breaking news
pratul Joshi
-
తొలి రౌండ్లోనే సిరిల్, రాహుల్ ఓటమి
సారావక్ (మలేసియా): మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ఆటగాళ్లు సిరిల్ వర్మ, చిట్టబోయిన రాహుల్ యాదవ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. భారత్‌కే చెందిన హర్షీల్ దాని, ప్రతుల్ జోషి, హేమంత్ గౌడ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో సిరిల్ వర్మ 10–21, 21–18, 17–21తో పనావత్ తోంగ్‌నువామ్ (థాయ్‌లాండ్) చేతిలో, రాహుల్ యాదవ్ 16–21, 11–21తో సుయె సువాన్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. హర్షీల్ 21–19, 21–17తో జి జియా లీ (మలేసియా)పై, ప్రతుల్ జోషి 15–21, 21–16, 24–22తో జిన్ రీ రియాన్ ఎన్జీ (సింగపూర్)పై, హేమంత్ 21–14, 21–15తో యెహిజకిల్ మైనాకి (ఇండోనేసియా)పై విజయం సాధించారు. -
ప్రతుల్‌కు తొలి టైటిల్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ యువతార ప్రతుల్ జోషి తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. బహ్రెరుున్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల ప్రతుల్ 21-17, 12-21, 21-15తో తన తమ్ముడు ఆదిత్య జోషిపై విజయం సాధించాడు. సెమీఫైనల్స్‌లో ప్రతుల్ 21-16, 22-20తో సిద్ధార్థ్ ఠాకూర్ (భారత్)పై నెగ్గగా... ప్రపంచ జూనియర్ మాజీ నంబర్‌వన్ ఆదిత్య 21-19, 21-7తో టాప్ సీడ్ ఆనంద్ పవార్ (భారత్)పై సంచలన విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో విఘ్నేశ్ దేవాల్కర్-రోహన్ కపూర్ జోడీ; మహిళల డబుల్స్‌లో ఫర్హా మాథెర్-ఆష్నా రాయ్ జంట రన్నరప్‌గా నిలిచారుు.