breaking news
With price cap
-
భారీగా ధరలు తగ్గిన మందులివే!
-
భారీగా ధరలు తగ్గిన మందులివే!
న్యూఢిల్లీ: కేంద్ర ఔషధ నియంత్రక మండలి కొన్ని నిత్యావసర మందుల ధరలను భారీగా తగ్గించింది. క్యాన్సర్ మందులు, యాంటీ రిట్రోవైరల్, మలేరియా నివారణకుపయోగించే దాదాపు 22 రకాల మందులపై 45శాతం దాకా ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధకంలో, మలేరియా నివారణలోవాడే కొన్ని సాధారణ మందులను సామాన్యుడికి అందుబాటులో తెచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 10-45 శాతంవరకు గరిష్ట చిల్లర ధర లేదా ఎంఆర్పీ ధరలను తగ్గించినట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ప్రకటించింది. 22 సమ్మేళనాల కలిగిన దాదాపు 220 మెడిసిన్ బ్రాండ్ల ధరలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. తాజా ఆదేశాల ప్రకారం సగటున కనీసం 25 శాతం ధరల కోత ఉంటుందని ఒక అధికారి తెలిపారు. బ్లడ్, రొమ్ము, కడుపు, ఊపిరితిత్తులు, అండాశయము మరియు మూత్రపిండాల లాంటి వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన ధరలు ప్రభావితం కానున్నాయి.