breaking news
pre - release function
-
ఖమ్మంలో ‘వెంకీ మామ’
సాక్షి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో వెంకీమామ చిత్రబృందం తళుక్కుమంది. హీరోహీరోయిన్లు విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్‌లు అభిమానులను హోరెత్తించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక శనివారం రాత్రి ఖమ్మంలోని లేక్‌వ్యూ క్లబ్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బృందంలోని సింగర్స్ పాడిన పాటలు.. సత్యమాస్టర్ బృందం నృత్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్, లేక్‌వ్యూ క్లబ్ అధినేత దొడ్డ రవి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవం హైలెట్‌గా నిలిచింది. ఖమ్మానికి తొలిసారిగా వచ్చిన తమ అభిమాన నటుడు వెంకటేశ్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను హీరోలు వెంకటేశ్, నాగచైతన్య విడుదల చేశారు. వేదికపై హీరోయిన్లు పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నాలతో కలిసి హీరోలు, డైరెక్టర్ బాబీ, యాంకర్ శ్రీముఖి చిత్రంలోని కొకొకోలా పెప్సీ.. వెంకీమామ సెక్సీ పాటకు స్టెప్లు వేయడంతో ప్రాంగణం కేరింతలతో హోరెత్తిపోయింది. యాంకర్ శ్రీముఖి, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర చేసిన స్కిట్లు నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ సందర్భంగా హీరో వెంకటేశ్ మాట్లాడుతూ వెంకీమామ సినిమా మంచి కథతో ప్రారంభమైందని, దర్శకుడు బాబీ బాగా తీశాడని, పెద్ద హిట్ అవుతుందన్నారు. ఇప్పటివరకు తాను నాగచైతన్యకు మాత్రమే మామనని, వెంకీమామ సినిమా తర్వాత అందరికీ మామనవుతానని పేర్కొన్నారు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ మనం, వెంకీమామ సినిమాలు జీవితంలో గుర్తుండిపోయేవని తెలి పారు. థమన్ మ్యూజిక్, బాబీ దర్శకత్వం, సు రేశ్బాబు, టీజీ విశ్వప్రసాద్ల నిర్మాణం ఈ సి నిమాకు అదనపు బలమన్నారు. ప్రొడ్యూసర్లు సురేశ్‌బాబు, విశ్వప్రసాద్, డైరెక్టర్ బాబి మాట్లాడుతూ ఈ నెల 13న విడుదలవుతోందన్నారు. -
కష్టాన్ని నమ్ముకోమని చెప్పా
– చిరంజీవి ‘‘నీ వెనుక మేమున్నామనీ.. మా వెనుక అభిమానులున్నారనీ అనుకోకుండా ప్రతి సినిమాను తొలి సినిమాగా భావించాలని వరుణ్‌కి నేనెప్పుడూ చెబుతుంటా. తొలుత కష్టాన్ని నమ్ముకో... తర్వాత మాతో పాటు అభిమానుల ఆశీస్సులు ఉంటాయంటుంటా. ఎడాపెడా సినిమాలు ఒప్పుకోకుండా మంచి కథల్ని ఎంచుకుంటూ ముందుకెళుతున్నందుకు నా బిడ్డను అభినందిస్తున్నా’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘మిస్టర్’ ఈ నెల 14న విడుదలవుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ముకుంద, కంచె, లోఫర్ చిత్రాలతో క్లాస్, మాస్ ప్రేక్షకులకు వరుణ్ దగ్గరయ్యాడు. ‘మిస్టర్’తో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాలు, ఆశీస్సులు పొందుతాడనే నమ్మకం ఉంది. బుజ్జి, మధు నిర్మాతలంటే ఈ చిత్రం సగం సక్సెస్ అయినట్టే. వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు వారు. ‘అందరివాడు’ చిత్రంలో నాతో బాగా వినోదం పండించారు శ్రీను వైట్ల. అందరూ ‘ఖైదీ నంబర్ 150’ నా రీ–ఎంట్రీ అంటారు. అంతకుముందే ‘బ్రూస్లీ’లో ఓ పాత్ర చేయాలని పట్టుబట్టి మచ్చు తునకగా రీ–ఎంట్రీ ఇప్పించి, పూర్తి స్థాయి రీ–ఎంట్రీకి భరోసా ఇప్పించారాయన. ‘మిస్టర్’ తన సత్తా నిరూపించుకునే సినిమా. మిక్కీ సూపర్ డూపర్ హిట్ పాటలు అందించారు’’ అన్నారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘34 ఏళ్ల కిత్రం వచ్చిన ‘ఖైదీ’ ఓ సంచలనమైతే, ఇప్పుడొచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ మరో సంచలనం. ఆయన ప్రేక్షకుల హృదయాల్లో జీవిత ఖైదీ. నాకు హిట్ రావాలని ఈ చిత్రం తీయలేదు. ప్రేక్షకుల ప్రేమకోసం ప్రేమతో తీశా. వరుణ్ చాలా జెన్యూన్ యాక్టర్. నాకు ఇష్టమైన నటుడు. తను చేస్తుంటే రియల్‌గా అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘అందరివాడు’ టైమ్‌లో వరుణ్ని చూసిన శ్రీను వైట్ల బాగున్నాడన్నారు. తనతో ఓ చిత్రం తీయొచ్చుగా? అన్నా. అప్పుడు ఇచ్చిన మాటను ‘మిస్టర్’తో నిలబెట్టుకున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు నాగబాబు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలని చేస్తుంటా. వాటిలో కొన్ని ఆడాయి.. మరికొన్ని ఆడలేదు.. కానీ మీరు (ఫ్యాన్స్) సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఈ చిత్రం కోసం శ్రీను వైట్లగారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నా కోసం కాకున్నా ఆయన కోసమైనా ఈ చిత్రం హిట్ అవుతుంది. మిక్కీ మంచి పాటలిచ్చాడు. ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి ఎవర్ని పిలుద్దామా? అనుకున్నప్పుడు నా మదిలోకి వెంటనే డాడీ (చిరంజీవి) వచ్చారు. ఫోన్ చేసి అడిగితే, వెంటనే వస్తాన న్నారు’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ– ‘‘ఇందులో చంద్రముఖిగా టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశా. శ్రీను వైట్ల వండర్ఫుల్ డైరెక్టర్. వరుణ్ అమేజింగ్ యాక్టర్’’ అన్నారు. ‘‘కుమారి 21ఎఫ్’ తర్వాత ‘మిస్టర్’కు సైన్ చేశా. ‘మిస్టర్’ కథ నేను వినలేదు. శ్రీను వైట్ల సార్ డైరెక్టర్ అనగానే ఓకే చెప్పేశా. వరుణ్ మంచి కోస్టార్’’ అని హెబ్బా పటేల్ అన్నారు. చిత్రనిర్మాతలు నల్లమలుపు బుజ్జి, ‘ఠాగూర్’ మధు, సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్, నిర్మాతలు ‘దిల్’ రాజు, దామోదర్ ప్రసాద్, సత్యనారాయణ, దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి నిహారిక, నటులు ప్రిన్స్, ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి, బెనర్జీ, రచయితలు శ్రీధర్ సీపాన, గోపీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.