించుకుని ఈ నెల 8, 9 తేదీల్లో పూర్వాంచలీయులు యమునా నదితీరంలోని ఘాట్లతోపాటు నగరంలో కాలువులు, సహజ జలాశయాలతో పాటు కృత్రిమంగా ఏర్పాటుచేసే జలాశయాల వద్ద సూర్యభగవానునికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆర్ఘ్యప్రసాదాలను సమర్పిస్తారు. ఇందుకోసం యమునా నది ఘాట్లను శుభ్రం చేసి టెంట్లు వేయడం, వెదురు బారికేడ్లు నిర్మించడం తదితర పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఐటీఓ ఘాట్, యమునా ఘాట్, కుదేశియా ఘాట్ల వద్ద గుట్టల్లా పేరుకుపోయిన ప్లాస్టిక్ సంచులు, సీసాలను తొలగిస్తున్నారు. రాత్రి పూట నదీ తీరంలో బస చేయదలచిన వారికోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. యమునా నది లోతుల్లోకి ప్రజలు వెళ్లకుండా ఉండడం కోసం కంచెలు, ప్రజలను నియంత్రించడం కోసం వెదురు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టం తదితరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 72 ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం సమయంలో జరిగిన మరణాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అటువంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత ్తలు తీసుకుంటున్నారు. యమునా నది తీరాన మయూర్ విహార్, షకర్‌పుర్, గీతాకాలనీ, సోనియా విహార్, బదర్ పూర్లలోగల అనేక ఘాట్ల వద్దకూడా పూర్వాంచలీయులు సూర్యునికి ఆర్ఘ్యపాద్యాలను సమర్పిస్తారు, కోండ్లీ కాలువకు ఇరువైపులా ఛట్‌పూజ కోసం పది ఘాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇవేకాకుండా అనేక ఉద్యానవనాల్లో కృత్రిమ జలాశయాలను నిర్మించే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. పూర్వాంచలీయులను ఆకట్టుకునేందుకు తంటాలు శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు కూడా పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఈ సందర్భాన్ని శాయశక్తులా వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పూర్వాంచలీయులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఛట్ ఫూజ రోజును ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తామనిప్రకటించిన బీజేపీ.. ఈ పూజ కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇప్పటికే ఓ లేఖ రాసింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోయినట్టయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఛట్ పూజ ఘాట్ల వద్ద తమ పార్టీ కార్యకర్తలు సేవలందిస్తారని ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. కాగా తమ పార్టీ నేతలు,కార్యకర్తలు ఛట్ పూజలో పాల్గొంటారని ఆమ్ ఆద్మీపార్టీ కూడా ఇప్పటికే ప్రకటించింది. అన్ని నియోజకవర్గాల్లోనూ... నగర ఓటర్లలో 40 శాతం మంది పూర్వాంచలీయులే. దాదాపు అన్ని నియోజకవర్గాలలో పూర్వాంచలీయులు ఉన్నారని, కనీసం 30 నియోజక వర్గాల్లో ఫలితాలను వారు ప్రభావితం చేయగలరని రాజకీయ విశ్లేషకులు అం టున్నారు. పూర్వాంచలీ ఓటర్లకున్న ఈ సంఖ్యాబలం కారణంగా అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు వారిని ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.