breaking news
pre cautions
-
తగిన జాగ్రత్తలతో హెచ్ఎంపీవీ దూరం
హైదరాబాద్: హెచ్ఎంపీవీ గురించి భయపడాల్సిన అవసరం లేదని, కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని అమీర్‌పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు, ఇంటెన్సివిస్టు డాక్టర్ రత్నబాబు కొల్లాబత్తుల తెలిపారు. ఈ వైరస్ గురించి సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న 300 మంది పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.“హెచ్ఎంపీవీ అనేది సాధారణంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోనే వస్తుంది. గొంతులో ఇబ్బంది ఉండొచ్చు, దగ్గు, జలుబు రావచ్చు. కొద్దిపాటి జ్వరం ఉండే అవకాశం ఉంది. అది బాగా ఎక్కువైతే అప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి, పిల్లికూతల్లా వచ్చి ఆయాసం రావచ్చు. కొందరిలో బ్రాంకైటిస్, న్యుమోనియా లాంటివి కూడా ఉంటాయి. చాలావరకు ఇది సాధారణంగానే ఉంటుంది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, చిన్న పిల్లలకు సమస్య ఎక్కువ కావచ్చు. ఒకటి రెండు రోజులైనా తగ్గకపోతే అప్పుడు వైద్యుల వద్దకు వెళ్లి తగిన సూచనలు తీసుకోవాలి. దీని లక్షణాల్లో ప్రధానంగా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతులో గరగర, ఆయాసం, ఛాతీలో నొప్పి లాంటివి ఉంటాయి. కొందరికి మాత్రం ఒంటిమీద దద్దుర్లు కూడా వస్తాయి.కొత్త వైరస్ కాదుఇదేమీ కొత్తది కాదు.. ఎప్పుడో 2001లోనే నెదర్లాండ్స్‌లో దీన్ని కనుగొన్నారు. చిన్నపిల్లల్లో చాలావరకు ఇన్ఫెక్షన్లకు ఇది కారణం అవుతుంది. 10-15% మందిలో మాత్రమే దీని లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. వ్యాధి ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 2-5 రోజులే ఉంటాయి. తర్వాత దానంతట అదే తగ్గుతుంది. కొద్దిమందికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది ముదిరిపోయి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యుమోనియాలకు దారితీస్తుంది. చాలావరకు దగ్గు, జలుబు లాంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. ఇది సాధారణంగా ఒకరి నుంచి మరొకరికే వస్తుంది. లేదా అప్పటికే వ్యాధి ఉన్నవారికి దగ్గరగా వెళ్లినా, దగ్గు.. తుమ్ముల నుంచి వచ్చే తుంపరల ద్వారా సోకుతుంది. అప్పటికే వ్యాధి ఉన్నవారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, కౌగలించుకున్నా, ముద్దుపెట్టుకున్నా కూడా అది వస్తుంది. తలుపు హ్యాండిళ్లు, బొమ్మలు, ఫోన్లు, ఇతర ఉపరితలాలను వ్యాధి ఉన్నవాళ్లు ముట్టుకుని, వాళ్ల తుంపరలు వాటిమీద పడినప్పుడు వేరేవాళ్లు ముట్టుకుంటే అప్పుడు సోకే అవకాశం ఉంది.ఎవరికి రావచ్చుఐదేళ్లలోపు పిల్లలు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఆస్థమా, సీఓపీడీ, దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి సోకితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తరచు ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నవారు, కీమోథెరపీ తీసుకుంటున్నవారు, అవయవమార్పిడి చేయించుకున్నవాళ్లు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బ్రాంకైటిస్, బ్రాంకియోలైటిస్, న్యుమోనియా, చెవిలో ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయి.గుర్తింపు.. చికిత్సకొవిడ్ తరహాలోనే శ్వాబ్ పరీక్ష ద్వారా దీన్ని గుర్తిస్తాం. కొందరికి ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తాం. మరికొందరికి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందిలో లక్షణాలు తగ్గకపోతే కార్టికో స్టెరాయిడ్స్ అవసరం అవుతాయి. లక్షణాలను బట్టే చికిత్స చేస్తాం తప్ప, దీనికి ప్రత్యేకంగా వైరస్‌ను తగ్గించే మందులంటూ ఏమీ ఉండవు.తీసుకోవాల్సిన జాగ్రత్తలుచేతులు తరచు సరిగా శుభ్రం చేసుకోవాలి. సబ్బు లేదా శానిటైజర్‌తో కడుక్కోవాలి. ముక్కు, నోరు, చెవులు.. వీటిని జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. వీలైనంత వరకు తప్పకుండా మాస్క్ వాడాలి. అనారోగ్యం ఉన్నా, లేకపోయినా ఇది మంచిది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండాలి. కళ్లు, ముక్కు, నోరు.. వీటిని అస్సలు చేతులతో ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకోవాల్సి వస్తే, తప్పనిసరిగా ముందే చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆహారం, పాత్రలను వేరే ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. డీహైడ్రేషన్ అవుతున్నప్పుడు నీళ్లు, ఇతర ఫ్లూయిడ్స్ ఎక్కువగా తాగుతుండాలి. లక్షణాలు బాగా ఎక్కువ అవుతున్నాయనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి” అని డాక్టర్ రత్నబాబు వివరించారు.కార్యక్రమంలో ఇంకా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కళ్యాణి, కమాండెంట్ మురళీకృష్ణ, అడిషనల్ కమాండెంట్ నరేంద్రసింగ్, బెటాలియన్‌కు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు. -
గుండె పదిలంగా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తప్పవు!
ప్రపంచంలోని ఏ దేశంలో లేనంతమంది గుండెజబ్బు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఏటా కోటీ 79 లక్షలమంది గుండెజబ్బులతో చనిపోతున్నారు. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా గుండె జబ్బుల్ని చాలావరకు నివారించవచ్చు. గుండెకు చేటు తెచ్చిపెట్టే ఆరు ముఖ్యమైన అంశాలు... అధిక రక్తపోటు (హై–బీపీ) : ఇది ఓ సైలెంట్ కిల్లర్. దాదాపు 75% గుండెపోట్లకు కారణం. స్థూలకాయులు తమ బరువులో 10 శాతం తగ్గించుకున్నా ఏ మందులూ లేకుండానే హైబీపీని చాలావరకు అదుపు చేయవచ్చు. మధుమేహం: డయాబెటిస్ ఉన్నవారు చాలావరకు గుండెజబ్బుల బారిన పడుతుంటారు. అందుకే 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలను ఏడాదిలో కనీసం రెండుమూడుసార్లు చేయించుకోవాలి. ఒంట్లో కొవ్వులూ, కొలెస్ట్రాల్ : ఆహారంలో కొవ్వులతో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పెరిగి, గుండెకు చేటు తెచ్చిపెడుతుంది. దేహంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ : చాలాకాలం పాటు ఒత్తిడికీ, ఇతర దీర్ఘకాలపు ఇన్ఫెక్షన్లకూ గురవుతూ ఉండటం, నిద్రలేమి, పొగతాగే అలవాట్లు రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినేందుకు దోహదపడతాయి. దాంతో రక్తంలోకి విషపూరితమైన రసాయనాలు విడుదలై రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. గుండెను దృఢంగా ఉంచుకోడానికి చేయాల్సినవి... లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం. ఒకేచోట కూర్చోకుండా నడక... సామర్థ్యం మేరకు పరుగు లేదా జాగింగ్. కార్లూ, బైకులకు బదులు సైకిల్ వాడటం. ∙ఈత, తోటపని చేస్తూ ఉండటం. ∙పొగతాగడం, నిద్రలేమికి దూరంగా ఉండటం... ఇవన్నీ దేహానికీ, దాంతోపాటు గుండెకూ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. డా‘‘ ప్రదీప్ కె. రాచకొండ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జరీ. (చదవండి: భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త) -
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ పెనుమూడి (రేపల్లె): కృష్ణా పుష్కరాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ చెప్పారు. పెనుమూడి పుష్కరఘాట్‌ను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని భావిస్తుండడంతో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పుష్కరఘాట్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పాత నేరస్తుల కదలికలను పసిగట్టే విధంగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా విధి విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను నిర్ణయించామన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఆయన వెంట బాపట్ల, నరసరావుపేట డీఎస్పీలు పి.మహేష్, నాగేశ్వరరావు, పట్టణ, రూరల్ సీఐలు వి.మల్లికార్జునరావు, పెంచలరెడ్డి, ఎస్ఐలు పి.సురేష్, అహ్మద్‌జానీ, రవీంద్రారెడ్డి, కూచినపూడి మార్కెట్‌యార్డు చైర్మన్ పంతాని మురళీధరరావు, నాయకులు అనగాని శివప్రసాద్, సుఖవాసి సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.