breaking news
Pregnant rape
-
గర్భిణిపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ఏలూరు అర్బన్ : గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మంత్రి పీతల సుజాత ఆదేశించారు. ఏలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏలూరు డీఎస్పీ కెజీవీ సరితతో గర్భిణిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెదపాడు శివారు రామచంద్రపురంలో5 నెలల గర్భిణిపై నలుగురు యువకులు బెదిరించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడడమే కాకుండా సెల్ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ సాయంత్రంలోగా పట్టుకుని శిక్షించాలని మంత్రి ఆదేశించారు. బాధితురాలికి అన్ని విధాల అండగా ఉంటామని అవసరమైన వైద్యసేవలు అందించి ఆరోగ్యపరంగా ఆ మహిళ తేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. సమాజంలో మహిళలను గౌరవిస్తూ సోదరిలా ఆదరించే పరిస్థితులు నెలకొల్పడానికి పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలని మంత్రి డీఎస్పీని కోరారు. ఈ కేసు పురోగతిలో ఉందని నిందితులను గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
గర్భిణిపై అత్యాచారయత్నం
అడ్డుకున్న భర్తపై కత్తులతో దాడి బాధితుడి పరిస్థితి విషమం హైదరాబాద్, న్యూస్‌లైన్: వైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చి, భర్తతో కలసి బయటకు వెళ్లిన ఓ గర్భిణిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కామాంధులు.. అడ్డుకున్న ఆమె భర్తపై కత్తులతో విచక్షణారహితంగా దాడిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట్‌కు చెందిన రామకృష్ణ(30), హరితలక్ష్మి(25) దంపతులు. లక్ష్మి ఆరు నెలల గర్భిణి కావడంతో రామకృష్ణ ఆమెను ఈనెల 12న నయాపూల్ మెటర్నిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో ప్రతి పనికీ లంచం ఇవ్వాల్సి రావడంతో వెంట తెచ్చుకున్న నగదు అయిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్న వీరు.. ఆస్పత్రి పక్కనే ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లో రూ.5 చెల్లించి కాలకృత్యాలు తీర్చుకునేవారు. వెళ్లిన ప్రతిసారీ డబ్బులు చెల్లించాల్సి రావడంతో ఆదివారం రాత్రి 10:30 సమయంలో ఆస్పత్రి పక్కనే ఉన్న మూసీ నది ఒడ్డున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఏడుగురు దుండగులు అక్కడికి వచ్చి లక్ష్మిపై లైంగిక దాడికి యత్నించారు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై కత్తులతో దాడి చేశారు. బాధితుల కేకలు విని అటుగా వెళ్లేవారు రావడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న షాహినాయత్‌గంజ్ పోలీసులు రామకృష్ణను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన షాక్‌లో ఉన్నారు. పొట్ట, మెడ, వీపు వెనుక, పక్కటెముకలు, భుజాల్లో మొత్తం 12 చోట్ల కత్తిపోట్లున్నాయని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంటే గానీ ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. కాగా, దుండగులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు షాహినాయత్‌గంజ్ ఇన్స్పెక్టర్ పి.సత్తయ్యగౌడ్ తెలిపారు. పోలీసులు పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.