breaking news
private hospitals bandh
-
నేడు ప్రైవేట్ వైద్యం బంద్!
విజయవాడ : ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణకు సంబంధించిన మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దీనివల్ల చిన్న ఆసుపత్రులు మూతపడతాయని, ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) వ్యతిరేకించింది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నేడు(గురువారం) వైద్యం బంద్‌కు పిలుపినిచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ చట్టం ఉంది. మళ్లీ కొత్తగా కేంద్రం తెచ్చిన ఈ చట్టానికి ఎందుకు ఆమోదం తెలపాలని, ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయశేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓపీ సేవలు నిలిపివేత క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నేడు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలకు మాత్రమే వైద్యం అందించనున్నారు. భవిష్యత్ కార్యచరణపై ఐఎంఎ హాల్లో వైద్యులు సమావేశం కానున్నట్లు డా.వాడ్రేవు రవి తెలిపారు. -
బంద్ అయిన ప్రయివేట్ ఆస్పత్రులు
హైదరాబాద్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్రలోని దాదాపు 40వేల మంది ప్రైవేటు వైద్యులు బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం నుంచి తమ ఆసుపత్రులను పూర్తిగా బంద్ చేస్తున్నారు. అయితే అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఇచ్చారు. ప్రయివేట్ డాక్టర్లకు మద్దతుగా అన్ని రకాల రక్తపరీక్ష కేంద్రాలను సైతం మూసివేస్తున్నారు. ప్రైవేటు వైద్యులు తమ ఆందోళనలో భాగంగా వైద్య కళాశాలలను కూడా మూసివేయిస్తున్నారు. సీమాంధ్ర జిల్లాల్లో ప్రతిచోట భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీమాంధ్ర జెఎసి కన్వీనర్ పివి రమణమూర్తి తెలిపారు.