breaking news
Pre
-
ఐపీవో గ్రే మార్కెట్‌కు సెబీ చెక్
ముంబై: ఐపీవోకంటే ముందు(ప్రీ ఐపీవో) లావాదేవీల నిర్వహణకు అధికారిక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ప్రస్తుత అనధికార(గ్రే) మార్కెట్ లావాదేవీలకు చెక్ పెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. వెరసి నియంత్రణలకు లోబడి ప్రీఐపీవో లావాదేవీలు చేపట్టేందుకు కొత్త ప్లాట్‌ఫామ్ ఇన్వెస్టర్లను అనుమతించనుంది. ఐపీవో కేటాయింపులు(అలాట్మెంట్), స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ మధ్య మూడు రోజులపాటు లావాదేవీలకు వీలు కల్పించనుంది. దీంతో ప్రస్తుత గ్రే మార్కెట్ స్థానే నియంత్రిత లావాదేవీల ప్లాట్‌ఫామ్‌కు సెబీ తెరతీయనున్నట్లు పాండే వెల్లడించారు. అయితే ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రీలిస్టింగ్ సమాచారం ఒక్కటే సరిపోదని 2025 ఫిక్కీ క్యాపిటల్ మార్కెట్ సదస్సు సందర్భంగా సెబీ చీఫ్ స్పష్టం చేశారు. క్యాపిటల్ మార్కెట్లను మరింత విస్తరించడంతోపాటు.. ఇన్వెస్టర్ల పరిరక్షణకు వీలుగా నియంత్రణలతోకూడిన ప్రీఐపీవో ట్రేడింగ్‌ను పరిశీలనాత్మకంగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు.నగదు ఈక్విటీ మార్కెట్‌పై దృష్టిఈక్విటీ డెరివేటివ్స్ గడువు(ఎక్స్పైరీ)లోనూ మార్పులు చేపట్టనున్నట్లు పాండే సంకేతమిచ్చారు. వీటి కాలావధి, ఎక్స్పైరీని ఒక క్రమపద్ధతిలో పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది(2024–25) 91 శాతం వ్యక్తిగత ట్రేడర్లు నష్టపోయిన ఇలాంటి ప్రొడక్టులకు కళ్లెం వేసే వీలుంటుందని పేర్కొన్నారు. నగదు ఈక్విటీ మార్కెట్లను విస్తరించే బాటలో ఈక్విటీ డెరివేటివ్స్‌లో మార్పులు తీసుకురానున్నట్లు తెలియజేశారు. దీర్ఘకాలిక గడువుగల ప్రొడక్టులను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ నాణ్యతను సైతం పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే సంబంధిత వర్గాలతో చర్చలు చేపట్టాక, ఒక క్రమపద్ధతిలో డెరివేటివ్ ప్రొడక్టుల మెచూరిటీపై నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. దీంతో హెడ్జింగ్, దీర్ఘకాలిక పెట్టుబడులకు దన్నునివ్వనున్నట్లు వివరించారు. నగదు విభాగంలో పరిమాణం భారీగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్లలో లావాదేవీల పరిమాణం రెట్టింపైనట్లు తెలియజేశారు. పారదర్శకత కీలకమని, దీంతో క్యాపిటల్ మార్కెట్లలో నిధుల సమీకరణకు వీలుంటుందని వివరించారు. -
Hyderabad: వెలుగులోకి మరో ప్రీ లాంచ్ మోసం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల ఘరానా మోసం బయటపడింది. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్‌కు కోట్లు రూపాయలు చెల్లింపులు చేసిన 250 మంది బాధితులను ముంచేశారు. ఐదేళ్ల కిందట ప్రాజెక్ట్ మొదలు పెట్టిన భారతీయ బిల్డర్స్.. కనీసం 25 శాతం పనులు కూడా చేయలేదు.బాధితులకు సాకులు చెబుతూ వచ్చారు. అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి భారతీయ బిల్డర్స్ ల్యాండ్ అమ్మేశారు. దీంతో బిల్డర్స్‌ను బాధితులు ప్రశ్నించారు. బిల్డర్స్, సునీల్ అహుజా అనే వ్యక్తి బాధితులపై బెదిరింపులకు దిగారు. భారతీయ బిల్డర్స్‌తో పాటు సునీల్ అహుజాపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది. మోసం చేసి ఆ తర్వాత భారతీయ బిల్డర్స్ పేరును శ్రీభారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా కేటుగాళ్లు మార్చేశారు.ఈ కంపెనీకి 60 శాతం ఆశిష్ అహూజా, మిగిలిన నలభై శాతం వాటాలో భారతీ బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణ లో పేరుతో షేర్లు ఉన్నాయి. ఇలా పేర్లు మారుస్తూ అమాయకులను నట్టేట ముంచుతున్నారు.సిరిసింపద ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్, భారతీ బిల్డర్స్, శ్రీ భారతీ బిల్డర్స్, భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఇలా పేర్లు మారుస్తున్న నిందితులు.. భానూరు, కోకోపేట్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రీలాంచ్ పేరుతో మోసాలకు తెరతీశారు. సునీల్ కుమార్ అహూజా, ఆశిష్ అహూజా, నాగరాజు, శివరామకృష్ణలను అరెస్టు చేయాలని.. తమ నగదును తిరిగి ఇప్పించాలంటున్న బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
విజయవాడలో ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
పథకం ప్రకారం హత్య చేశారా..?
లాడ్జిలో కుటుంబం ఆత్యహత్యాయత్నంలో కానరాని తల్లిదండ్రులు భార్యభర్తలపై హత్య కేసు నమోదు సామర్లకోట : ఇద్దరు ఆడపిల్లలు కావడం వల్లనే పథకం ప్రకారం భార్యభర్తలు పిల్లలకు డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి హత్య చేశారని పట్టణంలో భారీగా ప్రచారం జరుగుతోంది. లాడ్జిలో ఒక కుటుంబం ఆత్యహత్యాయత్నం అనే విషయం పాఠకులకు విదితమే. పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు ఎంతగానో అల్లాడిపోతారు. అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలు మరణించారని తెలిసి అదృశ్యం కావడంతో పాటు ఫోన్‌కు కూడా చిక్కకుండా పోయారు. దాంతో సామర్లకోట పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్‌లో గాలింపునకు తరలి వెళ్లారు. స్థానిక స్టేషన్ సెంటర్లో ఉన్న ఒక లాడ్జిలో పిల్లలు శిరీష (9) అనూష (7)లతో భార్యభర్తలు కొడూరి సత్యనారాయణ, గౌరమ్మలు దిగిన విషయం విదితమే. కుటుంబం అంతా కలిసి పురుగు మందు తాగినట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదనే వాదనలు ఉన్నాయి. పురుగు మందు తాగిన వెంటనే తల్లిదండ్రులకు వాంతులు కావడంతో బతికి బయట పడ్డారనే వాదనలు వచ్చాయి. లాడ్జి రూములో వాంతులకు సంబంధించిన గుర్తులు కనిపించలేదు. దీనికి తోడు వారు లాడ్జి నుంచి బయటకు వెళ్లిన సమయంలో వారిలో ఎటువంటి నీరసం కనిపించలేదని లాడ్జి గుమస్తా తెలిపారు. దాంతో పిల్లలతో పురుగు మందు తాగించి భార్యభర్తలు అదృశ్యం అయ్యారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి గాలింపు చేస్తున్నారు.పాఠశాలలు తీసిన సమయంలో పుణ్య క్షేత్రాలు ఏమిటనే ఆలోచన బంధువులకు రాకపోవడమే చిన్నారుల మృతికి దారి తీసింది. పెద్దాపురంలో ఖననం పెద్దాపురం : చిన్నారుల మృతదేహాలకు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు పోలీసులకు అప్పగించారు. వారు పెద్దాపురంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేశారు. -
సెకన్లలో పరీక్షలు..చిటికెలో మందులు
చుట్టూ చూస్తే అది ఆసుపత్రి అని అస్సలు అనిపించదు.. మందుల వాసన, ఆకుపచ్చటి తెరలు కూడా ఉండవు.. రిసెప్షన్ దాటుకుని లోపలికెళ్లగానే.. నిలువెత్తు స్కానర్ ఒకటి ఉంటుంది. బరువు చూసుకునే యంత్రంలా ఉండే దీనిపై ఎక్కి నిలుచుంటే చాలు.. సెకన్లలో మీ బీపీ, హార్ట్‌రేట్, రక్తంలో కొవ్వులు, చక్కెర మోతాదులు నమోదైపోతాయి. అక్కడి నుంచి కొంచెం పక్కకు తిరిగితే గోడ మొత్తం పరచుకున్న స్క్రీన్‌పై మీ వివరాలు ప్రత్యక్షం. తెర పక్కనే నవ్వుతూ ఓ డాక్టర్. మీ కష్టాలు ఆయనతో మాట్లాడుతుండగానే.. అవి రికార్డయిపోవడం.. మీ సమస్యల పరిష్కారానికి తగిన వైద్య సూచనలు తెరపై ప్రత్యక్షం కావడం చకచకా జరిగిపోతుంటాయి. ఇంతలోపే మీరు తీసుకోవాల్సిన మందులు, వాటి వివరాలు మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్షం! ఏంటిది.. సైన్స్ ఫిక్షన్ స్టోరీ అనుకుంటున్నారా, అస్సలు కాదు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఈ మధ్యే ఏర్పాటైన సూపర్ హైటెక్ ఆసుపత్రి పనిచేసే తీరిది! పేరు ‘ఫార్వర్డ్’. అవసరమొచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లడం.. ఫీజు చెల్లించడం మందులు తెచ్చుకోవడం మనం చేసే పని. కానీ ఫార్వర్డ్‌లో ఇలా ఉండదు. నెలకు రూ.పది వేలు (149 డాలర్లు) చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా ఫార్వర్డ్లోకి చేరిపోవచ్చు. అంతేకాదు.. ఒకసారి సభ్యత్వం తీసుకుంటే చాలు.. సాధారణమైన పరీక్షలతోపాటు మీ జన్యుక్రమం మొత్తాన్ని విశ్లేషించి భవిష్యత్తులో మీకు రాగల జబ్బులను అంచనా కట్టి వాటి నివారణకు ప్రయత్నాలు మొదలుపెడుతుంది ఈ సంస్థ. అంతా కృత్రిమ మేధ మహిమ... సాధారణ ఆసుపత్రులకు పూర్తి భిన్నంగా పనిచేసే ఫార్వర్డ్ క్లినిక్‌లలోనూ వైద్యులు ఉంటారు. అయితే ఇతరుల మాదిరి బీపీ, పల్స్రేట్లు చెక్ చేస్తూ.. ప్రిస్క్రిప్షన్లు రాస్తూ టైమ్ వృథా చేయరు. ఈ పనులన్నీ కంప్యూటర్లు, హైటెక్ సెన్సర్లు చూసుకుంటాయి. తద్వారా వైద్యులు రోగులకు మెరుగైన చికిత్స అందించడం ఎలా అనే అంశంపై దృష్టి పెట్టవచ్చు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ సాయంతో ఫార్వర్డ్‌లో అన్ని పనులు ఆటోమేటిక్‌గా జరిగిపోతూంటాయి. బాడీ స్కానర్ 30 సెకన్లలో అందించే వివరాలు నేరుగా రోగి తాలూకూ రికార్డుల్లోకి ఎలక్ట్రానిక్ రూపంలో చేరిపోతాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసే పని కూడా లేకుండా.. ఆయన చెప్పే మాటలను రికార్డు చేసుకుని ఫార్మసీ సిబ్బంది అవసరమైన మందులను సిద్ధం చేస్తారు. ఎవరి ఆలోచన? ఫార్వర్డ్‌ను స్థాపించింది ఆడ్రియాన్ ఔన్. గూగుల్ కంపెనీలో స్పెషల్ ప్రాజెక్ట్స్ విభాగానికి ఈయన అధ్యక్షుడిగా పనిచేశారు. ‘ప్రపంచంలో చాలా రంగాల్లో మార్పులు వచ్చాయి కానీ.. వైద్యంలో మాత్రం పరిస్థితి మారలేదు. అందుకే ఫార్వర్డ్‌ను స్థాపించాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది’అని అంటున్నారు ఆయన. కేవలం రోగమొచ్చినప్పుడు మందులిచ్చే వ్యవస్థగా ఫార్వర్డ్ పనిచేయదని, వ్యక్తి జన్యువివరాల ఆధారంగా భవిష్యత్తులో వచ్చే సమస్యలకూ ముందస్తు పరిష్కారాలు కనుక్కునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. క్లినిక్‌లో సభ్యుడిగా చేరిన ప్రతి ఒక్కరికీ వారి అవసరాలను బట్టి కొన్ని సెన్సర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఇస్తామని.. వీటిద్వారా అందే సమాచారంతో సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సభ్యత్వానికి వసూలు చేస్తున్న రూ.పదివేలు చౌక మాత్రం కాదని, కాకపోతే భవిష్యత్తులో వినియోగదారుల సంఖ్య ఆధారంగా గణనీయంగా తగ్గే అవకాశముందని సూచిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రీ, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : కేంద్ర ప్రభుత్వం 2016–17 విద్యా సంవత్సరానికి అందించే ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీకార్పొరేషన్ ఈడీ జమీర్ అహమ్మద్ కోరారు. దరఖాస్తులను ఈ నెల 31 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 10 తరగతి చదువుతున్న మైనార్టీ విద్యార్థులందరూ అర్హులేనని ఆయన తెలిపారు.ఆన్లైన్ చేసిన దరఖాస్తు లను సంబంధిత కాపీలను జతపరిచి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–246615 నంబరులో సంప్రదించాలన్నారు. -
మెడిసిన్ బాబా
జ్వరమో, జలుబో లేదా మరే రోగమో వస్తే... డాక్టరు దగ్గరకు వెళ్తాం. ఆయన రాసిచ్చిన మందులను కొంటాం. వాడతాం. రెండు, మూడు రోజుల్లో కొంచెం నయమనిపించగానే వాటిని వాడటం మానేస్తాం. మనందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఏ ఇంట్లో చూసినా వాడకుండా వదిలేసిన మందులు కుప్పలుగా ఉంటాయి. వాడని వాటిని మందులషాపులో వెనక్కి ఇచ్చి డబ్బు తెచ్చుకునే వారు ఏ కొందరో! ఇలా జనం దగ్గర వృథాగా పడున్న మందులను సేకరించి... మందులు కొనే శక్తిలేని నిరుపేదలకు అందజేస్తే... అంతకన్నా మానవసేవ ఏముంటుంది! ఇదే బృహత్కార్యాన్ని చేస్తున్నారీయన. అందుకే ఢిల్లీలోని పేదలు ఈయన్ని ‘మెడిసిన్ బాబా’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అసలు పేరు ఓంకార్ నాథ్. బ్లడ్ బ్యాంకులో టెక్నీషియన్‌గా పనిచేసి రిటైరయ్యారు. వయసు 79 ఏళ్లు. మొదటి ఫోటోలో కనిపిస్తున్నట్లుగా కాషాయవస్త్రాలు ధరించి ఇంటింటికీ వెళ్లి మందులు సేకరిస్తారు. రోజుకు ఏడు కిలోమీటర్లు ఇలా తిరుగుతారు. తర్వాత ఇంటికొచ్చి ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో చూసి... పనికొచ్చే వాటిని వేరుచేస్తారు. వాటిని తీసుకెళ్లి తన అద్దె ఇంట్లోని ముందు రూములో ఉంచుతారు. అదో మెడికల్ హాలులాగే ఉంటుంది. తన దగ్గరకు వచ్చే పేదలకు ప్రిస్కిప్షన్ చూసి మందులిస్తారు. గత ఎనిమిదేళ్లుగా ఈ పనిచేస్తున్నారీయన... హ్యాట్సాఫ్ టు యూ మెడిసిన్ బాబా.