breaking news
Private passenger vehicle
-
ప్రైవేట్ ట్రైన్స్, రూ.30వేల కోట్ల టెండర్లను రిజెక్ట్ చేసిన కేంద్రం
ఇండియన్ రైల్వే ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రైళ్ల నిర్వహణపై రూ.30వేల కోట్ల టెండర్లు నిర్వహించి.. వాటిని కేంద్ర రైల్వే శాఖ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ నిర్వహించిన టెండర్లలో ప్రైవేట్ రైలు సర్వీసుల్ని అందించేందుకు జీఎంఆర్‌హైవే లిమిటెడ్, ఐఆర్ సీటీసీ, ఐఆర్బీ ఇన్ఫ్రా, క్యూబ్ ఐవే, సీఏఎఫ్ ఇండియా, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పలు కంపెనీలు పోటీ పడ్డాయి. వీటిలో ఐఆర్సీటీసీ, మేఘా ఇంజనీరింగ్ టెండర్లపై చర్చలు జరుపుతున్నట్లు,మిగిలిన కంపెనీల టెండర్లను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. మళ్లీ కొత్త కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించగా.. టెండర్లను కేంద్రం ఎందుకు రిజెక్ట్ చేసిందనే అంశంపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిపుణుడు మనీష్ అగర్వాల్ స్పందించారు. సామాన్యుడిపై భారం తగ్గించేందుకు కేంద్రం టెండర్లను తక్కువ ధరకే పాడేలా ప్రైవేట్ సంస్థలపై ఒత్తిడి తెస్తుందని అన్నారు. రైల్వేశాఖ న్యాయమైన నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించడానికి ఒప్పంద నిబద్ధత ఉండాలి' అని అగర్వాల్ తెలిపారు. కాగా, గతేడాది జులైలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇండియన్ రైల్వే ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉందని, మొదటి దశలో 2023 నాటికి 12 ప్రైవేట్ రైళ్ల సర్వీసుల్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 151 ప్రైవేట్ రైలు సర్వీసులు 2027 నాటికి మొత్తం దశలవారీగా దేశంలోని 109 రూట్లల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తాయన్నారు. ఇందుకోసం మొత్తం రూ.30,000 కోట్ల ప్రైవేట్ సంస్థల్ని టెండర్ల కోసం ఆహ్వనించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. -
రూ.9 లక్షల పట్టివేత
పాచిపెంట, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో పి.కోనవలస ఆంధ్ర-ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద బుధవారం ఉదయం తనిఖీ చేస్తున్న పోలీసులకు.. భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఒడిశా నుంచి వస్తున్న వాహనంలో రూ.9 లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సాలూరు సీఐ జి.దేముళ్లు పాచిపెంట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాసింజర్ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా నలుపు రంగు బ్యాగులో రూ.9 లక్షలకుపైగా నగదు లభ్యమైందని చెప్పారు. ఒడిశాలోని సుంకి గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్, నిర్మల్ యాదవ్ ఈ మొత్తాన్ని తరలిస్తున్నారని తెలిపారు. వారిని ప్రశ్నించగా.. మద్యం బేవరేజెస్ కంపెనీకి తీసుకెళ్తున్నట్లు చెప్పారని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను చూపలేకపోయారని చెప్పారు. సరిపడా ఆధారాలు చూపిస్తే.. ఎన్నికల తర్వాత ఆ మొత్తాన్ని వారికి అప్పగిస్తామని చెప్పారు. మూడురోజులుగా బ్యాంకు సెలవు కావడంతో రాయగడలో గల బ్రాందీ విక్రయ కేంద్రానికి నేరుగా నగదు తీసుకెళ్లాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. స్వాధీనం చేసుకున్న నగదును స్థానిక తహశీల్దార్ ఎల్లారావుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాచిపెంట ఎస్సై రవికుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.