producer arrest
-
మోసం కేసులో సినీ నిర్మాత అరెస్ట్
తిరుపతి క్రైమ్: సినీ అవకాశాల పేరుతో ఎంతో మందిని మోసంచేసిన కేసులో నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ వ్యవస్థాపకుడు ఎస్వీఎన్ రావును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచినట్లు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఏడు నెలల కిందట ఎస్వీఎన్ రావు ఆర్థికంగా మోసం చేసినట్లు కేసు నమోదు అయినట్లు చెప్పా రు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడు బుధవారం తిరుపతి మూడో అదనపు జిల్లా కోర్టుకు హాజరవుతున్న విషయం తెలుసుకుని, అక్కడే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. ఆయన కారును కూడా సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపారు. -
పోలీసుల అదుపులో త్రీజీ లవ్ నిర్మాత!
-
పోలీసుల అదుపులో త్రీజీ లవ్ నిర్మాత!
విజయనగరం : 'త్రీజీ లవ్' సినీ నిర్మాత విజయనగరానికి చెందిన కోలగట్ల ప్రతాప్ కుమార్‌ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రతాప్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని... సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి మోసగించినట్లు కరీంనగర్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడిని విజయనగరంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించినట్లు సమాచారం. ప్రతాప్ పై 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వేర్ ఇండియా స్టూడియోస్ పతాకంపై కోలగట్ల ప్రతాప్ 3జీ లవ్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.