మోసం కేసులో సినీ నిర్మాత అరెస్ట్‌ | Producer Arrest inCheating Case Tirupati | Sakshi
Sakshi News home page

మోసం కేసులో సినీ నిర్మాత అరెస్ట్‌

Oct 31 2019 8:14 AM | Updated on Oct 31 2019 8:14 AM

Producer Arrest inCheating Case Tirupati - Sakshi

తిరుపతి క్రైమ్‌: సినీ అవకాశాల పేరుతో ఎంతో మందిని మోసంచేసిన కేసులో నవ్యాంధ్ర ఫిలిం చాంబర్‌ వ్యవస్థాపకుడు ఎస్వీఎన్‌ రావును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచినట్లు తిరుపతి వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శివప్రసాద్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఏడు నెలల కిందట ఎస్వీఎన్‌ రావు ఆర్థికంగా మోసం చేసినట్లు కేసు నమోదు అయినట్లు చెప్పా రు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడు బుధవారం తిరుపతి మూడో అదనపు జిల్లా కోర్టుకు హాజరవుతున్న విషయం తెలుసుకుని, అక్కడే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. ఆయన కారును కూడా సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement